S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/20/2016 - 17:48

ముంబయి: ఒలింపిక్‌ రజతం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు గురువు పుల్లెల గోపిచంద్‌ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి పేరు ప్రస్తుతానికి పుల్లెల గోపీచంద్‌ అనే పెట్టారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించే ఈ చిత్రానికి అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

08/20/2016 - 12:58

దిల్లీ: ఒలింపిక్స్‌కు వెళ్లిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన త్రిపురకు చెందిన దీపా కర్మాకర్‌కు శనివారం ఉదయం దిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పతకం చేజారినప్పటికీ, దీప తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, మీడియా ప్రతినిధులు దీపకు శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలతో సత్కరించారు.

08/20/2016 - 05:39

కష్ట్ఫేలి

08/20/2016 - 05:37

న్యూఢిల్లీ, ఆగస్టు 19: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన భారత బాడ్మింటన్ స్టార్ యావత్ దేశానికే గర్వకారణమని పలువురు క్రీడాకారులు, ప్రముఖులు ప్రశంసించారు. సింధు రజత పతకం గెల్చుకోవడం ద్వారా భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిందని రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మాజీ టెస్టు క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ట్వీట్ చేశాడు.

08/20/2016 - 05:36

రియో డి జెనీరో, ఆగస్టు 19: రియో ఒలింపిక్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, లక్షలాది మంది అభిమానుల మనసులు గెల్చుకుంది. స్పెయిన్‌కు చెందిన మారిన్‌తో తలపడిన సింధు కడవరకూ పోరాడింది. ప్రత్యర్థికి అడుగడుగునా సవాళ్లు విసిరింది. తిరుగులేని స్మాష్‌లు, అద్భుతమైన ప్లేసింగ్స్‌తో విజయంపై ఆశలు పెంచింది.

08/20/2016 - 05:35

రియో డి జెనీరో, ఆగస్టు 19: ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ స్ప్రింట్‌లో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు. రియో ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన అతను తాజాగా 200 మీటర్ల విభాగంలోనూ విజేతగా నిలిచాడు. 19.78 సెకన్లలో గమ్యాన్ని చేరిన అతను స్ప్రింట్ డబుల్‌ను సాధించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

08/20/2016 - 05:34

రియో డి జెనిరో, ఆగస్టు 19: ఒలింపిక్ పురుషుల హాకీలో అర్జెంటీనా జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 4-2 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును మట్టికరిపించింది.

08/20/2016 - 05:34

రియో డి జెనిరో, ఆగస్టు 19: ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని తీసుకురావాలని ఎంతో ఆశతో రియోకి వెళ్లిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు తీవ్రమైన నిరాశ ఎదురైంది. డోపింగ్ కేసులో నర్సింగ్ యాదవ్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇచ్చిన క్లీన్ చిట్‌ను అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) తోసిపుచ్చి నాలుగేళ్ల నిషేధం విధించడంతో బరిలోకి దిగకముందే అతని ఆశలు నీరుగారి పోయాయి.

08/20/2016 - 05:33

రియో డి జెనిరో, ఆగస్టు 19: డోపింగ్ కేసులో తనపై నాలుగేళ్ల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) ఇచ్చిన తీర్పు పట్ల రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని అతను స్పష్టం చేశాడు. ‘సిఎఎస్ నిర్ణయం తీవ్ర ఆవేదన కలిగించింది.

08/19/2016 - 23:17

రియోడిజెనీరొ: బ్రెజిల్ రాజధాని రియో డిజనీరోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన మహిళల షటిల్ బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణి పి.వి.సింధు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అద్వితీయస్థాయిలో పోరాడినప్పటికీ స్పెయిన్‌కు చెందిన ప్రత్యర్థి మారియో చేతిలో ఒటమి తప్పలేదు. రజత పతకం సాధించి భారత్ తరపున ఒలింపిక్స్‌లో తొలి రజత పతకాన్ని సాధించిన మహిళగా చరిత్ర సృష్టించింది.

Pages