S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/26/2016 - 08:41

కోల్‌కతా, అక్టోబర్ 25: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో ముంబయి సిటీ క్లబ్ జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో మంగళవారం ఆ జట్టు అట్లెటికో డీ కోల్‌కతాను సొంత మైదానంలో ఓడించడమే ఇందుకు కారణం. దీంతో అట్లెటికో డీ కోల్‌కతా వరుస విజయాలకు అడ్డుకట్ట పడింది.

10/25/2016 - 04:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వనే్డ ఇంటర్నేషనల్స్‌కు ఎంపిక చేసిన జట్టునే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించాలని జాతీయ సెలక్టర్లు నిర్ణయించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. డెంగ్యూ వ్యాధి సోకిన సురేష్ రైనా ఇంకా పూర్తి ఫిట్నెస్‌తో లేడని పేర్కొంది.

10/25/2016 - 04:27

ఆస్టిన్ (అమెరికా), అక్టోబర్ 24: డిఫెండింగ్ ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తన కెరీర్‌లో 50వ విజయాన్ని నమోదు చేశాడు. మెర్సిడిజ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ బ్రిటిష్ డ్రైవర్ ఇక్కడ జరిగిన యుఎస్ గ్రాండ్ ప్రీ రేసులో టైటిల్ సాధించి, ప్రపంచ నంబర్ వన్ హోదాను నిలబెట్టుకునే అవకాశాలను మెరుగుపరచుకున్నాడు.

10/25/2016 - 04:22

చిట్టగాంగ్, అక్టోబర్ 24: చివరి వరకూ ఉత్కంఠ రేపిన మొదటి టెస్టులో బంగ్లాదేశ్‌ను ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో ఓడించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసిన బంగ్లాదేశ్ సోమవారం ఉదయం ఆటను కొనసాగించి 263 పరుగులకు ఆలౌటైంది.

10/25/2016 - 04:20

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 24: చివరి రెండు రౌండ్ రాబిన్ మ్యాచ్‌లను కూడా గెల్చుకొని, లీగ్ దశను నంబర్ వన్ స్థానంతో ముగించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు మంగళవారం చైనాను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 10-2 భారీ ఆధిక్యంతో చిత్తుచేసిన భారత్, అత్యంత ఉత్కంఠ రేపిన రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 3-2 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.

10/25/2016 - 04:19

గోండా (ఉత్తర ప్రదేశ్), అక్టోబర్ 24: జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఒలింపియన్ సందీప్ తోమర్ స్వర్ణ పతకం సాధించాడు. 57 కిలోల విభాగంలో పోటీపడిన అతను ఫైనల్‌లో ఉత్కృష్ట్ కాలేను ఓడించాడు. అంతకు ముందు అమిత్ కుమార్‌ను ఓడించిన ఉత్కృష్ట్ తుది పోరులో తోమర్‌ను ఓడించలేక పోయాడు. 65 కిలోల విభాగంలో భజరంగ్‌కు టైటిల్ దక్కింది. ఫైనల్‌లో ఓడిన రాహుల్ మాన్ రజత పతకాన్ని స్వీకరించాడు.

10/25/2016 - 04:18

పారిస్, అక్టోబర్ 24: క్వాలిఫయర్స్‌తో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో పివి సింధు టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తర్వాత విశ్రాంతి తీసుకున్న సింధు గత వారం డెన్మార్క్ ఓపెన్‌లో పాల్గొంది. అయితే, రెండో రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది.

10/25/2016 - 04:18

బుడాపెస్ట్‌లో జరిగిన యూరోపియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో టైటిళ్లు సాధించిన ఇమాన్యుయెల్ లెబెసన్, మెలెక్ హ్యూ

10/25/2016 - 04:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలపై హక్కులను ఇచ్చేందు కు నిర్వహించాల్సిన టెండర్ల ప్రక్రి యను వాయదా వేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. దీనికి సంబం ధించిన మార్గదర్శకాలను లోధా ప్యానెల్ ఇంకా వి డుదల చేయకపోవడంతో, గత్యంతరం లేక ఈ ని ర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

10/24/2016 - 06:36

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 23: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించింది. ఒక దశలో 1-2 తేడాతో వెనుకబడిన భారత్‌కు రూపీందర్‌పాల్ సింగ్, రమణ్‌దీప్ సింగ్ ఒక నిమిషం తేడాలో గోల్స్ చేసి, చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టారు. హాకీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇది 166వ మ్యాచ్‌కాగా, భారత్‌కు 54వ విజయం.

Pages