S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/14/2016 - 00:36

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 13: భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న వనే్డ క్రికెట్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వనే్డలో భారత మహిళా జట్టు 72 బంతులు మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

11/14/2016 - 00:32

హోబర్ట్, నవంబర్ 13: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. ఉదయం నుంచి భారీ జల్లులు పడడంతో అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది. వికెట్‌ను కవర్లతో కప్పినప్పటికీ, మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ వేచి చూసిన అంపైర్లు చివరికి రెండో రోజు ఆట రద్దయినట్టు ప్రకటించారు.

11/14/2016 - 00:29

సెయింట్ జాన్స్, నవంబర్ 13: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రేవోపై వేటు పడింది. కాంట్రాక్టు ఫీజు పెంపు, మెరుగైన సౌకర్యాలు వంటి డిమాండ్లపై చాలాకాలంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)తో డారెన్ విభేదిస్తున్నాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరూన్‌ను ‘బిగ్ ఇడియట్’ (పెద్ద మూర్ఖుడు) అని తిట్టడం మరో కొత్త వివాదానికి కారణమైంది.

11/13/2016 - 07:33

రాజ్‌కోట్, నవంబర్ 12: ఇంగ్లాండ్‌తో జరుతున్న మొదటి టెస్టు డ్రా దిశగా సాగుతున్నది. మ్యాచ్ నాలుగో రోజు ఆటను నాలుగు వికెట్లకు 319 పరుగుల స్కోరుతో మొదలుపెట్టిన టీమిండియాపై ఇంగ్లాండ్ ఎదురుదాడికి దిగింది. స్పిన్నర్లు, ప్రత్యేకించి అదిల్ రషీద్ భారత బ్యాట్స్‌మెన్‌ను భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేశారు.

11/13/2016 - 07:30

రాజ్‌కోట్: కెరీర్‌లో మొదటి టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్ తరఫున తొలి టెస్టులోనే ఈ మైలురాయిని దాటిన 20 ఏళ్లలోపు బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడోవాడిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 1906లో జాక్ క్రాఫోర్డ్, 1937లో డెనిస్ కాంప్టన్ 20 ఏళ్లలోనే టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తమతమ మొదటి టెస్టులో హాఫ్ సెంచరీలు సాధించారు.

11/13/2016 - 07:29

న్యూయార్క్, నవంబర్ 12: టైటిల్ హోల్డర్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే), చాలెంజర్ సెర్గీ కర్జాకిన్ (రష్యా) మధ్య మొదలైన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి గేమ్ డ్రాగా ముగిసింది. ఇరువురు ఆటగాళ్లకు చెరి అర పాయింట్ లభించింది. చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎలాంటి ఒత్తిడి లేకుండా పావులను కదిలించాడు. మొదటి గేమ్ కావడంతో కర్జాకిన్ కూడా దూకుడుగా ఆడకుండా సంయమనం ప్రదర్శించాడు.

11/13/2016 - 07:29

హోబట్, నవంబర్ 12: దక్షిణాఫ్రికాతో శనివారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవలం 85 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనితోపాటు జో మెన్నీ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు 32.5 ఓవర్లలోనే తెరపడింది.

11/13/2016 - 07:28

దుబాయ్, నవంబర్ 12: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) 45వ అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నికయ్యాడు. మొత్తం 118 సభ్య దేశాలున్న ఎఫ్‌ఐహెచ్ వార్షిక సమావేశంలో 110 మంది ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. బాత్రాకు 68 ఓట్లు లభించగా, అతనితో పోటీకి ది గిన డేవిడ్ బల్బర్నీ (ఐర్లాం డ్)కు 29, కెన్ రీడ్ (ఆస్ట్రేలి యా)కు 13 చొప్పున ఓట్లు దక్కాయి.

11/12/2016 - 08:49

రాజ్‌కోట్, నవంబర్ 11: రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో సెంచరీల హోరు మారుమోగుతున్నది. ఇంగ్లాండ్, భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడో రోజున మరో రెండు శతకాలు నమోదయ్యాయి. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (124) మొదటి రోజు, మోయిన్ అలీ (117), బెన్ స్టోక్స్ (128) రెండో రోజు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే.

11/12/2016 - 08:47

హోబట్, నవంబర్ 11: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టును వర్షం భయం వెంటాడుతున్నది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా 177 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా, రెండో టెస్టులోనూ హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. అన్ని విభాగాల్లోనూ విఫలమైన ఆసీస్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నది.

Pages