S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/17/2016 - 00:52

ప్రిటోరియా, డిసెంబర్ 16: స్థాయి ఏదైనాకానీ.. ఒక మ్యాచ్‌లో ఓ జట్టుకు చెందిన అవుటైన వారంతా పరుగుల ఖాతాను తెరవకుండానే పెవిలియన్ చేరితో ఏమవుతుంది? అలాంటి పరిస్థితుల్లో ఏ జట్టుకైనా విజయం సాధ్యమా? అని ప్రశ్నిస్తే, లేదనే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

12/16/2016 - 01:00

బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు మరోసారి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న బోర్డు శైలిని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. తన వాదనను సమర్థించుకోవడం కోసం సమర్పించిన అఫిడవిట్స్‌లో ఠాకూర్ తప్పుడు సమాచారం ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.

12/16/2016 - 00:57

చెన్నై, డిసెంబర్ 15: ఇంగ్లాండ్‌పై భారీ సిరీస్ విజయంపై భారత్ కనే్నసింది. 1992-93 సీజన్‌లో మహమ్మద్ అజరుద్దీన్ కెప్టెన్సీలోని టీమిండియా 3-0 ఆధిక్యంతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఇప్పటి వరకూ ఆ జట్టుపై భారత్‌కు అదే అతి పెద్ద సిరీస్ విజయం. కాగా, విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆడుతున్న భారత జట్టు ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇప్పటికే 3-0 తేడాతో గెల్చుకుంది.

12/16/2016 - 00:57

న్యూఢిల్లీ: బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్పందించడానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ నిరాకరించాడు. ఠాకూర్ అధికార పార్టీ బిజెపి తరఫున పార్లమెంటుకు ఎన్నికైన నేపథ్యంలో, ప్రభుత్వ అండదండలు అతనికి ఉంటాయన్న వాదన విపిస్తున్నది. ఇదే విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, బిసిసిఐతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నాడు.

12/16/2016 - 00:56

బ్రిస్బేన్, డిసెంబర్ 15: పాకిస్తాన్‌తో డే/నైట్ ఈవెంట్‌గా గురువారం మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లకు 288 పరుగులు సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న స్టీవెన్ స్మిత్ అజేయ శతకంతో రాణించగా, పీటర్ హాండ్స్‌కోమ్ హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా ఉన్నాడు.

12/16/2016 - 00:55

చెన్నై: వార్ధా తుపాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైనప్పటికీ, ఎంఎ చిదంబరం స్టేడియానికి పెద్ద నష్టమేమీ జరగలేదు. భారత్, ఇంగ్లాండ్ చివరి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఈ స్టేడియంలో అవుట్ ఫీల్డ్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదని అధికారులు ప్రకటించారు. పిచ్‌పై తేమ బాగా ఉండడంతో, నీటిని తుడిచేయానికి నిప్పుల కొలుములను ఉపయోగించిన విషయం తెలిసిందే.

12/16/2016 - 00:54

బ్రిస్బేన్, డిసెంబర్ 15: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. బౌలర్లు వాహబ్ రియాజ్, యాసిర్ షా పరస్పరం దుర్భాషలాడుకున్నారు. బాహాబాహీకి దిగారు. కోచ్ మికీ ఆర్థర్టన్ జోక్యం చేసుకొని ఇద్దరినీ మైదానం నుంచి బయటకు పంపాల్సి వచ్చింది.

12/16/2016 - 00:52

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఉదయం 18 ఓవర్లు వేసి, 40 పరుగులకు ఒక వికెట్ కూల్చిన పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. కాలికి దెబ్బ తగలడంతో నడవలేకపోయిన అతనిని సపోర్టింగ్ స్ట్ఫా మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

12/16/2016 - 00:51

చెన్నై: తీవ్రమైన శారీరక ఒత్తిడితో బాధపడుతున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చెన్నై టెస్టుకు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా చాలాకాలం విశ్రాంతి తీసుకున్న ఆండర్సన్, ఆ సమస్య నుంచి కోలుకున్నప్పటికీ, ఇతరత్రా సమస్యలు అతనిని చుట్టుముట్టాయి. ఫలితంగా అతను మ్యాచ్‌ని ఆడే పరిస్థితిలో లేడని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

చిత్రం..జేమ్స్ ఆండర్సన్

12/16/2016 - 00:49

లక్నో, డిసెంబర్ 15: జూనియర్ ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పటిష్టమైన స్పెయిన్‌తో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో భారత్ 2-1 తేడాతో గెలిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక గోల్ చేసి, భారత్‌ను విజయపథంలో నడిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్పెయిన్‌కు 22వ నిమిషంలో గోల్ లభించింది. మార్క్ సెరాహిమా చక్కటి ఫీల్డ్ గోల్‌ను నమోదు చేశాడు.

Pages