S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/06/2016 - 01:24

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 5: జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ అండర్-13 సింగిల్స్ బాలుర చాంపియన్‌షిప్‌ను తెలంగాణకు చెందిన జి ప్రణవ్‌రావు కైవసం చేసుకోగా, బాలికల విభాగంలో అనుపమ ఉపాధ్యాయ దక్కించుకుంది. ఫైనల్‌లో అతను శంకర్‌ముత్తుసామి (తమిళనాడు)పై 21-12, 21-16 తేడాతో విజయం సాధించాడు. బాలికల సింగిల్స్ ఫైనల్‌లో అనుపమ 21-19, 21-19 తేడాతో మేఘనరెడ్డి పై గెలుపొంది టైటిల్ సాధించింది.

12/06/2016 - 02:39

నాగపూర్, డిసెంబర్ 5: లోధా కమిటీ చేసిన సిఫార్సులను కేవలం క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా దేశంలో అన్ని క్రీడలకూ వర్తింప చేయాలని బహిష్కృత బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వానికి సూచించాడు. క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసిందని, వాటిని బిసిసిఐ ఎందుకు వ్యతికేరిస్తున్నదో తనకు అర్థం కావడం లేదని అతను విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

12/06/2016 - 01:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై సుప్రీం కోర్టులో కేసు ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించినప్పుడు తుది తీర్పునిచ్చే అవకాశం ఉందని, కనీసం బోర్డుకు మార్గదర్శకాలను విడుదల చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే, ఠాకూర్ అనారోగ్య కారణంగా కేసు తొమ్మిదో తేదీకి వాయిదా పడింది.

12/05/2016 - 04:20

ఆసియా కప్ మహిళల టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు. భారత్ వరుసగా ఆరోసారి ఈ టైటిల్ సాధించి డబుల్ హ్యాట్రిక్‌ను నమోదు చేయడం విశేషం.

12/05/2016 - 01:33

బ్యాంకాక్, డిసెంబర్ 4: ఆసియా కప్ మహిళల టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరోసారి ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా ఆరోసారి టైటిల్‌ను సాధించింది. అరుదైన ‘డబుల్ హ్యాట్రిక్’ను నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 121 పరుగులు సాధించింది.

12/05/2016 - 01:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: లోధా కమిటీ సిఫార్సులను అమలుపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సోమవారం విచారణకు రానున్న ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తుది తీర్పునిచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ కొన్ని అంశాలను వాయిదా వేసినా, కొన్ని కీలక సిఫార్సులపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు ఆదేశాలు జారీ చేయవచ్చని అంటున్నారు.

12/05/2016 - 01:29

సిడ్నీ, డిసెంబర్ 4: చాపెల్-హాడ్లీ ట్రోఫీ వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 68 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. స్టీవెన్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి దీటుగా కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిన్ కూడా శతకాన్ని నమోదు చేసినప్పటికీ తన జట్టును ఆదుకోలేకపోయాడు.

12/05/2016 - 01:27

మకావూ, డిసెంబర్ 4: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో జావో జున్ పెంగ్, మహిళల సింగిల్స్‌లో చెన్ యూఫై టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పెంగ్ 21-11, 21-19 ఆధిక్యంతో వరుస సెట్లలో టాప్ సీడ్ చౌ తియెన్ చెన్‌కు షాకిచ్చాడు. మొదటి సెట్‌ను సులభంగానే సొంతం చేసుకున్న పెంగ్‌కు రెండో సెట్‌లో చెన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది.

12/05/2016 - 01:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారత టెన్నిస్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్‌ను మార్చవద్దంటూ నలుగురు సీనియర్ ఆటగాళ్లు భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ)కు లేఖ రాశారు. జట్టులో క్రమశిక్షణ కరవైందని, ఆధిపత్య పోరుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఆనంద్, కోచ్ జీషన్ అలీపై ఎఐటిఎ ఆగ్రహంతో ఉంది. ఈనెలాఖరుతో వారి కాంట్రాక్టు ముగియనుండగా, దానిని పునరుద్ధరించే ఆలోచనలో లేదని వార్తలు వచ్చాయి.

12/05/2016 - 01:25

చాపెకో (బ్రెజిల్): కొలంబియాలో విమానం కూలిన సంఘటనలో మృతి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులకు అభిమానులు తుది వీడ్కోలు పలికారు. బ్రెజిల్ యావత్తు ఈ దుర్ఘటనపై కార్చిన కన్నీరు భారీ వర్షం రూపంలో కురుస్తున్నా లెక్క చేయని వందలాది మంది అభిమానులు సాకర్ ఆటగాళ్ల మృతదేహాలపై పుష్పగుచ్ఛాలను ఉంచి ఘన నివాళులర్పించారు. ఈ విమాన సంఘటనలో మొత్తం 71 మంది మరణించిన విషయం తెలిసిందే.

Pages