S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/21/2016 - 01:06

కువాన్‌టన్ (మలేసియా), అక్టోబర్ 20: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. గురువారం తన తొలి మ్యాచ్‌లో జపాన్‌ను ఢీ కొన్న భారత్‌కు రూపీందర్‌పాల్ సింగ్ విజృంభణ అండగా నిలిచింది. అతను డబుల్ హ్యాట్రిక్‌తో రాణించగా, భారత్ 10-2 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది.

10/21/2016 - 01:04

హైదరాబాద్, అక్టోబర్ 20: మోకాలికి శ స్త్ర చికిత్స చేయంచుకొని కోలుకుంటున్న భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వా ల్ వచ్చే నెల జరిగే చైనా ఓపెన్‌కు హాజర య్యే అవకాశాలున్నాయ. తాను ప్రాక్టీస్ ఆ రంభించానని, చైనా ఓపెన్‌లోగా కోలుకుం టానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

10/21/2016 - 01:04

ఒడెన్స్, అక్టోబర్ 20: డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ టోర్న మెంట్‌లో భారత స్టార్ పివి సింధు ఓటమిపాలై నిష్క్రమిం చింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వా త మొదటిసారి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ఆమె మొదటి రౌండ్‌లో హి బింగియావోను 21-14, 21-19 తేడాతో ఓడిం చింది. అయతే, రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన సయా క తకహషి చేతిలో 13-21, 23-21, 18-21 తేడాతో ఓడింది.

10/21/2016 - 01:03

అహ్మదాబాద్, అక్టోబర్ 20: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో థాయిలాండ్‌ను ఢీకొనేందుకు భారత్ సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ టోర్నీలో జయాపజయాల పట్టకను చూస్తే, భారత్ కంటే థాయ్ మెరుగైన స్థితిలో కనిపిస్తుంది. భారత్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా, రెండు పరాజయాలను చవిచూసింది. థాయ్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచింది.

10/20/2016 - 07:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: న్యూజిలాండ్‌పై మరోసారి దాడి చేసేందుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డను టీమిండియా ఇంకా 101 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న విషయం తెలిసిందే.

10/20/2016 - 07:13

అహ్మదాబాద్, అక్టోబర్ 19: ప్రపంచ కప్ కబ డ్డీ చాంపియన్‌షిప్‌లో బుధవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో అర్జెంటీనా చిత్తయం ది. బంగ్లాదేశ్ 67 పాయంట్లు సాధించగా, అర్జెంటీ నా 26 పాయంట్లకే పరిమితమైంది. బంగ్లా ఆటగా డు తౌహిన్ తరఫ్దార్ అత్యధికంగా 16 పాయంట్లు చేశాడు. కెప్టెన్ అరుదుజామాన్ మున్షీ 13 పా యంట్లు సాధించాడు. వీరిద్దరే అర్జెంటీనా కంటే ఎక్కువ పాయంట్లు చేయడం గమనార్హం.

10/20/2016 - 07:12

సాన్ జువాన్ (పోర్టారికో), అక్టోబర్ 19: భారత బాక్సింగ్ మండలి (ఐబిసి)కి ప్రపంచ బాక్సింగ్ సంఘం (డబ్ల్యుబివో) గుర్తింపు లభించింది. భారత దేశంలో లైసెన్సు పొందిన ప్రొఫెషనల్ బాక్సర్ల పోటీలు, టోర్నీలను నిర్వహించడమేగాక, అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీలకు అభ్యర్థుల ఎంపికను కూడా ఐబిసి పర్యవేక్షిస్తుంది. ఇక్కడ జరిగిన డబ్ల్యుబివో 29వ వార్షిక సభలో ఐబిసికి గుర్తింపును అధికారికంగా ప్రకటించారు.

10/20/2016 - 07:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ప్రతి మనిషికీ జీవితంలో విశ్వసనీయతే ముఖ్యమని భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. విజయ్ లోకపల్లి తనపై రాసిన పుస్తకం ‘డ్రివెన్’ను ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించిన కోహ్లీ మాట్లాడుతూ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. 1996 నుంచి అతనే తన కోచ్ అంటూ, ఎప్పటికీ అతనిని మార్చబోనని స్పష్టం చేశాడు.

10/20/2016 - 07:11

ముంబయి, అక్టోబర్ 19: దేశంలో క్రికెట్ రంగ ప్రక్షాళనకు లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో ఎదురయ్యే పలు కీలక సమస్యలు, క్రికెట్ అభివృద్ధికి అడ్డంకిగా తయారైన అంశాలను సుప్రీం కోర్టులో ఎందుకు వినిపించడం లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) లేఖాస్త్రాన్ని సంధించింది.

10/20/2016 - 07:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ప్రో కబడ్డీ ఆటగాడు రోహిత్ చిల్లార్ భార్య లలిత సుమారు రెండు గంటల నిడివిగల వీడియో రికార్డులో తాను ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి మరీ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తున్నది. ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో బెంగళూరు బుల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న 26 ఏళ్ల రోహిత్ ఉద్యోగరీత్యా ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నాడు. లలిత ఢిల్లీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నది.

Pages