S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/19/2016 - 03:55

చెన్నై: ఇంగ్లాండ్‌పై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో సునీల్ గవాస్కర్ తర్వాతి స్థానాన్ని లోకేష్ రాహుల్ దక్కించుకున్నాడు. 1979 ఆగస్టు 30న, ది ఓవల్ మ్యాచ్‌లో గవాస్కర్ 221 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌లో రాహుల్ 199 పరుగులు సాధించాడు. 1964 జనవరి 10న చెన్నైలోనే బుధీ కుందరన్ 192 పరుగులు చేసి అవుటయ్యాడు.

12/19/2016 - 03:54

చెన్నై: టెస్టుల్లో 90 పరుగులు సాధించిన తర్వాత సెంచరీ పూర్తి చేయలేకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అదే విధంగా 190 పరుగులు దాటిన తర్వాత డబుల్ సెంచరీని అందుకోవడంలో విఫలమైన వారూ ఉన్నారు. ఎక్కువ పరుగుల తేడాతో సెంచరీ లేదా డబుల్ సెంచరీని కోల్పోవడం ఒక ఎత్తయితే, కేవలం ఒక పరుగు తేడాతో ఈ మైలురాయిని చేరుకోలేకపోవడం మరో ఎత్తు.

12/19/2016 - 03:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వచ్చే ఏడాది కూడా వివిధ స్థాయి పోటీల్లో ఎక్కువ టైటిళ్లు సాధించడంపైనే తాను గురిపెట్టానని, కాబట్టి ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని పట్టించుకోబోనని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ స్పష్టం చేశాడు. ఫ్రాన్సిస్ చెకాతో జరిగిన ఫైట్‌ను కేవలం పది నిమిషాల్లోనే విజయం సాధించిన విజేందర్ డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను స్వీకరించాడు.

12/19/2016 - 03:52

చిత్రం..యొకొహొమా (జపాన్)లో ఆదివారం జరిగిన ఫైనల్‌లో కషిమా ఆంట్లెర్స్‌ను
4-2 తేడాతో ఓడించి, ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ట్రోఫీని సాధించిన రియల్ మాడ్రిడ్ జట్టు

12/19/2016 - 03:50

దుబాయ్, డిసెంబర్ 18: వరల్డ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ ఫైనల్స్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సెన్, మహిళల సింగిల్స్‌లో తాయ్ జూ ఇంగ్ టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఆదివారం నాటి ఫైనల్‌లో హాట్ ఫేవరిట్, మూడో సీడ్ తియాన్ హౌవెయ్‌పై అక్సెల్సెన్ 21-14, 6-21, 21-17 తేడాతో విజయం సాధించాడు.

12/19/2016 - 03:11

లక్నోలో జరిగిన జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను సాధించిన భారత జట్టు. బెల్జియంతో ఆదివారం నాటి ఫైనల్‌లో భారత్ 2-0 తేడాతో గెలిచి, 15 సంవత్సరాల తర్వాత జూనియర్ హాకీ ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.

12/18/2016 - 05:16

చెన్నై, డిసెంబర్ 17: కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న లియామ్ డాసన్, స్పిన్నర్ అదిల్ రషీద్ అర్ధ శతకాలతో రాణించడంతో, భారత్‌తో జరుగుతున్న ఐదవ, చివరి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌటైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 284 పరుగులు చేసిన ఈ జట్టు శనివారం ఉదయం ఆటను కొనసాగించి ఐదో వికెట్‌గా బెన్ స్టోక్స్‌ను కోల్పోయింది.

12/18/2016 - 05:16

* భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లు బౌల్ చేసి, 151 పరుగులు సమర్పించుకొని కేవలం ఒక వికెట్ తీశాడు. అతను ఈ విధంగా ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులిచ్చి, మూడు లేదా అంతకంటే తక్కువ వికెట్లు పడగొట్టడం ఇది ఐదోసారి. కాగా, ఇప్పుడు సొంత గడ్డపై అశ్విన్ విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది.

12/18/2016 - 05:11

* ఇంగ్లాండ్ తరఫున కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా లియామ్ డాసన్ రికార్డు సృష్టించాడు. అతను 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, చరిత్ర పుటల్లో చోటు సంపాదించాడు. 1979లో డేవిడ్ బెయిర్‌స్టో 59 పరుగులతో నెలకొల్పిన రికార్డును డాసన్ బద్దలు చేశాడు.ఈ సిరీస్‌లో ఎనిమిదో వికెట్‌కు ఇప్పటి వరకూ సగటున 48.76 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

12/18/2016 - 05:09

లక్నో, డిసెంబర్ 17: చారిత్రక విజయంపై భారత యువ హాకీ జట్టు కనే్నసింది. జూనియర్ ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆదివారం బెల్జియంతో జరిగే ఫైనల్‌లో విజయమే లక్ష్యంగా ఎంచుకుంది. 2001 తర్వాత మొదటిసారి టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి అన్ని విధాలా సిద్ధమైంది. భారత జట్టు జూనియర్ ప్రపంచ కప్ హాకీలో ఫైనల్ చేరడం ఇది మూడోసారి.

Pages