S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/13/2016 - 07:46

పెర్త్, జనవరి 12: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం వాకా స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌తో మొత్తం ముగ్గురు క్రికెటర్లు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అరంగేట్రం చేశారు. వీరిలో ఇద్దరు ఆస్ట్రేలియన్లుకాగా, ఒకరు భారత ఆటగాడు. ఒకేసారి వనే్డ కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముగ్గురు బౌలర్లలో బరీందర్ శరణ్ సఫలంకాగా, స్కాట్ బోలాండ్, జోల్ పారిస్ దారుణంగా విఫలమయ్యారు.

01/13/2016 - 07:45

కరాచీ, జనవరి 12: స్పాట్ ఫిక్సింగ్‌లో ముద్దాయిగా తేలడంతో జైలు శిక్షతోపాటు సస్పెన్షన్ వేటును కూడా ఎదుర్కొన్న మహమ్మద్ అమీర్‌కు మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కడంపై పాకిస్తాన్ జాతీయ కోచ్, మాజీ పేసర్ వకార్ యూనిస్ సంతోషం వ్యక్తం చేశాడు.

01/12/2016 - 07:31

పెర్త్, జనవరి 11: పెర్త్‌లోని వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం (వకా) మైదానం హోరాహోరీ పోరాటానికి వేదిక కానుంది. బలమైన జట్లు భారత్, ఆస్ట్రేలియా మంగళవారం నాటి మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌కు సిద్ధంకాగా, ఫలితం ఎలావున్నా పోరు తీవ్ర స్థాయిలో సాగుతుందనేది వాస్తవం. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియాకు గత ఏడాది అచ్చిరాలేదు.

01/12/2016 - 07:27

పెర్త్, జనవరి 11: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వనే్డ, టి-20 సిరీస్‌లతోపాటు బౌలర్లు, బ్యాట్స్‌మెన్ మధ్య ఆధిపత్య పోరాటం కూడా కొనసాగనుంది. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జొస్ హాజెల్‌వుడ్ బౌలర్ల రేసులో ముందు వరుసలో ఉన్నారు. అశ్విన్ ఇప్పటికే అత్యుత్తమ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

01/12/2016 - 07:27

షార్జా, జనవరి 11: వికెట్‌కీపర్ మహమ్మద్ షాజాద్ విజృంభణ జింబాబ్వేతో జరిగిన రెండవ, చివరి టి-20లో అఫ్గానిస్థాన్‌ను విజయపథంలో నడిపించింది. 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన అఫ్గాన్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఓపెనర్‌గా వచ్చిన షాజాద్ అజేయంగా 118 పరుగులు చేసి, టి-20 చరిత్రలోనే నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేశాడు.

01/12/2016 - 07:26

పెర్త్, జనవరి 11: తమను ఓడించడం టీమిండియాకు అనుకున్నంత సులభం కాదని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జి బెయిలీ అన్నాడు. మంగళవారం తొలి మ్యాచ్‌తో వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో అతను ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్, ఆసీస్ జట్ల మధ్య పోరాటం ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుందన్నాడు. ఇటీవల కాలంలో ఆసీస్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నదని చెప్పాడు.

01/12/2016 - 07:26

గుడివాడ, జనవరి 11: కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ జాతీయ గ్రామీణ క్రీడలు అండర్-16 బాలికల లాంగ్‌జంప్ విభాగంలో కేరళకు చెందిన యాన్సీసోజన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హర్యానాకు చెందిన జైత్స్న రజత, కర్ణాటకకు చెందిన ధనేశ్వరి కాంస్య పతకాలను సాధించారు.

01/11/2016 - 06:59

కరాచీ, జనవరి 10: పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సరుూద్ అజ్మల్ మోసం చేశాడని అతని స్వస్థలమైన ఫైసలాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరోపించింది. అకాడెమీని ఏర్పాటు చేసుకోవడానికి తాము కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించింది. తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది.

01/11/2016 - 06:57

జ్యూరిచ్, జనవరి 10: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అందచేసే ప్రతిష్ఠాత్మక బాలన్ డిఆర్ అవార్డు ఈసారి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీని హాట్ ఫేవరిట్‌గా విశే్లషకులు పేర్కొంటున్నారు.

01/11/2016 - 06:56

చెన్నై, జనవరి 10: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను బొర్నా కొరిక్‌ను 6-3, 7-5 తేడాతో ఓడించి ట్రోఫీని అందుకున్నాడు. ఈ టోర్నీలో అతను వరుసగా 12 మ్యాచ్‌లను గెల్చుకొని సత్తా చాటాడు.

Pages