S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/05/2016 - 07:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: సింగపూర్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో తలపడే భారత మహిళా హాకీ జట్టుకు ఫార్వర్డ్ క్రీడాకారిణి వందనా కటారియా సారథ్యం వహించనుంది. అయితే ఇటీవల రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన సుశీలా చానూకు ఈ జట్టులో చోటు కల్పించకుండా డిఫెండర్ సునీతా లక్రాను వైస్-కెప్టెన్‌గా నియమించారు.

10/05/2016 - 07:22

ముంబయి, అక్టోబర్ 4: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చివరి టెస్టును నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపిసిఎ) ఏర్పాట్లు చేస్తోంది. ఎంపిసిఎకి చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించాడు.

10/05/2016 - 07:20

దుబాయ్, అక్టోబర్ 4: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) విడుదల చేసిన టాప్-10 ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా నుంచి ఎవరికీ స్థానం లభించలేదు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

10/05/2016 - 07:19

కోల్‌కతా, అక్టోబర్ 4: ఇండోర్‌లో ఈ నెల 8నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడవ, చివరి టెస్టు మ్యాచ్‌కోసం భారత జట్టులో గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కర్నాటకకు చెందిన యువ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్‌ను తీసుకున్నారు. ఎడం చేతి బొటనవేలు గాయం కారణంగా మూడో టెస్టుకు శిఖర్ ధావన్ దూరం కావడంతో కరుణ్ నాయర్‌కు అవకాశం లభించింది. నాయర్ భారత్ తరఫున ఇప్పటివరకు రెండు వన్‌డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

10/04/2016 - 01:12

కోల్‌కతా: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాకు లభించింది. అతను తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 54 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అవుట్ కాకుండా 58 పరుగులు చేశాడు. ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకాలు నమోదు చేసిన నాలుగో భారత వికెట్‌కీపర్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

10/04/2016 - 01:14

కోల్‌కతా, అక్టోబర్ 3: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ని 178 పరుగుల తేడాతో గెల్చుకున్న భారత క్రికెట్ జట్టు ఒకే విజయంతో రెండు లాభాలను సొంతం చేసుకుంది. కివీస్‌పై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాక, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను రెండో స్థానానికి నెట్టేసి, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.

10/04/2016 - 01:01

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మొండి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న లోధా కమిటీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నది. బిసిసిఐ తరఫున ఎలాంటి చెల్లింపులు జరపరాదని ఆ సంస్థకు ఖాతాలున్న బ్యాంకులకు లేఖ రాసింది. దాని నకలును బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రాహుల్ జోహ్రి, కోశాధికారి అనిరుద్ధ్ చౌదరీలకు కూడా పంపింది.

10/04/2016 - 01:00

ముంబయి, అక్టోబర్ 3: రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఘన సన్మానం జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

10/04/2016 - 00:58

పుణె, అక్టోబర్ 3: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణె సిటీపై ముంబయ సిటీ జట్టు 1-0 ఆధిక్యంతో గెలిచింది. మథియాస్ డిఫడిరికో కీలక గోల్ చేసి ముంబయని గెలిపించాడు. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్నందున, ఓటమిపాలు కాకూడదన్న ఉద్దేశంతో పుణె ఆది నుంచి రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ఆ వ్యూహమే జట్టు పరాజయానికి కారణమైంది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయ.

10/04/2016 - 00:57

కోల్‌కతా, అక్టోబర్ 3: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లేదా చాంపియన్స్ ట్రోఫీల్లో ఏదో ఒక టోర్నమెంట్‌లోనే టీమిండియా పాల్గొంటుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడానికి ఈ వివాదాన్ని బిసిసిఐ లేవనెత్తుతున్నది.

Pages