S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/08/2016 - 05:29

న్యూయార్క్, డిసెంబర్ 7: గత మూడు సీజన్లు తనకు కోచ్‌గా వ్యవహరించిన మాజీ ప్రపంచ నంబర్ వన్ బోరిస్ బెక్‌తో నొవాక్ జొకోవిచ్ తెగతెంపులు చేసుకున్నాడు. బెకర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే జొకోవిచ్ ఆరు మేజర్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఇకపై బెకర్ తనకు కోచ్‌గా ఉండడం లేదని జొకోవిచ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. విడిపోదామన్నది తమ ఇద్దరి సమష్టి నిర్ణయమని ప్రకటించాడు.

12/08/2016 - 05:29

గౌహతి, డిసెంబర్ 7: చాలాసార్లు వాయిదా పడిన జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఎట్టకేలకు గురువారం నుంచి మొదలుకానుంది. ఈ పోటీల్లో ఒలింపియన్లు మనోజ్ కుమార్, శివ థాపా తమతమ విభాగాల నుంచి కాకుండా ఇతర విభాగాల నుంచి పోటీపడతారు. ఇప్పటి వరకూ 64 కిలోల విభాగంలో ఫైట్స్ చేస్తున్న మనోజ్ 69 కిలోల వెల్టర్‌వెయిట్ విభాగం నుంచి రింగ్‌లోకి దిగుతాడు.

12/08/2016 - 05:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సుమారు మూడు దశాబ్దాలుగా పురుషుల బాక్సింగ్ రంగానికి వివిధ హోదాల్లో సేవలు అందిస్తూ, ప్రస్తుతం కోచ్‌గా ఉన్న గుర్బాక్స్ సింగ్ సంధూ ఇకపై మహిళలకు కూడా కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవలే ఏర్పడిన భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

12/07/2016 - 01:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: గాయం నుంచి కోలుకుంటున్న వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాకు విశ్రాంతినివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. దీనితో, ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి మొదలుకానున్న నాలుగో టెస్టులోనూ పార్థీవ్ పటేల్ కీపింగ్ బాధ్యతలను చేపట్టనున్నాడు.

12/07/2016 - 01:32

ముంబయి, డిసెంబర్ 6: వరుసగా రెండు మ్యాచ్‌లను చేజార్చుకొని, ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-2 తేడాతో వెనుకబడిన ఇంగ్లాండ్ గురువారం నుంచి మొదలయ్యే నాలుగో టెస్టులో భారత్‌ను ఓడించి, ఆశలు నిలబెట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నది.

12/07/2016 - 01:30

ముంబయి, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన నేపథ్యంలో, ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరగాల్సిన ఐదవ, చివరి టెస్టు జరుగుతుందా లేదా అన్న అనుమానం తలెత్తుతున్నది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు.

12/07/2016 - 01:29

కాన్‌బెరా, డిసెంబర్ 6: న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన రెండో వనే్డను ఆస్ట్రేలియా 116 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెల్చుకుంది. చివరిదైన మూడో వనే్డ ఫలితంతో సంబంధం లేకుండా ఆసీస్‌కు సిరీస్‌ను అందించిన ఘనత డేవిడ్ వార్నర్‌కు దక్కుతుంది. అతను సెంచరీతో కదంతొక్కి, ఆసీస్ విజయంలో కీలక భూమిక పోషించాడు.

12/07/2016 - 01:27

లండన్, డిసెంబర్ 6: ఇంగ్లాండ్ వనే్డ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నాడు. భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లేందుకు మోర్గాన్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనితో అతని స్థానంలో వికెట్‌కీపర్ జొస్ బట్లర్ నాయకత్వం వహించాడు.

12/07/2016 - 01:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దు ప్రభావం క్రీడా రంగంపైనా పడింది. దీని కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని, అందుకే ఈసారి ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)లో రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ వంటి స్టార్లు పాల్గొనడం లేదని టోర్నీ వ్యవస్థాపకుడు మహేష్ భూపతి తెలిపాడు. దేశంలో ఆర్థిక పరిస్థితి టోర్నీకి అనుకూలంగా లేదని వ్యాఖ్యానించాడు.

12/07/2016 - 01:24

అసన్సియన్, డిసెంబర్ 6: ఇటీవల కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మినహా మిగతా క్రీడారులందరినీ కోల్పోయిన చపెకొయన్స్ జట్టుకు సుడామేరికానా టైటిల్‌ను ప్రకటించారు. కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ జట్టుతో కోపా సుడామెరికానా ఫైనల్ ఆడేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో చపెకొయన్స్ ఫుట్‌బాల్ క్రీడాకారులు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మొత్తం 71 మంది దుర్మరణం చెందారు.

Pages