S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/16/2016 - 00:49

లండన్, డిసెంబర్ 15: అమెరికాకు చెందిన వెస్లీ సోతో లండన్ చెస్ క్లాసిక్ నాలుగో రౌండ్ గేమ్ ఆడిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రాజీకి అంగీకరించాడు. గేమ్ మొదటి నుంచి ఇరువరు ఆటగాళ్లు దూకుడును ప్రదర్శించకుండా, పావులను అతి జాగ్రత్తగా ముందుకు నడిపించారు. దీనితో ఫలితం తేలదని స్పష్టమైంది. చివరికి ఇద్దరూ గేమ్‌ను డ్రాగా ముగించడానికి అంగీకరించారు.

12/16/2016 - 00:47

దుబాయ్, డిసెంబర్ 15: అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ టోర్నీ రెండో మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి, హైదరాబాదీ పివి సింధు పరాజయాన్ని చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన అయాకా యమాగూచీని ఓడించి, శుభారంభం చేసిన సింధు రెండో రౌండ్‌లో సన్ యూ చేతిలో 15-21, 17-21 తేడాతో చిత్తయింది.

12/15/2016 - 08:48

చెన్నై, డిసెంబర్ 14: భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే చివరి, ఐదో టెస్టుకు పిచ్‌ని సిద్ధం చేయడానికి గ్రౌండ్స్‌మెన్ నిరంతరం శ్రమిస్తున్నారు. వార్ధా తుపాను నేపథ్యంలో భారీ వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. మ్యాచ్ జరిగే ఎంఎ చిదంబరం స్టేడియానికి కూడా దీని ప్రభావం తప్పలేదు. అయితే, అవుట్‌ఫీల్డ్‌కు పెద్దగా నష్టం వాటిల్లలేదు. 22 గజాల పిచ్‌పై ఉన్న పగుళ్లలోకి నీరు చేరింది.

12/15/2016 - 08:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: స్వదేశంలో అద్భుతంగా బౌల్ చేస్తూ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేసే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విదేశాల్లోనూ అదే స్థాయిలో రాణిస్తాడా? స్వదేశంలో మాదిరిగానే విదేశీ టూర్లలోనూ అశ్విన్ వికెట్లు సాధిస్తాడా? జట్టుకు చిరస్మరణీయ విజయాలను సాధించిపెడతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమని మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ స్పష్టం చేశాడు.

12/15/2016 - 08:46

బ్రిస్బేన్, డిసెంబర్ 14: పాకిస్తాన్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు గురువారం నుంచి మొదలుకానున్న మొదటి టెస్టు మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఇది డే/నైట్ టెస్టు కావడంతో ఆసీస్ కంటే పాకిస్తాన్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం. అయితే, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న ఆస్ట్రేలియా అతి కష్టం మీద పుంజుకుంది.

12/15/2016 - 08:45

లక్నో, డిసెంబర్ 14: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్‌ను ఢీకొనేందుకు భారత్ అన్ని విధాలా సిద్ధమైంది. పూల్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ అన్నింటిలోనూ విజయాలను నమోదు చేసింది. అయితే, చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొని, ఓటమి అంచుల వరకూ వెళ్లడం, అతి కష్టం మీద బయటపడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

12/15/2016 - 08:45

దుబాయ్, డిసెంబర్ 14: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన మహిళల క్రికెట్ జట్టులో భారత్ నుంచి స్మృతి మందనాకు చోటు దక్కంది. కాగా, ఉమెన్స్ వనే్డ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వెస్టిండీస్‌కు చెందిన స్ట్ఫోనీ టేలర్‌కు లభించింది. ఐసిసి అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారితో కూడిన పురుషులు, మహిళల జట్లను ఐసిసి ప్రతి ఏటా ప్రకటిస్తుంది.

12/14/2016 - 00:42

దుబాయ్, డిసెంబర్ 13: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మంగళవారం తాజాగా విడుదల చేసిన అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అడుగు ముందుకేసి కెరీర్ బెస్టు స్థానానికి చేరుకున్నాడు.

12/14/2016 - 00:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులపై గత జూలై 18వ తేదీన ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ బిసిసిఐ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.

12/14/2016 - 00:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌పై అలనాటి మేటి ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ తీవ్రస్థాయిలో మండిపడుతూ, కోహ్లీలాంటి అకికెటర్‌ను తాను ఇప్పటిదాకా చూడలేదని, అతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగుల వరద పారించగల సత్తా కలిగిన బ్యాట్స్‌మన్ అని అన్నాడు.

Pages