S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/30/2016 - 00:57

* భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ నుంచి జయంత్ యాదవ్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. హర్యానాకు చెందిన ఈ యువ స్పిన్నర్ విశాఖపట్నంలో వనే్డతో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో అతనికి అవకాశం దక్కింది. మ్యాచ్ ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేశాడు. అనంతరం నాలుగు ఓవర్లు బౌల్ చేసి, ఎనిమిది పరుగులకు ఒక వికెట్ పడగొట్టాడు.

10/30/2016 - 00:55

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 29: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో పోరును ఖాయం చేసుకున్నాయి. ఈ రెండు జట్లు శనివారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లను పెనాల్టీ షూటౌట్‌లో గెల్చుకోవడం విశేషం. దక్షిణ కొరియాను భారత్, మలేసియాను పాక్ ఓడించాయి. తొలి సెమీ ఫైనల్‌లో భారత్‌కు కొరియా గట్టిపోటీనిచ్చింది. 15వ నిమిషంలో తల్వీందర్ సింగ్ భారత ఖాతాను తెరిచాడు.

10/30/2016 - 00:54

పుణె, అక్టోబర్ 29: సౌజన్య బవిశెట్టి కెరీర్‌లో ఐటిఎఫ్ సింగిల్స్ టైటిల్‌ను అందుకుంది. ఈ సీజన్‌లో ఆమెకు ఇది తొలి టైటిల్. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సౌజన్య ఫైనల్‌లో మిహికా యాదవ్‌ను 7-5, 6-2 తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో జాతీయ చాంపియన్ రియా భాటియాపై గెలిచిన సౌజన్యకే టైటిల్ దక్కుతుందని క్రీడా పండితులు జోస్యం చెప్పారు.

10/30/2016 - 00:52

షార్జా, అక్టోబర్ 29: వెస్టిండీస్‌ను వనే్డ, టి-20 సిరీస్‌ల్లో చిత్తుచేసి, టెస్టు సిరీస్‌ను కూడా ఇప్పటికే కైవసం చేసుకున్న పాకిస్తాన్ సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 3-0, అనే్న మ్యాచ్‌లున్న టి-20 సిరీస్‌ను అదే తేడాతో గెల్చుకున్న పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు టెస్టుల్లోనూ గెలుపొంది, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

10/29/2016 - 05:09

విశాఖపట్నం స్టేడియంలో భారత్ ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌ని కోల్పోయింది. చివరిసారి ఈ మైదానంలో 2014 నవంబర్‌లో శ్రీలంకతో మ్యాచ్ ఆడింది. లంకను 5-0 తేడాతో వైట్‌వాష్ చేసే క్రమంలో ఇక్కడ విజయాన్ని నమోదు చేసింది

10/29/2016 - 05:06

విశాఖపట్నం, అక్టోబర్ 28: భారత పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై మరోసారి చర్చ ఊపందుకుంది. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితేనే మంచిదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వంటి వారు అభిప్రాయపడుతుంటే, అతనికి ఆరో స్థానమే సరైనదని మరికొందరు వాదిస్తున్నారు. న్యూజిలాండ్‌తో రాంచీలో జరిగిన నాలుగో వనే్డలో ధోనీ 11 పరుగులకే అవుట్ కావడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది.

10/29/2016 - 05:05

పారిస్, అక్టోబర్ 28: ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పివి సింధు ఓటమిపాలైంది. రియో ఒలింపిక్స్‌లో ఆడిన తర్వాత తొలిసారి డెన్మార్క్ ఓపెన్‌లో ఆడిన ఆమె రెండో రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఆమె రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. చైనాకు చెందిన హి బింగియావోతో జరిగిన మ్యాచ్‌ని ఆమె 20-22, 17-21 తేడాతో చేజార్చుకుంది.

10/29/2016 - 05:05

వలెన్షియా, అక్టోబర్ 28: ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల జూనియర్ హాకీ టోర్నమెంట్ చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మ్యాచ్ 5వ నిమిషంలోనే పర్వీందర్ సింగ్ భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. అయితే, పది నిమిషాల వ్యవధిలోనే గెరార్డ్ గార్సియా ద్వారా స్పెయిన్‌కు ఈక్వెలైజర్ లభించింది.

10/29/2016 - 05:04

కువాంటన్, అక్టోబర్ 28: భారత్‌లో జరిగే జూనియర్ ప్రపంచ కప్ టోర్నీకి సిద్ధమవుతున్నట్టు పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) కార్యదర్శి షాబాజ్ అహ్మద్ స్పష్టం చేశాడు. లక్నో వేదికగా జరిగే ఈ టోర్నీలో పాల్గొంటామనే అనుకుంటున్నామని చెప్పాడు. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ తెలిపాడు. భారత్‌కు జట్టును పంపాలా? వద్దా?

10/29/2016 - 05:02

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 28: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో భారత కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ ఆడడం అనుమానంగానే ఉంది. శనివారం దక్షిణ కొరియాతో జరిగే ఈ మ్యాచ్‌లో అతను ఆడేదీ లేనిదీ ఇంకా ఖరారు కాలేదు. కాలి మడమ గాయంతో బాధపడుతున్న శ్రీజేష్ పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్న విషయంపై జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టత ఇవ్వలేదు.

Pages