S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/03/2016 - 05:01

ముంబయి: ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ పేరు జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం చర్చకు వచ్చింది. అయితే, అతని కంటే హార్దిక్ పాండ్యను మెరుగైన ఆల్‌రౌండర్‌గా సెలక్టర్లు భావించారు. హార్దిక్ ఎక్కువ సంఖ్యలో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడకపోయినా, అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ ఎంపికను సమర్థించుకున్నాడు.

11/02/2016 - 07:33

సింగపూర్, నవంబర్ 1: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఎసిటి) మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం ఇక్కడ జరిగిన మూడవ పూల్ మ్యాచ్‌లో భారత జట్టు 2-0 గోల్స్ తేడాతో సింగపూర్ జట్టును మట్టికరిపించి అప్రతిహతంగా మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

11/02/2016 - 07:31

ముంబయి, నవంబర్ 1: ఇంగ్లాండ్‌తో కొద్ది రోజుల్లో జరుగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం ముంబయిలో సమావేశం కానుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) వర్గాలు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించాయి.

11/02/2016 - 07:30

షార్జా, నవంబర్ 1: పాకిస్తాన్‌తో తటస్థ వేదిక షార్జాలో జరుగుతున్న మూడో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ అజేయ శతకంతో రాణించాడు. దీంతో కరీబియన్లకు తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల ఆధిక్యత లభించింది.

11/01/2016 - 05:06

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 31: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఎస్ మేఘన భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌విమన్‌గా, మీడియం పేసర్‌గా గత ఆరు సీజన్లలో విశేష ప్రతిభ కనబర్చిన మేఘన వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత టి-20 జట్టులో స్థానం పొందింది. నవంబర్ 18 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్‌లో మేఘన ఆడనుంది.

11/01/2016 - 05:04

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 31: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 3-2 గోల్స్ తేడాతో ఓడించిన భారత టైటిల్ సాధించడం పట్ల కోచ్ రోలాంట్ ఆల్ట్‌మన్స్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ఇది ప్రారంభం మాత్రమేనని, మేజర్ టోర్నీల్లో విజయభేరి మోగించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

10/30/2016 - 01:45

నరాలు తెగే ఉత్కంఠ రేపుతుందనుకున్న భారత్, న్యూజిలాండ్ జట్ల చివరి వనే్డ ఏకపక్షంగా ముగిసింది. తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన టీమిండియా 190 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది. భారత స్పిన్ మాయాజాలానికి కివీస్ ఆటగాళ్లు కళ్లు తేలేశారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన చివరి వనే్డలో విజయం సాధించిన అనంతరం భారత క్రికెట్ జట్టు ఆనందహేల

10/30/2016 - 04:01

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 29: చివరి క్షణం వరకూ నరాలు తెగిపోయే ఉత్కంఠ రేపుతుందనుకున్న భారత్, న్యూజిలాండ్ జట్ల చివరి వనే్డ ఏక పక్షంగా ముగిసింది. అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన టీమిండియా 190 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.

10/30/2016 - 01:01

విశాఖపట్నం, అక్టోబర్ 29: భారత క్రికెటర్లు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. స్టార్ ప్లస్ ‘నరుూ సోంచ్’ (కొత్త ఆలోచన) పేరుతో రూపొందించిన కార్యక్రమానికి ఆటగాళ్లంతా మద్దతుపలికారు. న్యూజిలాండ్‌తో ఇక్కడ జరిగిన చివరి వనే్డలో టీమిండియా క్రికెటర్లు తమ తల్లి పేరు ఉన్న జెర్సీలను ధరించారు.

10/30/2016 - 00:59

ఐదు వికెట్లు పగడొట్టి న్యూజిలాండ్‌పై భారత్‌కు ఘన విజయాన్ని సాధించిపెట్టిన స్పిన్నర్ అమిత్ మిశ్రా ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్ మొత్తంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన అతనికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది

చిత్రం.. వాల్టింగ్ వికెట్ తీసిన అమిత్ మిశ్రాకు సహచరుల అభినందన

Pages