S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/13/2016 - 04:22

గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 12: దులీప్ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా రెడ్ 356 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్లూ మొదటి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 693 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా రెడ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 16 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి 356 పరుగులకు కుప్పకూలింది.

09/12/2016 - 18:19

దిల్లీ: భారత మల్లయోధురాలు సాక్షి మలిక్‌ టాప్‌-5 రెజ్లర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య ప్రకటించిన ర్యాంకుల జాబితాలో 58 కిలోల విభాగంలో సాక్షి నాలుగో స్థానాన్ని సంపాదించింది. తొలిసారి రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్‌ సాక్షినే కావడం విశేషం.

09/12/2016 - 12:57

ముంబయి: సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలో సోమవారం జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రాహుల్‌, పూజారా, రహానె, విజయ్‌, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, సాహా, రవీంద్ర జడేజా, షమీ, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, అమిత్‌ మిశ్రా, ఉమేశ్‌ యాదవ్‌లతో 15మంది సభ్యులు గల జట్టును ప్రకటించారు.

09/12/2016 - 00:39

న్యూయార్క్, సెప్టెంబర్ 11: జర్మనీ టెన్నిస్ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె చెక్ రిపబ్లిక్‌కు చెందిన పదోసీడ్ కరోలినా ప్లిస్కోవాను 6-3, 4-6, 6-4 తేడాతో ఓడించి, కెరీర్‌లో రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సంపాదించుకోవడమేగాక, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకుంది.

09/12/2016 - 00:37

13 టెస్టులు

09/12/2016 - 00:36

గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 11: ఇండియా రెడ్‌తో ఆదివారం ప్రారంభమైన ఐదు రోజుల దులీప్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ మొదటి ఇన్నింగ్స్‌ను ఇండియా బ్లూ ఆరు వికెట్లకు 693 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. చటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీతో రాణించగా, షెల్డన్ జాక్సన్ శతకాన్ని నమోదు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా బ్లూకు మాయాంక్ అగర్వాల్, కెప్టెన్ గౌతం గంభీర్ చక్కటి ఆరంభాన్నిచ్చారు.

09/12/2016 - 00:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ శశాంక్ మనోహర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఐసిసి నుంచే వచ్చే వాటాను వదులుకునే ప్రసక్తే లేదని ఠాకూర్ తేల్చిచెప్పడం ఇప్పుడు మనోహర్‌ను ఇరకాటంలోకి నెట్టింది.

09/12/2016 - 00:35

మాడ్రిడ్, సెప్టెంబర్ 11: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో భాగంగా అలావెస్‌తో తలపడిన బార్సిలోనాకు చుక్కెదురైంది. లియోనెల్ మెస్సీ, లూయిస్ సౌరెజ్ వంటి మేటి ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన కోచ్ లూయిస్ ఎన్రిక్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. 1-2 తేడాతో బార్సిలోనా పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ 39వ నిమిషంలో బ్రుమ్ సిల్వ అకోస్టా ద్వారా అలావెస్‌కు తొలి గోల్ లభించింది.

09/12/2016 - 00:34

కరాచీ, సెప్టెంబర్ 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో వెస్టిండీస్‌తో జరిగే హోం సిరీస్‌లో ఆడే పాకిస్తాన్ జట్టుకు మాజీ కెప్టెన్ వసీం బారీని మేనేజర్‌గా నియమించారు. ప్రస్తుత మేనేజర్ ఇంతికాబ్ ఆలమ్ కాంట్రాక్టు ఈనెల 30వ తేదీతో ముగుస్తుందని, అందుకే, విండీస్‌తో జరిగే సిరీస్‌కు బారీని ఆ స్థానంలో నియమిస్తున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో తెలిపింది.

09/12/2016 - 00:33

లక్నో, సెప్టెంబర్ 11: క్రికెటర్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా తన జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఉత్తర ప్రదేశ్ మఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలుసుకొని, చర్చించిన తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు అతను తెలిపాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు అతను నేరుగా సమాధానం చెప్పలేదు.

Pages