S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/18/2016 - 05:06

దుబాయ్, డిసెంబర్ 17: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ టోర్నమెంట్ మహిళల సెమీ ఫైనల్‌లో భారత క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పివి సింధు ఓటమిపాలైంది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు తన కంటే రెండు ర్యాంకులు మెరుగ్గా ఉన్న సంగ్ జీ హ్యున్ చేతిలో 15-21, 21-18, 15-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

12/18/2016 - 05:04

ముంబయి, డిసెంబర్ 17: ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) అధ్యక్ష పదవికి మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ రాజీనామా చేశాడు. ఏడు పదుల వయసు దాటిన వారు ఇంకా క్రికెట్ సమాఖ్యలు, సంఘాల్లో కీలక పాత్ర పోషించడం, వర్కింగ్ కమిటీల్లో కొనసాగడం పట్ల వస్తున్న విమర్శలకు మనస్తాపం చెందిన కారణంగానే అతను రాజీనామా చేసినట్టు సమాచారం.

12/18/2016 - 05:04

బ్రిస్బేన్, డిసెంబర్ 17: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి (డే/నైట్) టెస్టులో పాకిస్తాన్ సామర్థ్యానికి అసలుసిసలైన పరీక్ష ఎదురైంది. 490 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఈ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా, విజయం సాధించాలంటే పాకిస్తాన్ మరో 420 పరుగులు చేయాలి. ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి.

12/18/2016 - 05:01

చెన్నై, డిసెంబర్ 17: పరితమ ఓవర్ల ఫార్మాట్స్‌లో భారత్‌కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా కొనసాగించడమే మేలని, అతని అపారమైన అనుభవం యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు.

12/17/2016 - 04:03

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాప సూచకంగా,
చెన్నైలో శుక్రవారం చివరి, ఐదో టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు నిమిషాలు వౌనం పాటిస్తున్న భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు

12/17/2016 - 01:01

భారత్‌లో ఒకే టెస్టు సిరీస్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ శతకాలు సాధించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఐదో వాడిగా మోయిన్ అలీ చేరాడు. ఇంతకు ముందు అలస్టర్ కుక్, కెన్ బారింగ్టన్, కొలిన్ కౌడ్రే, మైక్ గాటింగ్, ఆండ్రూ స్ట్రాస్ ఈ ఘనతను అందుకున్నారు. తాజా సిరీస్‌లో రెండో సెంచరీ చేసిన మోయిన్ అలీ వారి సరసన చోటు సంపాదించుకున్నాడు. కాగా, టెస్టుల్లో అతను 1,000 పరుగులను పూర్తి చేశాడు.

12/17/2016 - 00:57

దుబాయ్, డిసెంబర్ 16: రియో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్ ఫైనల్‌లో కరోలినా మారిన్ చేతిలో ఎదురైన ఓటమికి భారత స్టార్, తెలుగు తేజం పివి సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఇక్కడ జరుగుతున్న బాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో చివరిదైన మూడో గ్రూప్ మ్యాచ్‌లో మారిన్‌ను 21-17, 21-13 తేడాతో చిత్తుచేసి సెమీస్ చేరింది. కాగా, మారిన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను చవిచూసి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.

12/17/2016 - 00:55

బ్రిస్బేన్, డిసెంబర్ 16: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి (డే/నైట్) టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక, ఆట ముగిసే సమయానికి 97 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మొదటి రోజు ఆటలోనే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవెన్ స్మిత్ సెంచరీతో రాణించగా, రెండో రోజు పీటర్ హ్యాండ్స్‌కోమ్ శతకాన్ని నమోదు చేశాడు.

12/17/2016 - 00:54

న్యూఢిల్లీలో శనివారం డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ పోరుకు సిద్ధంగా ఉన్న బాక్సర్లు విజేందర్ సింగ్ (్భరత్), ఫ్రాన్సిస్ చెకా (టాంజానియా)

12/17/2016 - 01:06

లక్నో, డిసెంబర్ 16: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్, బెల్జియం జట్లు ఫైనల్ చేరాయి. అత్యంత పటిష్టమైన జట్టుగా, హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, గతంలో ఆరు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న జర్మనీ జట్లు అనూహ్యంగా పరాజయాలను చవిచూశాయి. శుక్రవారం జరిగిన రెండు సెమీ ఫైనల్స్‌లోనూ పెనాల్టీ షూటౌట్ అనివార్యం కావడం గమనార్హం.

Pages