S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

303
12/20/2016 - 01:36

303

12/20/2016 - 01:21

చెన్నై, డిసెంబర్ 19: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లోనే టెస్టు కెరీర్‌ను ఆరంభించి, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కరుణ్ నాయర్ తన మూడో టెస్టులో అనుకున్నది సాధించాడు. ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. నాటౌట్‌గా నిలిచి, భారత్ భారీ స్కోరుకు సహకరించాడు.

12/20/2016 - 01:02

* కరుణ్ నాయర్ భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. వీరేందర్ సెవాగ్ రెండు పర్యాయాలు ఈ ఫీట్ సాధించాడు. 2004 మార్చి 28న పాకిస్తాన్‌తో ముల్తాన్ టెస్టు ఆడుతూ అతను 309 పరుగులు సాధించాడు. సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత, 2008లో అదే రోజున, చెన్నైలో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాడు.

12/20/2016 - 01:00

చెన్నై, డిసెంబర్ 19: ఆల్‌రౌండర్‌గా తనను తాను నిరూపించుకుంటున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి, ఐదో టెస్టు మ్యాచ్, నాలుగో రోజు ఆటలో అరుదైన మైలురాయిని చేరాడు. 149 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేసిన అతను ఈ సిరీస్‌లో 250 పరుగులు మైలురాయిని అధిగమించాడు. ఒకే సిరీస్‌లో కనీసం 25 వికెట్లు పడగొట్టి, 250కిపైగా పరుగులు చేసిన అరుదైన ఆటగాళ్ల సరసన స్థానం సంపాదించాడు.

12/20/2016 - 00:59

బ్రిస్బేన్, డిసెంబర్ 19: ఆస్ట్రేలియాతో డే/నైట్ ఈవెంట్‌గా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓటమిని అంగీకరించడానికి సిద్ధపడని పాక్ క్రికెటర్లు జట్టును గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. కానీ, చివరి రోజు ఆట మొదలయ్యే సమయానికి ఎక్కువ వికెట్లు చేతిలో లేకపోవడంతో, 39 పరుగుల తేడాతో పాక్‌కు ఓటపి తప్పలేదు.

12/20/2016 - 00:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ వేలానికి అందుబాటులో ఉండేందుకు జాతీయ క్రికెటర్ ఇశాంత్ శర్మను రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. ప్రతి ఫ్రాంచైజీ వేలానికి ముందు కొంత మంది ఆటగాళ్ల కొనసాగిస్తూ, మరి కొంత మందిని వేలం కోసం రిలీజ్ చేస్తారు. పుణే ఈసారి రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఇశాంత్ పేరు ఉంది. గత ఏడాది ఆ ఫ్రాంచైజీ అతనిని 3.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

12/20/2016 - 00:56

కొచ్చి, డిసెంబర్ 19: ఆటగాళ్లంతా సమష్టిగా కృషి చేసి, సర్వశక్తులు ఒడ్డడం వల్లే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టైటిల్‌ను గెల్చుకోగలిగామని అట్లెటికో డి కోల్‌కతా కోచ్ జొస్ ఫ్రాన్సిస్కో మోలినా అన్నాడు. 2014లో తొలి ఐఎస్‌ఎల్ టోర్నీ ఫైనల్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను 1-0 తేడాతో ఓడించి టైటిల్‌ను అట్లెటికో కోల్‌కతా గెల్చుకుంది. 2015లో చెనె్నయిన్ విజేతగా అవతరించింది. ఫైనల్‌లో గోవాను ఆ జట్టు 3-2 తేడాతో ఓడించింది.

12/19/2016 - 04:02

చెన్నై, డిసెంబర్ 18: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి, ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఎదురుదాడికి దిగింది. లోకేష్ రాహుల్ దురదృష్టవశాత్తు కేవలం ఒక పరుగు తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నప్పటికీ, భారత్‌ను పటిష్టమైన స్థితిలో నిలబెట్టాడు. పార్థీవ్ పటేల్, కరుణ్ నాయర్ కూడా అర్ధ శతకాలతో రాణించడంతో, మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లకు 391 పరుగులు చేసింది.

12/19/2016 - 04:00

లక్నో, డిసెంబర్ 18: ఒకటిన్నర దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సీనియర్లకు అసాధ్యంగా మారిన ప్రపంచ కప్‌ను కుర్రాళ్లు సాధించారు. భవిష్యత్తు తమదేనని నిరూపించుకున్నారు. హరేంద్ర సింగ్ శిక్షణలో రాటుదేలిన భారత జూనియర్ హాకీ జట్టు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో బెల్జియంపై 2-1 తేడాతో విజయభేరి మోగించి, రెండోసారి ఈ టైటిల్‌ను గెల్చుకుంది.

12/19/2016 - 03:58

బ్రిస్బేన్, డిసెంబర్ 18: అసద్ షఫీక్ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలవగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి, డే/నైట్ టెస్టులో పాకిస్తాన్ హోరాహోరీ పోరాటాన్ని కొనసాగిస్తున్నది. విజయం సాధించాలంటే 490 పరుగుల భారీ స్కోరు సాధించాల్సి ఉండగా, రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ నాలుగో రోజు ఆటలో ఎదురుదాడికి దిగింది.

Pages