S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/10/2016 - 06:51

లండన్, జూన్ 9: బ్రెజిల్‌కు చెందిన ‘లెజెండరీ సాకర్ ఐకాన్’ పీలే 1970లో సాధించిన వరల్డ్ కప్ ట్రోఫీకి ఇక్కడ జరిగిన వేలంలో 5,70,000 డాలర్లు (సుమారు 3.8 కోట్ల రూపాయలు) లభించాయి. 1970 మెక్సికో వరల్డ్ కప్‌లో బ్రెజిల్ విజయభేరి మోగించింది. ఆ జట్టులో సభ్యుడైన పీలే మిగతా ఆటగాళ్లతోపాటు వరల్డ్ కప్ నమూనా ట్రోఫీని అందుకున్నాడు.

06/10/2016 - 06:48

లాస్ ఏంజిలిస్, జూన్ 9: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా హైతీతో జరిగిన మ్యాచ్‌ని బ్రెజిల్ 7-1 తేడాతో గెల్చుకుంది. ఫిలిప్ కౌంటిన్హో హ్యాట్రిక్‌తో రాణించి బ్రెజిల్‌కు ఘన విజయాన్ని సాధించిపెట్టాడు. మ్యాచ్ 14వ నిమిషంలో మొదటి గోల్ చేసిన కౌంటిన్హో 29వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. ఇంజురీ టైమ్‌లో మూడో గోల్‌ను నమోదు చేశాడు.

06/10/2016 - 06:46

హరారే, జూన్ 9: జింబాబ్వేతో పరిమిత ఓవర్ల సంక్షిప్త సిరీస్‌లో పాల్గొనేందుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం ఇక్కడికి చేరింది. జింబాబ్వేతో టీమిండియా మూడు వనే్డలు, మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఈనెల 11, 13, 15 తేదీల్లో వనే్డ ఫార్మెట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. టి-20 విభాగంలో ఈనెల 18, 20, 22 తేదీల్లో మ్యాచ్‌లు ఉంటాయి.

06/10/2016 - 06:46

లూయిస్‌విల్లే, జూన్ 9: ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ అంత్యక్రియలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు టికెట్ల పంపిణీని కూడా అధికారులు పూర్తి చేశారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ ఈనెల మూడో తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు శుక్రవారం లూయిస్‌విల్లేలో జరగనున్నాయి.

06/10/2016 - 06:44

ఓక్‌వౌంట్ (అమెరికా), జూన్ 9: అమెరికా గోల్ఫ్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ టైగర్ ఉడ్స్ ఈనెల 16న ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. గతంలో మూడు పర్యాయాలు ఈ టైటిల్‌ను సాధించిన ఉడ్స్ ఈ టోర్నీకి డుమ్మా కొట్టడం గత ఆరేళ్ల కాలంలో ఇది మూడోసారి. శారీరకంగా తాను యుఎస్ ఓపెన్ గోల్ఫ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా లేనని ఉడ్స్ ప్రకటించాడు.

06/10/2016 - 06:44

లండన్, జూన్ 9: చాంపియన్స్ ట్రోఫీ హాకీలో పాల్గొంటున్న సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు మొదటి మ్యాచ్‌లోనే ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జర్మనీ నుంచి పరీక్ష ఎదురుకానుంది. లీ వాలీ హాకీ సెంటర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో జర్మనీకి ఏ స్థాయిలో పోటీనిస్తుందనే అంశంపైనే భారత్ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది.

06/09/2016 - 07:21

ముంబయి, జూన్ 8: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం తాత్కాలిక కోచ్‌గా సంజయ్ బంగార్ వ్యవహరిస్తుండగా, హేమాహేమీలు ఒక్కొక్కరే బరిలోకి దిగుతున్నారు. భారత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్, మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీ ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, తాజాగా మాజీ ఫాస్ట్ బౌలర్లు వెంటేశ్ ప్రసాద్, బల్వీందర్ సింగ్ సంధూ కూడా రేసులోకి దూకారు.

06/09/2016 - 07:19

ప్రోవిడెన్స్ (గుయానా), జూన్ 8: ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాను ఢీకొన్న దక్షిణాఫ్రికా సమష్టి కృషి ఫలితంగా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తరఫున ఆరోన్ ఫించ్ (72) ఒక్కడే ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు.

06/09/2016 - 07:19

మాంట్రెయుల్ (ఫ్రాన్స్), జూన్ 8: ఫ్రెంచ్ స్ప్రింటర్ జిమీ వికాల్ట్ 100 మీటర్ల పరుగును రికార్డు సమయంలో పూర్తి చేశాడు. ఇక్కడ జరిగిన మాంట్రెయిల్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొన్న అతను లక్ష్యాన్ని 9.86 సెకన్లలో పూర్తి చేసి, ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన టైమింగ్స్‌ను నమోదు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ స్ప్రింట్‌లో ఇదే రికార్డు కావడం విశేషం.

06/09/2016 - 07:18

లండన్, జూన్ 8: చారిత్రక లార్డ్స్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టులో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకపై వైట్‌వాష్ సాధించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది. నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, ఆ సిరీస్ చివరి మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Pages