S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/19/2016 - 01:14

ఫజూ (చైనా), నవంబర్ 18: చైనా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్‌లో ఆమె హి బింగ్ జియోను 22-20, 21-10 తేడాతో ఓడించింది. ఫైనల్‌లో స్థానం కోసం ఆమె సంగ్ జీ హ్యున్‌ను ఢీ కొంటుంది.

11/19/2016 - 01:12

దుబాయ్, నవంబర్ 18: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్, స్టాండ్‌బై కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అతను ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు.

11/18/2016 - 00:19

విశాఖపట్నం: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరో మైలురాయని చేరాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆటలో సెంచరీ చేసిన అతను, భారత కెప్టెన్‌గా ఎక్కువ శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ తెండూల్కర్ సరసన స్థానం సంపాదించాడు. టీమిండియా కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్ 11, మహమ్మద్ అజరుద్దీన్ 9 సెంచరీలు చేశారు. సచిన్‌తో కలిసి కోహ్లీ ఏడు శతకాలతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.

11/18/2016 - 00:20

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 17: ఇంగ్లాండ్‌తో గురువారం ఇక్కడ ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగింది. చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకాలతో కదంతొక్కారు. వీరి ప్రతిభతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లకు 317 పరుగులు సాధించి పటిష్టమైన స్థితికి చేరింది. కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

11/18/2016 - 00:14

విశాఖపట్నం: విశాఖలో వనే్డ ఇంటర్నేషనల్ కెరీర్‌ను ఆరంభించిన హర్యానా ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ టెస్టు ఫార్మాట్‌లోనూ ఇదే మైదానంలో అరంగేట్రం చేయడం విశేషం. న్యూజిలాండ్‌తో గత నెల జరిగిన మ్యాచ్‌తో అతని వనే్డ కెరీర్ మొదలైంది. భారత్ తరఫున ఈ విధంగా ఒకే మైదానంలో తమ తొలి వనే్డ, టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఎనిమిదో క్రికెటర్‌గా జయంత్ గుర్తింపు పొందాడు. భారత్ తరఫున టెస్టు జట్టుకు ఎంపికైన 286వ ఆటగాడు అతను.

11/18/2016 - 00:13

సిడ్నీ, నవంబర్ 17: ఆస్ట్రేలియా క్రికెట్ జాతీయ సెలక్షన్ కమిటీ తాత్కాలిక చీఫ్‌గా ట్రెవర్ హాన్స్ ఎంపికయ్యాడు. ఆసీస్ వరుసగా ఐదు టెస్టుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కోవడంతో, చీఫ్ సెలక్టర్, మాజీ వికెట్‌కీపర్ రాడ్నీ మార్ష్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జట్టు వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న మార్ష్ ఇక ముందు తాను సెలక్టర్‌గా కొనసాగలేనని ప్రకటించాడు.

11/18/2016 - 00:11

విశాఖపట్నం: విశాఖలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియం సిబ్బందిని ఓ కుక్క పరుగులు పెట్టించింది. ఇంగ్లాండ్, భారత్ మొదటి టెస్టు మ్యాచ్ రెండో సెషన్‌లో ఆట ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నప్పుడు సెక్యూరిటీ కళ్లుగప్పి ఎలా ప్రవేసించిందోగానీ, ఓ కుక్క మైదానంలో దర్శనమిచ్చింది. అప్పటికి చటేశ్వర్ పుజారా 97, విరాట్ కోహ్లీ 91 పరుగులతో ఆడుతున్నారు.

11/18/2016 - 00:10

విశాఖపట్నం: రెండో టెస్టు ఆడుతున్న 11 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లలో ఏడుగురు ఎడమ చేతివాటం గలవారే. భారత్‌పై ఇంత మంది లెఫ్టీలతో ఇంగ్లాండ్ ఒక టెస్టు ఆడడం ఇదే మొదటిసారి. కెప్టెన్ అలిస్టర్ కుక్‌తోపాటు మోయిన్ అలీ, జాఫర్ అన్సారీ, జిమీ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ లెఫ్టీలే.

11/18/2016 - 00:09

పెర్త్, నవంబర్ 17: ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మన్ ఆడం వోగ్స్ ఇక్కడ షీఫీల్డ్ షీల్డ్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగిన అతనికి టాస్మానియా ఫాస్ట్ బౌలర్ కామ్ స్టీవెన్‌సన్ వేసిన బౌన్సర్ బలంగా తగిలింది. మెడ భాగంలో బంతి తగలడంతో విలవిల్లాడిన వోగ్స్ అక్కడే కుప్పకూలాడు.

11/18/2016 - 00:07

లండన్, నవంబర్ 17: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న ఎటిపి ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఇవాన్ లెండిల్ గ్రూప్ నుంచి బరిలోకి దిగి సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ చేరాడు. మిలోస్ రోనిక్‌ను 7-6, 7-6 తేడాతో ఓడించిన అతనికి రెండో రౌండ్‌లో డేవిడ్ గోఫిన్ నుంచి వాకోవర్ లభించింది. ఆరోగ్య కారణాలతో గోఫిన్ పోటీ నుంచి వైదొలిగాడు.

Pages