S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/21/2016 - 02:33

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 20: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. ప్రత్యర్థి ముందు 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ ఆతర్వాత నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ చివరి రోజైన సోమవారం ఆటలో ఇంగ్లాండ్ ఇంకా 318 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఇంకా ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి.

11/21/2016 - 02:28

చిత్రం.. భివానీ (హర్యానా)లోని బలాలీ గ్రామంలో ఆదివారం రెజ్లర్ పవన్ కుమార్‌తో
మహిళా రెజ్లర్ గీతా ఫొగట్ వివాహానికి హాజరైన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

11/21/2016 - 02:26

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 20: డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఒకటి చొప్పున మొత్తం ఏడు వికెట్లు సాధించగా, బ్యాట్స్‌మన్ జీత్ రావల్ మొదటి ఇన్నింగ్స్‌లో 55, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 36 చొప్పున పరుగులు చేసి, అద్భుత ప్రతిభ కనబరచడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన న్యూజిలాండ్ మొదటి టెస్టులో పాకిస్తాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.

11/21/2016 - 02:25

చిత్రం.. ఢిల్లీ హాఫ్ మారథాన్ విజేత ఎల్యుడ్ కిప్చోగేతో జమైకా స్ప్రింర్ అసాఫా పావెల్,
కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్

11/21/2016 - 02:23

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 20: భారత్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల మహిళల టి-20 సిరీస్‌ను, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్ కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ ఆదివారం నాటి రెండో టి-20లోనూ విఫలమై, 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీనితో సిరీస్‌ను విండీస్ సొంతం చేసుకోగా, మంగళవారం జరిగే చివరి, మూడో మ్యాచ్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయింది.

11/21/2016 - 02:22

విశాఖపట్నం: ఇది పరిమిత ఓవర్ల క్రికెట్ కాదు కాబట్టి పరుగుల వేటలో వికెట్లు పారేసుకోవలసిన అవసరం లేదని, ఇంకా 8 వికెట్లు తమ గుప్పిట్లో ఉన్నాయని, నిలకడగా ఆడి స్కోరు సాధిస్తామని ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. గెలుపు కోసం భారత జట్టు తొందరపడుతుంది కాబట్టి ఒత్తిడి పూర్తిగా వారిపైనే ఉంటుందని అన్నాడు.

11/21/2016 - 02:21

హైదరాబాద్, నవంబర్ 20: లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అంగీకరించింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించినట్టు గౌరవ కార్యదర్శి జాన్ మనోజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

11/20/2016 - 04:34

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 19: అశ్విన్ స్పిన్ మాయకు ఎంతటి సమర్థులైనా చిత్తుకాక తప్పదని మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలోనూ అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. అతను మొత్తం ఐదు వికెట్లు సాధించడంతో, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది.

11/20/2016 - 00:44

విశాఖపట్నం: ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక పరుగు తేడాతో ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగారు. మురళీ విజయ్ మూడు పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. లోకేష్ రాహుల్ పది పరుగులు చేసి, బ్రాడ్ బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టోకు దొరికిపోయాడు.

11/20/2016 - 00:41

విశాఖపట్నం: చివరి రెండు రోజులు తమకు పరీక్షా సమయమని, దీనిని సవాలుగా తీసుకుంటామని ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయర్‌స్టో అన్నాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడాడు. ఇప్పటికి తమ అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నాడు. మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే నాలుగో రోజు ఆటలో భారత్ బ్యాట్స్‌మెన్‌ను త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Pages