S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/27/2016 - 07:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో వనే్డ ఇంటర్నేషనల్ రాంచీలో ప్రారంభం కావడానికి కొద్ది సేపటి ముందు ఇరు దేశాల ప్రధానులు క్రికెట్ పదాలను, క్రికెటర్లను ప్రస్తావిస్తూ విలేఖరుల సమావేశాన్ని రక్తికట్టించారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఈ సమావేశంలో వెల్లడిస్తున్న సమయంలో భారత ప్రధాని మోదీ ముందుగా క్రికెట్ ప్రస్తావన తెచ్చారు.

10/27/2016 - 07:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో అపూర్వ విజయాలను అందుకున్న తర్వాత కొంతకాలం ఆమెతో విడిపోయి, వేర్వేరు భాగస్వాములతో కలిసి ఆడిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ పాత స్నేహితురాలి పట్ల మొగ్గు చూపుతున్నది. ఈ ఏడాది ఆరంభంలో విడిపోయే సమయానికి ఈ జోడీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది.

10/27/2016 - 07:23

విశాఖపట్నం, ఆక్టోబర్ 26: ఈ నెల 29న భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య విశాఖలో జరగనున్న డే నైట్ వనే్డ మ్యాచ్ సందిగ్ధంలో పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ‘కయాంత్’ ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. తుపాను కారణంగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు కోస్తా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది.

10/27/2016 - 07:22

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 26: ఇక్కడ జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ అధికారికంగా సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. మలేసియాతో మ్యాచ్‌కి ముందు భారత్ సెమీస్ స్థానం దాదాపు ఖరారుకాగా, ఈ మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకొన్న శ్రీజేష్ బృందం నంబర్ వన్ స్థానాన్ని పదిలపరచుకుంది. రూపీందర్‌పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత్‌ను గెలిపించాడు.

10/26/2016 - 08:45

కౌంటన్ (మలేసియా), అక్టోబర్ 25: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాక్‌పై ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న భారత్ మంగళవారం చైనాకు చుక్కలు చూపించింది. ఆట ప్రారంభంనుంచి ధాటిగా ఆడిన భారత్‌కు చైనా ఏ దశలోను పోటీ ఇవ్వలేక పోయింది. ఆట ప్రారంభమైన తొమ్మిదో నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ తొలి గోల్ కొట్టి భారత్‌కు 1-0 ఆధిక్యత సాధించి పెట్టాడు.

10/26/2016 - 08:44

రాంచీ, అక్టోబర్ 25: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా జరుగనున్న నాలుగో మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్వస్థలమైన రాంచీ ఆతిథ్యమివ్వనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

10/26/2016 - 08:44

కేప్ డీ ఆగ్డే (ఫ్రాన్స్), అక్టోబర్ 25: ప్రపంచంలోని ప్రతిష్టత్మకమైన టోర్నమెంట్లలో ఒకటిగా పరిగణించే అనతోలీ కార్పోవ్ ర్యాపిడ్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ 14వ ఎడిషన్‌లో ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అలరించింది. నాలుగో రోజు జరిగిన తొలి గేమ్‌లో ఆమె ప్రపంచ మాజీ చాంపియన్ అనతోలీ కార్పోవ్‌ను ముప్పతిప్పలు పెట్టింది.

10/26/2016 - 08:43

వాలెన్సియా, అక్టోబర్ 25: నాలుగు దేశాల జూనియర్ ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత బాలుర జట్టు శుభారంభాన్ని సాధించింది. జర్మనీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్ రెండు గోల్స్‌తో రాణించాడు. 17, 25 నిమిషాల్లో వరుణ్ సాధించిన రెండు గోల్స్‌కు తోడు 68వ నిమిషంలో భారత్‌కు అజయ్ యాదవ్ మరో గోల్‌ను అందించాడు.

10/26/2016 - 08:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: నవంబర్‌లో జరుగునున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అథ్లెట్ల కమిషన్ సమావేశానికి హాజరు కాలేనని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రకటించింది. ప్రస్తుతం తాను త్వరలో జరుగనున్న చైనా, హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్లకు సన్నాహకాల్లో మునిగిపోవడమే ఇందుకు కారణమని ఆమె వివరించింది.

10/26/2016 - 08:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: నవంబర్‌లో జరుగునున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అథ్లెట్ల కమిషన్ సమావేశానికి హాజరు కాలేనని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రకటించింది. ప్రస్తుతం తాను త్వరలో జరుగనున్న చైనా, హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్లకు సన్నాహకాల్లో మునిగిపోవడమే ఇందుకు కారణమని ఆమె వివరించింది.

Pages