S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/14/2016 - 05:19

దుబాయ్, డిసెంబర్ 13: ఇటీవల చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుని మంచి ఫామ్‌లో కొనసాగుతున్న రియో ఒంలిపిక్స్ రజత పతక విజేత, ‘తెలుగు తేజం’ పివి.సింధు (21) బుధవారం నుంచి ఇక్కడ ప్రారంభమయ్యే సీజన్ ఎండింగ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మరో ప్రతిష్టాత్మక టైటిల్ సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించాలని ఎదురు చూస్తోంది.

12/14/2016 - 00:38

పారిస్, డిసెంబర్ 13: ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌బాల్ అవార్డు-2016ను పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో దక్కించుకున్నాడు. అయిదు సార్లు గోల్డెన్‌బాల్ విజేత, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని వెనక్కి నెట్టి రోనాల్డో ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడికి ఇచ్చే ఈ అవార్డును దక్కించుకోవడం గమనార్హం. రొనాల్డోకు గోల్డెన్‌బాల్ అవార్డు లభించడం ఇది నాలుగోసారి.

12/14/2016 - 00:36

బీజింగ్, డిసెంబర్ 13: రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న చైనా స్విమ్మర్ చెన్ జిన్యీ డోపింగ్ పరీక్షలో పట్టుబడటంతో ఆమెపై రెండేళ్ల పాటు నిషేధం విధించినట్లు అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (్ఫనా) ప్రకటించింది.

12/14/2016 - 00:35

చెన్నై, డిసెంబర్ 13: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం సాయంత్రం వార్ధా తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించినప్పటికీ చెపాక్‌లో ఈ నెల 16వ తేదీన భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదవ, చివరి టెస్టు క్రికెట్ మ్యాచ్ షెడ్యూలు ప్రకారమే ప్రారంభం కానుంది. తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) కార్యదర్శి కాశీ విశ్వనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

12/14/2016 - 00:34

అల్బరీ (ఆస్ట్రేలియా), డిసెంబర్ 13: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యుబిబిఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా మహిళల టి-20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మంగళవారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరినీ అలరించడంతో పాటు 8 వికెట్ల తేడాతో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది.

12/14/2016 - 00:34

గౌహతి, డిసెంబర్ 13: నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో కామనె్వల్త్ క్రీడల రజత పతక విజేత ఎల్.దేవంద్రో సింగ్‌కు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న దేవేంద్రో సింగ్ మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్ బౌట్‌లో 0-5 తేడాతో చండీగఢ్‌కు చెందిన దీపక్ సింగ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

12/14/2016 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పోటీకి ముందే ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధాలు జరగడం కొత్తేమీ కాదు. దశాబ్దం క్రితం మైక్ టైసన్, ప్రత్యర్థి లెనోక్స్ లూయిస్‌ల మధ్య జరిగిన మాటల యుద్ధం వీటన్నిటికీ పరాకాష్ఠ అని చెప్పవచ్చు.

12/13/2016 - 00:52

ముంబయి, డిసెంబర్ 12: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు విజయభేరి మోగించింది. ఇన్నింగ్స్ 36 పరుగుల భారీ తేడాతో సోమవారం ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి మిగిలిన లాంఛనాలను పూర్తిచేసిన భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0 తేడాతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

12/13/2016 - 00:54

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 130.1 ఓవర్లలో
400 ఆలౌట్,
భారత్ తొలి ఇన్నింగ్స్: 182.3 ఓవర్లలో
631 ఆలౌట్,

12/13/2016 - 00:36

లక్నో, డిసెంబర్ 12: ప్రపంచ కప్ పురుషుల జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారత్ హ్యాట్రిక్ సాధించింది.

Pages