S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/17/2016 - 00:54

జెంషెడ్పూర్, అక్టోబర్ 16: హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ని హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేయగా, హర్యానా 331 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 140 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన హర్యానా రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ను 225 పరుగులకే అలౌట్ చేసింది.

10/17/2016 - 00:53

దుబాయ్, అక్టోబర్ 16: వెస్టిండీస్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ 222 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈ జట్టు అజర్ అలీ సూపర్ ట్రిపుల్ సెంచరీతో రాణించడంతో మూడు వికెట్లకు 579 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.

10/17/2016 - 00:52

తైపీ సిటీ, అక్టోబర్ 16: చైనీస్ తైపీ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ సింగిల్స్ టైటిల్‌ను భారత ఆటగాడు సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను మలేసియాకు చెందిన డారెన్ లియూపై మొదటి రెండు సెట్లను 12-10, 12-10 తేడాతో గెల్చుకొని, మూడో సెట్‌లో 3-3 పాయింట్లతో సమవుజ్జీగా నిలిచాడు. ఆ సమయంలో కండరాలు బెణకడంతో లియూ మ్యాచ్ నుంచి వైదొలగ్గా, సౌరభ్‌కు టైటల్ లభించింది.

10/17/2016 - 00:51

అహ్మదాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ కప్ కబడ్డీలో ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో థాయలాండ్ 62-22 తేడాతో అమెరికాపై ఘన విజయాన్ని నమోదు చేసింది. థాయ్ విజృంభణకు అమెరికా నుంచి ఏ దశలో సరైన రీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు.

10/17/2016 - 02:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: చాలాకాలంగా నలుగుతూ వస్తున్న క్రికెట్ సంస్కరణలకు సోమవారం తెరపడుతుందా లేక మరోసారి వాయిదా పడి, అనిశ్చితి కొనసాగుతుందా అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి.

10/16/2016 - 07:04

ధర్మశాల, అక్టోబర్ 15: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటికే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన భారత్ ఇప్పుడు వనే్డల్లో మెరుగైన స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఎంచుకుంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

10/16/2016 - 07:01

ముంబయ, అక్టోబర్ 15: లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేస్తే, దేశ క్రికెట్ రంగాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలుతున్న తన ఉనికి లే కుండా పోతుందన్న భయంతో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మొండి వైఖరిని కొనసాగిస్తున్నది.

10/16/2016 - 07:01

1. ఆస్ట్రేలియా (118 పాయింట్లు), 2. దక్షిణాఫ్రికా (116 పాయింట్లు), 3. న్యూజిలాండ్ (113 పాయింట్లు), 4. భారత్ (110 పాయింట్లు), 5. ఇంగ్లాండ్ (107 పాయింట్లు), 6. శ్రీలంక (101 పాయింట్లు), 7. బంగ్లాదేశ్ (95 పాయింట్లు), 8. పాకిస్తాన్ (89 పాయింట్లు), 9. వెస్టిండీస్ (88 పాయింట్లు), 10. ఆఫ్గనిస్థాన్ (52 పాయింట్లు).
బ్యాటింగ్‌లో ‘టాప్-10’

10/16/2016 - 07:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్ ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్ (డబ్ల్యుడబ్ల్యుఇ)పై ఆసక్తి చూపుతున్నట్టు వస్తున్న వాదనకు బలం చేకూరుతున్నది. ఆర్లాండో (్ఫ్లరిడా) నుంచి వచ్చిన డబ్ల్యుడబ్ల్యుఇ చీఫ్ కాన్యన్ సీమన్‌ను సుశీల్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

10/16/2016 - 06:59

అహ్మదాబాద్, అక్టోబర్ 15: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలపడిన భారత్ సునా యాసంగా గెలిచింది. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ రంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన భారత ఆటగాళ్లు పాయంట్లు కొల్ల గొట్టారు. ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 36-13 తేడాతో పటి ష్టమైన స్థితికి చేరింది. ద్వితీయార్ధంలోనూ అదే ఒరవడిని కొనసాగించి, మ్యాచ్‌ని 74-20 గా ముగించింది.

Pages