S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/04/2016 - 01:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఒక రంజీ మ్యాచ్‌ని రెండు పిచ్‌లపై ఆడించే విధానాన్ని అమలు చేయాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ప్రతిపాదించాడు. ఈ విధంగా ఆడితే, విదేశాల్లో టెస్టు సిరీస్‌లకు అద్భుతమైన జట్టును రూపొందించగలుగుతామని శనివారం ఇక్కడ జరిగిన లీడర్‌షిప్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సచిన్ అన్నాడు.

12/04/2016 - 01:02

న్యూఢిల్లీ: లోధా కమిటీ చేసిన సూచనలు, వాటి అమలుపై వ్యాఖ్యానించడానికి సచిన్ నిరాకరించాడు. కమిటీ సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఇప్పటికే బిసిసిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో లోధా సిఫార్సుల అమలుపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

12/04/2016 - 01:00

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా,
శోభన భారతీయతో కలిసి లీడర్‌షిప్ సదస్సుకు హాజరైన
బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (కుడి)

12/04/2016 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మొండి వైఖరిని మార్చుకోవడంలేదు. లోధా కమిటీ సిఫార్సుల అమలును వ్యతిరేకిస్తున్న అతను తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో, హడావుడిగా నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ అతను కొత్తగా చెప్పిందేమీ లేదు. గతంలో పేర్కొన్న అంశాలను తిగిరి ప్రస్తావించాడే తప్ప తాజా నిర్ణయాలు ఏవీ ప్రకటించలేదు.

12/04/2016 - 00:58

మొనాకో, డిసెంబర్ 3: పురుషుల 200 మీటర్ల పరుగును 19.19 సెకన్లలో పూర్తి చేసి తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేయడం లేదా బద్దలు చేయడం ఇప్పుడు తనకే కష్టమని ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) నుంచి ఈ ఏటి మేటి అథ్లెట్ అవార్డును అతను స్వీకరించాడు. మహిళల విభాగంలో ఈ అవార్డు అల్మాజ్ అయానాకు లభించింది.

12/04/2016 - 00:55

సిడ్నీ, డిసెంబర్ 3: సహచర ఆటగాడు మాథ్యూ వేడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్‌కు కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కూడా సభ్యుడిగా ఉన్న జట్టు మేనేజ్‌మెంట్ జరిమానా విధించింది. మాక్స్‌వెల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షిఫీల్డ్ షీల్డ్ టోర్నీలో తాను, వేడ్ విక్టోరియా తరఫున ఆడుతున్న విషయాన్ని ప్రస్తావించాడు.

12/04/2016 - 00:54

లండన్, డిసెంబర్ 3: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ వచ్చే ఏడాది జూన్ 15 నుంచి 25వ తేదీ వరకు జరిగే పురుషుల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) సెమీ ఫైనల్‌లో ఒకే పూల్ నుంచి పోటీపడనున్నాయి. 2018 వరల్డ్ కప్ హాకీకి అర్హత పొందే జట్లను ఖరారు చేయడానికి హెచ్‌డబ్ల్యుఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లో పది ప్రపంచ మేటి జట్లు తలపడతాయి. ఇప్పటికే ఆరు జట్లు ఖరారయ్యాయి.

12/04/2016 - 00:53

కరాచీ, డిసెంబర్ 3: జూనియర్ ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనకుండా తమ జూనియర్ హాకీ జట్టుపై అనర్హత వేటు వేయడం అన్యాయమని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్ణయాన్ని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) తప్పుపట్టింది. దీనిని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

12/03/2016 - 01:29

అబూదబీ, డిసెంబర్ 2: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువ ఆటగాడు ఒమర్ అబ్దుల్ రహమాన్, ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ ఫోర్డ్‌లకు ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (ఎఎఫ్‌సి) బెస్ట్ ప్లేయర్ అవార్డులు దక్కాయి. ఇక్కడి ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్‌లో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో అధికారులు వీరికి అవార్డులను ప్రదానం చేశారు. నిరుడు కూడా అబ్దుల్ రహమాన్ పేరు ఎఎఫ్‌సి ఉత్తమ క్రీడాకారుడి అవార్డుకు నామినేట్ అయింది.

12/03/2016 - 01:27

మకావూ, డిసెంబర్ 2: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రస్తానానికి తెరపడింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మూడో టోర్నీలో పాల్గొన్న అమె, గత రెండు టోర్నీలతో పోలిస్తే మకావూలో మెరుగ్గానే ఆడింది. అయితే, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె జాంగ్ ఇమాన్ (చైనా) చేతిలో 17-21, 17-21 తేడాతో ఓటమిపాలైంది.

Pages