S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/02/2017 - 00:33

చెన్నై, జనవరి 1: చెన్నైలో టెన్నిస్ ఫీవర్ నెలకొంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న చెన్నై ఓపెన్‌తో ఈ ఏడాది తొలి ఎటిపి టోర్నమెంట్ సీజన్ మొదలవుతుంది. గతంలో మూడు పర్యాయాలు టైటిల్ సాధించిన స్టానిస్లాస్ వావ్రిన్కా ఈసారి బరిలోకి దిగడం లేదు. దీనితో మారిన్ సిలిక్‌కు టాప్ సీడింగ్ లభించింది. రాబర్టొ బటిస్టా అగట్, అల్బర్ట్ రామోస్ వినోలాస్ రెండు, మూడు సీడ్స్‌గా పోటీపడతారు.

01/02/2017 - 00:31

సిడ్నీ, జనవరి 1: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్పీప్ చేయడమే లక్ష్యంగా, మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టులో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. వరుస పరాజయాల నుంచి బయటపడిన స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆసీస్ ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలను సాధించింది.

01/02/2017 - 00:30

హైదరాబాద్, జనవరి 1: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) టోర్నీ ఆదివారం మొదలుకాగా, మొదటి మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్టార్ పివి సింధు పరాజయాన్ని చవిచూసింది. రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో సింధును ఓడించిన కరోలినా మారిన్ ఈ టోర్నీలో హైదరాబాద్ హంటర్స్ తరఫున ఆడుతూ, తొలి మ్యాచ్‌లో 11-8, 12-14, 11-2 తేడాతో విజయం సాధించింది.

01/01/2017 - 00:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొంత మంచి, కొంత చెడు.. కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు.. కొన్ని శిఖరాలు, మరికొన్ని వైఫల్యాలు.. మొత్తం మీద గతంతో పోలిస్తే 2016 కొంత వరకు ఫరవాలేదనిపించినా, క్రికెట్, బాడ్మింటన్, టెన్నిస్ వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే, మిగతా అన్ని క్రీడల్లోనూ ఎదురైన పరాభవాలు సరికొత్త పాఠాలను నేర్పాయి. కొత్త ఏడాది అంతర్జాతీయ వేదికలపై మెరిసేందుకు భారత క్రీడా రంగం సమాయత్తమవుతున్నది.

01/01/2017 - 00:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన నిషేధంపై ముందుగా అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి)ని సంప్రదిస్తానని, ఆతర్వాత కేంద్రంతో చర్చిస్తానని భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) అధ్యక్షుడు రామచంద్రన్ తెలిపాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను జీవితకాల ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న ఐఒఎ తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

01/01/2017 - 00:44

నీల్సన్, డిసెంబర్ 31: బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన చివరి వనే్డను 8 వికెట్ల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు సాధించగా, న్యూజిలాండ్ లక్ష్యాన్ని మరో 52 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

01/01/2017 - 00:36

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 31: క్రీడా సంఘాల్లో కళంకితులను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) గుర్తింపును భారత ప్రభుత్వం రద్దు చేసిందని శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ చెప్పారు. ఆయన శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ఆఫీసులో మాట్లాడుతూ కల్మాడీ, అభయ్ సిం గ్ చౌతాలా ఎన్నిక తీర్మానాన్ని ఉపసంహరించుకు నే వరకూ ఐఒఎను కేంద్రం సస్పెండ్ చేయడాన్ని స మర్థించారు.

01/01/2017 - 00:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారత్‌లో జాతీయ ఒలింపిక్ సంఘం (ఎన్‌ఒసి)పై సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) మీడియా రిలేషన్స్ మేనేజర్ మైఖేల్ నోయెల్ తెలిపాడు. దేశానికి ఎన్‌ఒసిగా ఉన్న ఐఒఎ గుర్తింపును రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో, గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.

12/31/2016 - 00:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ)పై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను జీవితకాల ఉపాధ్యక్షులుగా ఎన్నుకొన్న ఐఒఎ అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ చర్యపై ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వని కారణంగా సస్పెన్షన్‌కు గురైంది. అధ్యక్షుడు ఎన్.

12/31/2016 - 00:14

న్యూఢిల్లీ: ఐఒఎ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ పదవికి నరీందర్ బాత్రా రాజీనామా చేశాడు. కల్మాడీ, చౌతాలాలకు జీవితకాల ఉపాధ్యక్ష పదవులను కట్టబెట్టడంపై బాత్రా అభ్యంతరం వ్యక్తం చేశాడు. చెడు సంప్రదాయాలకు తెరతీసే ఇలాంటి చర్యలను తాను ఏమాత్రం సమర్ధించబోనని ఇటీవలే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఎన్నికైన బాత్రా స్పష్టం చేశారు.

Pages