S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/10/2016 - 00:44

గౌహతి, డిసెంబర్ 9: ఇక్కడ జరుగుతున్న జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో దేవేంద్రో సింగ్, మనోజ్ కుమార్ తమ అసలు వెయిట్‌కు కాకుండా ఇతర వెయిట్‌లో పోటీపడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శుభారంభం చేశారు. దేవేంద్రో 49 కిలోలకు కాకుండా 52 కిలోల ఫ్లైవెయిట్ విభాగంలో భోజ్‌రాజ్‌ను 3-2 తేడాతో ఓడించాడు. మరో ఫైట్‌లో మనోజ్ 5-0 ఆధిక్యంతో మణికందన్‌ను చిత్తుచేశాడు.

12/10/2016 - 00:44

ముంబయి, డిసెంబర్ 9: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజున తలకు బంతి తగలడంతో స్వల్పంగా గాయపడిన అంపైర్ పాల్ రీఫెల్‌కు విశ్రాంతినివ్వాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయించింది. జెన్నింగ్స్ కొట్టిన బంతిని స్క్వేర్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేసిన భువీ, దానిని వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ వైపు విసిరాడు.

12/10/2016 - 00:42

లక్నో, డిసెంబర్ 9: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో విజయంపై భారత్ కనే్నసింది. మొదటి మ్యాచ్‌ని కెనడాపై 4-0 తేడాతో గెల్చుకొని ఊపుమీద ఉన్న భారత్ శనివారం ఇంగ్లాండ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. 2011 తర్వాత జూనియర్ హాకీ ప్రపంచ కప్ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు.

12/10/2016 - 00:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: లోధా సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న బిసిసిఐపై తీసుకోబోయే చర్యలను ఖాయం చేయడాన్ని సుప్రీం కోర్టు మళ్లీ వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈనెల 5వ తేదీన తుది తీర్పునిస్తుందని తొలుత అనుకున్నారు. అయితే, టిఎస్ ఠాకూర్ అనారోగ్యం కారణంగా విధులకు హాజరుకాకపోవడంతో కేసు శుక్రవారం నాటికి వాయిదా పడింది.

12/10/2016 - 00:51

మెల్బోర్న్, డిసెంబర్ 9: డేవిడ్ వార్నర్ విజృంభణ న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాకు 117 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సంపాదించిపెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రత్యర్థికి ఆసీస్ వైట్‌వాష్ వేయగలిగింది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి, మూడో వనే్డలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 264 పరుగులు సాధించింది.

12/09/2016 - 01:28

ఇంగ్లాండ్ తరఫున 19 మంది తమతమ కెరీర్ మొదటి టెస్టులోనే శతకాలను నమోదు చేయగా, వారిలో ఓపెనర్లు ఎనిమిది మంది. ఎడమచేతి వాటం ఆటగాడైన జెన్నింగ్స్ గత 50 సంవత్సరాల కాలంలో, తమ మొదటి టెస్టులో సెంచరీ చేసిన మూడో ఓపెనర్ కావడం విశేషం. ఇతని కంటే ముందు ఆండ్రూ స్ట్రాస్, అలస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. జెన్నింగ్స్ కంటే ముందు, 2009లో జొనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాపై ది ఓవల్ మైదానంలో సెంచరీ చేశాడు.

12/09/2016 - 01:25

సెంచరీ హీరో జెన్నింగ్స్‌ను అవుట్ చేసిన అశ్విన్ ఆనందం. అతనికి కెరీర్‌లో అతనికి ఇది 238వ టెస్టు వికెట్. మొదటి ఆటలోనే అతను నాలుగు వికెట్లు పడగొట్టాడు

12/09/2016 - 01:22

ముంబయి, డిసెంబర్ 8: భారత క్రికెట్‌లో ముంబయి ఆధిపత్యం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే సమయంలో భారత జట్టులో కనీసం ఇద్దరు ముగ్గురు ముంబయి ఆటగాళ్లు ఉండేవాళ్లు. ఒక్కోసారి ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆరు నుంచి ఏడుగురు ముంబకర్‌లు ఉండేవారంటే, అక్కడి ఆధిపత్యాన్ని ఊహించుకోవచ్చు. అయితే, 83 సంవత్సరాల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక్క ముంబయి ఆటగాడు కూడా లేకుండానే టెస్టు మొదలైంది.

12/09/2016 - 01:21

గౌహతిలో గురువారం మొదలైన జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ తొలి ఫైట్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన గొమిన్ గారాను ఢీకొన్న ఒలింపియన్ శివ థాపా (కుడి). ఈ ఫైట్‌లో థాపా 5-0 తేడాతో గెలిచాడు. కాగా, ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూడు జట్లు బరిలోకి దిగడంతో, మొదటి రోజు మిగతా ఫైట్స్‌ను అధికారులు రద్దు చేసి, డ్రాలో మార్పులుచేర్పులు చేశారు.

12/09/2016 - 01:19

లక్నో, డిసెంబర్ 8: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. కెనడాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకూ భారత్ ఆధిపత్యం కొనసాగితే, కెనడా క్రీడాకారులు ప్రేక్షక పాత్ర పోషించారు. మ్యాచ్ 35వ నిమిషంలో భారత్‌కు తొలి గోల్ మన్దీప్ సింగ్ ద్వారా లభించింది. మరో 11 నిమిషాల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు.

Pages