S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/22/2016 - 08:15

ప్రేగ్, డిసెంబర్ 21: ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో గాయపడిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా కెరీర్ ప్రమాదంలో పడింది. ఆమె టెన్నిస్ ఆడే ఎడమ చేతికి బలమైన గాయాలు కావడంతో, భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆందోళన అభిమానులను వెంటాడుతున్నది. కెరీర్‌ను దృష్టిలో ఉంచుకొని వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు.

12/22/2016 - 08:14

బెంగళూరు, డిసెంబర్ 21: భారత క్రికెట్ జట్టు స్వదేశంలో పులిలా విజృంభిస్తుందని, అయితే, విదేశాల్లో పిల్లిలా మారిపోతుందని చాలా సంవత్సరాలుగా ఉన్న ముద్రను చెరిపేయడానికి కృషి చేస్తామని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. విదేశాల్లోనూ సత్తా చాటుతామని బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రంమలో పాల్గొన్న తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ జడేజా ధీమా వ్యక్తం చేశాడు.

12/22/2016 - 08:14

పాట్నా, డిసెంబర్ 21: విరాట్ కోహ్లీ కెప్టెన్సీయే భారత్‌కు బలమని, ఆ జట్టు ఇటీవల కాలంలో సాధిస్తున్న విజయాలకు అతని సామర్థ్యమే ప్రధాన కారణమని శ్రీలంక మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య ప్రశంసించాడు. దయాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అతను భారత మాజీ వికెట్‌కీపర్ సాబా కరీంను సన్మానించాడు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కోహ్లీని సమర్థుడైన కెప్టెన్‌గా అభివర్ణించాడు.

12/21/2016 - 02:01

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌ను భారత జట్టు ఘనంగా ముగించింది. చెన్నైలో జరిగిన చివరి టెస్టులో 75 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో అత్యద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన స్పిన్నర్ రవీంద్ర జడేజా మ్యాచ్ చివరి రోజునా హీరోగా నిలిచాడు.

12/21/2016 - 01:03

చెన్నై, డిసెంబర్ 20: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌ను భారత జట్టు అత్యద్భుతమైన రీతిలో ఎంతో ఘనంగా ముగించింది. చెన్నైలో జరిగిన చివరి టెస్టులో ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న భారత జట్టు 4-0 తేడాతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

12/21/2016 - 00:53

దుబాయ్, డిసెంబర్ 20: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం చెన్నైలో ముగిసిన చివరి మ్యాచ్‌లో మారోసారి ఆధిపత్యాన్ని చాటుకుని ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన టీమిండియా ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్ల జాబితాలోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లి ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికింది.

12/21/2016 - 01:06

చెన్నై, డిసెంబర్ 20: భారత జట్టు వరసగా 18 టెస్టుల్లో విజయం సాధించినప్పటికీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం దానికి పొంగిపోవడం లేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఈ పునాదిపై జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ‘రెండు పరాజయాలు మినహాయిస్తే ఒక జట్టుగా2016 సంవత్సరం మాకు చాలా మంచి సంవత్సరంగానే మిగిలింది.

12/21/2016 - 00:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మూడోసారి ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం న్యూఢిల్లీలో జరిగే ఎఐఎఫ్‌ఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలపై ఢిల్లీ హైకోర్టు కొద్ది రోజుల క్రితం విధించిన స్టేని మంగళవారం ఎత్తివేయడంతో ఎన్నికలకు ద్వారాలు తెరుచుకున్నాయి.

12/21/2016 - 00:46

ప్రాగ్, డిసెంబర్ 20 ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండుసార్లు చాంపియన్‌షిప్ సాధించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాపై గుర్తు తెలియని ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. చెక్ రిపబ్లిక్ తూర్పు ప్రాంతంలోని ప్రొస్తెజోవ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

12/21/2016 - 00:45

చెన్నై, డిసెంబర్ 20: భారత్‌తో సిరీస్‌ను కోల్పోయిన దృష్ట్యా టెస్ట్ కెప్టెన్సీపై ఎలాంటి తెలివితక్కువ నిర్ణయాన్ని తాను తీసుకోబోనని, అయితే నాయకత్వ పాత్రకు తగిన వాడినో కాదో ఆలోచించడానికి తనకు కొంత సమయం అవసరమని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఆలిస్టర్ కుక్ అన్నాడు.

Pages