S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/25/2016 - 08:51

పారిస్, నవంబర్ 24: సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ సాధించడంతో, చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా ప్రీ క్వార్టర్స్ చేరింది. సెల్టిక్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా హీరో మెస్సీ మ్యాచ్ 24, 55 నిమిషాల్లో గోల్స్ సాధించి బార్సిలోనాను టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేయించాడు.

11/25/2016 - 08:50

మొహాలీ, నవంబర్ 24: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు కళ్లెం వేయడానికి ఇంగ్లాండ్ జట్టు సిద్ధమవుతున్నది. ప్రత్యేక వ్యూహంతో అతనిని నియంత్రిస్తామని, సాధ్యమైనంత త్వరగా అవుట్ చేస్తామని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అన్నాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రాకాగా, విశాఖపట్నం టెస్టులో ఇంగ్లాండ్ 246 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.

11/25/2016 - 08:49

కౌలూన్, నవంబర్ 24: హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. రెండో రౌండ్‌లో ఈ ఇద్దరు హైదరాబాదీలు తమతమ ప్రత్యర్థుల నుంచి ఎదురైన పోటీని తట్టుకొని నిలబడ్డారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి, గత వారం చైనా ఓపెన్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో రౌండ్‌లో హు యాచింగ్‌ను 21-10, 21-14 తేడాతో ఓడించింది.

11/24/2016 - 08:58

మొహాలీ, నవంబర్ 23: భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా, శనివారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. దీనితో అతని స్థానంలో పార్థీవ్ పటేల్‌ను సెలక్టర్లు ఆహ్వానించారు. 2002లో భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు, 17 ఏళ్ల వయసులో పార్థీవ్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతను చివరి టెస్టును శ్రీలంకతో కొలంబోలో 2008 ఆగస్టులో ఆడాడు.

11/24/2016 - 08:56

జొహానె్నస్‌బర్గ్, నవంబర్ 23: గాయానికి శస్త్ర చికిత్స చేయించుకొని, విశ్రాంతి తీసుకుంటున్న ఎబి డివిలియర్స్‌పై దక్షిణాఫ్రికా సెలక్టర్ల నమ్మకం ఏమాత్రం సడల్లేదు. అతని స్థానంలో ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వం వహించి, ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాలను సాధించిపెట్టినప్పటికీ, జట్టు కెప్టెన్‌గా డివిలియర్స్‌నే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు.

11/24/2016 - 08:55

న్యూఢిల్లీ, నవంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మధ్య అగాథం రోజురోజుకూ పెరుగుతున్నది. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇప్పుడు ఐసిసి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందువల్ల నిర్ణయాలన్నీ భారత్‌కు అనుకూలంగానే ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ, ఐసిసి అందుకు భిన్నమైన నిర్ణయాలతో సవాళ్లు విసురుతున్నది.

11/24/2016 - 08:53

అడెలైడ్, నవంబర్ 23: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒక మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించడంతో తాను ఏకీభవించడం లేదని, నిజానికి తాను ఏ తప్పూ చేయలేదని దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఫఫ్ డు ప్లెసిస్ స్పష్టం చేశాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని అన్నాడు.

11/24/2016 - 08:53

కౌలూన్, నవంబర్ 23: ఇటీవలే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తెలుగు తేజం పివి సింధు, గాయం నుంచి కోలుకొని మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. సింధు తన తొలి రౌండ్ మ్యాచ్‌లో సుశాంతో యులియాను 21-13, 21-16 తేడాతో సునాయాసంగా ఓ డించింది.

11/23/2016 - 01:19

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇక చివరి మూడు టెస్టుల్లో తలపడే 16 మంది భారత జట్టులో సీమర్ భువనేశ్వర్ కుమార్‌కు మళ్లీ చోటు లభించింది. వెనె్నముక గాయం నుంచి భువనేశ్వర్ పూర్తిగా కోలుకోవడంతో భారత సెలెక్టర్లు మంగళవారం అతనికి ఈ జట్టులో చోటు కల్పించారు. అయితే కెరీర్‌లో ఇప్పటివరకూ 58 టెస్టులు ఆడిన సీనియర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (35)ను ఈ జట్టు నుంచి తొలగించారు.

11/23/2016 - 01:15

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 22: భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య జరిగిన టి20 క్రికెట్ సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతోక్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం నాటి చివరి, మూడో టి20లో బ్యాటింగ్‌లో హీలీమాథ్యూస్, కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ రాణించడంతో విండీస్ 15పరుగుల తేడాతో విజయం సాధించింది.

Pages