S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/15/2016 - 08:35

హోబర్ట్, నవంబర్ 14: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 241 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ సమయోచిత శతకంతో రాణించి, దక్షిణాఫ్రికాను బలమైన స్థితిలో నిలబెట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 121 పరుగులు చేసింది.

11/15/2016 - 08:34

సావో పౌలో, నవంబర్ 14: నాలుగోసారి ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ స్థానాన్ని పదిలం చేసుకునే రేసులో నువ్వా నేనా అన్న చందంగా దూసుకెళుతున్న మెర్సిడిజ్ డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోజ్‌బెర్గ్ మధ్య పోటీ మరింత పెరిగింది. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను గెల్చుకున్న హామిల్టన్ ఈ విషయంలో తాను వెంటాడతానని రోజ్‌బెర్గ్‌ను హెచ్చరించాడు.

11/15/2016 - 08:34

సావో పౌలో, నవంబర్ 14: ఫార్ములా వన్ రేసులో విలియమ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫెలిప్ మస్సా బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీలో సాంకేతిక కారణాలవల్ల రేసును ముగించలేకపోయాడు. హోం సర్క్యూట్‌లో అతనికి ఇదే చివరి రేసు కావడంతో వేలాది మంది అభిమానులు హర్షధ్వానాలు చేస్తుండగా అతను విలియమ్స్ గ్యారేజీ నుంచి బయటకు వచ్చాడు.

11/15/2016 - 08:33

స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్), నవంబర్ 14: ఫెడ్ కప్ టెన్నిస్‌ను చెక్ రిపబ్లిక్ వరుసగా మూడోసారి, ఆరేళ్ల కాలంలో ఐదోసారి కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో ఈ జట్టు ఫ్రాన్స్‌ను 3-2 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. బార్బరా స్ట్రైకోవా రెండు అద్వితీయ విజయాలను నమోదు చేసి, చెక్ రిపబ్లిక్ టైటిల్‌ను అందుకోవడంలో ప్రధాన భూమిక పోషించింది.

11/14/2016 - 00:44

రాజ్‌కోట్, నవంబర్ 13: ముందుగా ఊహించిన విధంగానే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి క్రికెట్ టెస్టు డ్రాగా ముగిసింది. అయితే, ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ శతకం సాధించి సవాలు విసరడం, తీవ్రమైన ఒత్తిడికి గురైన టీమిండియా సతమతమైనప్పటికీ చివరికి ఓటమి ప్రమాదం నుంచి బయటపడడం చివరి రోజు ఆటలో విశేషాంశాలు.

11/14/2016 - 00:42

రాజ్‌కోట్: ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ అసాధారణ సెంచరీతో పలు రికార్డులను నమోదు చేశాడు. భారత్‌లో టీమిండియాపై అతను ఐదోసారి సెంచరీ చేశాడు. మన దేశంలో మరే ఇతర జట్టు బ్యాట్స్‌మెన్ ఇన్ని శతకాలు సాధించలేదు. వెస్టిండీస్‌కు చెందిన ఎవర్టన్ వీక్స్, క్లెయివ్ లాయిడ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా తలా నాలుగు పర్యాయాలు భారత్‌లో టెస్టు సెంచరీలు చేశారు.

11/14/2016 - 00:41

రాజ్‌కోట్: స్పిన్నర్ అదిల్ రషీద్‌కు సూచనలిస్తున్న ఇంగ్లాండ్ బౌలింగ్ కోచ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లెయన్ ముస్తాక్. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) అతని కాంట్రాక్టును పొడిగించింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్పిన్నర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యాన్ని కనబరచి, సత్తా చాటుకోవడం వెనుక సక్లెయన్ కీలక పాత్ర పోషించాడు

11/14/2016 - 00:40

రాజ్‌కోట్: స్పిన్‌లో భారత్‌కు తిరుగులేదన్న ధీమాకు ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు గండికొట్టింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు సగటు 33.30 పరుగులిచ్చి, 13 వికెట్లు పడగొడితే, భారత స్పిన్నర్లు ఏకంగా 57.88 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు సాధించారు. ఇరు జట్ల స్పిన్నర్లు ఇచ్చిన పరుగుల సగటులో 24.58 వ్యత్యాసం ఉంది.

11/14/2016 - 00:38

జొహానె్నస్‌బర్గ్, నవంబర్ 13: వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ అల్విరో పెటెర్సన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. దక్షిణాఫ్రికా క్లబ్ హైవెల్డ్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనితో అన్ని బాధ్యతల నుంచి అతనిని తప్పించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.

11/14/2016 - 00:37

గుర్‌గావ్, నవంబర్ 13: టీనేజ్ సంచలనం అదితి అశోక్ ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. యూరోపియన్ టూర్ టైటిల్‌ను సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది. చివరి రౌండ్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచిన 18 ఏళ్ల అదితి తన సమీప ప్రత్యర్థులు బ్రిటానీ లిసికోమ్ (అమెరికా), బెలెన్ మొజో (స్పెయిన్)లను వెనక్కు నెట్టేసింది.

Pages