S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/12/2016 - 08:47

ఐక్య రాజ్య సమితి, నవంబర్ 11: యుఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా షరపోవాను మరోసారి నియమించారు. గతంలోనూ ఆమె ఈ హోదాలో కొనసాగింది. అయితే, డోపింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించి, సస్పెన్షన్‌కు గురైన కారణంగా ఆమె అనేక కాంట్రాక్టులతోపాటు యుఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గానూ పదవిని కోల్పోయింది. అయితే, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఎఐటిఎ) ఆమె సస్పెన్షన్ కాలాన్ని తగ్గించింది.

11/12/2016 - 08:46

న్యూఢిల్లీ, నవంబర్ 11: భారత బాక్సిర్లు అఖిల్ కుమార్, జితేందర్ కుమార్ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్‌ను కలిసి, ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌కు అనుమతించాలని కోరారు. హర్యానా భవన్‌లో ఖట్టార్‌ను కలిసిన వీరు ఇది వరకే తాము పోలీస్ శాఖకు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి, ఆమోద ముద్ర వేయాలని అభ్యర్ధించారు. ఇటీవలే హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను కూడా కలిశారు.

11/12/2016 - 08:46

బెంగళూరు, నవంబర్ 11: ఆస్ట్రేలియా ఈనెల చివరిలో మొదలయ్యే నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. రెగ్యులర్ గోల్‌కీపర్ శ్రీజేష్ గాయపడడంతో, అతని స్థానంలో డ్రాగ్ ఫ్లికర్ విఆర్ రఘునాథ్‌కు పగ్గాలు అప్పగించారు. కువాంటన్ (మలేసియా)లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో కొరియాను ఢీకొన్న భారత్ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శ్రీజేష్ మోకాలికి గాయమైంది.

11/12/2016 - 08:46

బెంగళూరు, నవంబర్ 11: ఆస్ట్రేలియా ఈనెల చివరిలో మొదలయ్యే నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. రెగ్యులర్ గోల్‌కీపర్ శ్రీజేష్ గాయపడడంతో, అతని స్థానంలో డ్రాగ్ ఫ్లికర్ విఆర్ రఘునాథ్‌కు పగ్గాలు అప్పగించారు. కువాంటన్ (మలేసియా)లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో కొరియాను ఢీకొన్న భారత్ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శ్రీజేష్ మోకాలికి గాయమైంది.

11/11/2016 - 06:45

రాజ్‌కోట్, నవంబర్ 10: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో గురువారం మరో రెండు శతకాలు నమోదయ్యాయి. రెండో రోజు ఆటలో ఇద్దరు, మొత్తం మీద ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించడంతో, భారత్‌తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 537 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 63 పరుగులు చేసింది.

11/11/2016 - 06:43

న్యూఢిల్లీ, నవంబర్ 10: జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్) విదేశీ కోచ్‌లను నియమించుకోవడంపై నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పలువురు క్రీడా ప్రముఖులతో ‘చింతక్ భైటక్’లో పాల్గొన్నారు.

11/11/2016 - 06:42

హరారే, నవంబర్ 10: జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసింది. చివరిదైన రెండో టెస్టును ఏకంగా 257 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని, 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులు సాధించిన శ్రీలంక ఆతర్వాత జింబాబ్వేను మొదటి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు కట్టడి చేసింది.

11/11/2016 - 06:41

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 10: మహిళల వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో గురువారం ఇక్కడి దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ బోణీ చేసింది. ఇంకా 65 బంతులు మిగిలి ఉండగానే, ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

11/11/2016 - 06:40

రాజ్‌కోట్, నవంబర్ 10: భారత్‌తో ఈనెల 17 నుంచి విశాఖపట్నంలో మొదలయ్యే రెండో టెస్టులో ఆడతానని, అప్పటిలోగా పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించుకుంటానని ఇంగ్లాండ్ సూపర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ భుజం గాయం కారణంగా బంగ్లాదేశ్ టూర్‌లో పాల్గొనలేకపోయిన విషయాన్ని గుర్తుచేశాడు. భారత్‌తో మొదటి టెస్టులోనూ ఇదే కారణంగా ఆడలేదని చెప్పాడు.

11/10/2016 - 06:18

* భారత్‌లో ఒక విదేశీ జట్టుకు చెందిన ఆటగాడు టెస్టు సెంచరీ చేసిన సంఘటన చివరిసారి 2013లో నమోదైంది. చెన్నైలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (130) శతకంతో రాణించాడు. ఆతర్వాత 12 టెస్టుల్లో ఏ ఒక్క విదేశీ క్రికెటర్ కూడా సెంచరీ చేయలేదు. పుష్కర కాలం అనంతరం జో రూట్ సెంచరీతో కదంతొక్కాడు. ఆసియాలో ఇంతకు ముందు అతని అత్యధిక స్కోరు 88 పరుగులు.

Pages