S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/16/2016 - 06:59

మార్గోవా, అక్టోబర్ 15: ఐదు దేశాలు పోటీపడిన బ్రిక్స్ అండర్-17 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను బ్రెజిల్ గెల్చుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 5-1 తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని నమోదు చేసింది. బ్రెజిల్ విజృంభణకు అడ్డుకట్ట వేయలేకపోయిన దక్షిణాఫ్రికా దారుణ పరాజయాన్ని చవిచూసింది. కాగా, మూడో స్థానానికి జరిగిన మ్యాచ్‌లో చైనాను రష్యా ఓడించింది.

10/16/2016 - 06:58

జ్యూరిచ్, అక్టోబర్ 15: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌ను సాధ్యమైనన్ని ఎక్కువ జట్లతో నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేశాడు. అతను చేసిన సూచనలపై చర్చించిన ఫిఫా సర్వసభ్య సమావేశం తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది. వచ్చే జనవరిలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది.

10/15/2016 - 07:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసే విషయమై సుప్రీం కోర్టులో బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సమర్పించబోయే అఫిడవిట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బోర్డు న్యాయ నిపుణుల బృందం అఫిడవిట్‌ను సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. కాగా, శనివారం ఇక్కడ జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో ఈ అఫిడవిట్‌పై చర్చ జరగనుంది.

10/15/2016 - 07:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఇన్నాళ్లూ కాదంటూ వచ్చిన అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టం (డిఆర్‌ఎస్)ను కొన్ని మార్పులుచేర్పులతో అంగీకరించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

10/15/2016 - 07:14

దుబాయ్, అక్టోబర్ 14: పాకిస్తాన్ ఓపెనర్ అజర్ అలీ డే/నైట్ టెస్టు క్రికెట్ చరిత్రలో శతకాన్ని నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి అతను 146 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 140 సంవత్సరాల టెస్టు క్రికెట్‌లో ఇది కేవలం రెండో డే/నైట్ టెస్టు కావడం విశేషం. అతని విజృంభణ రెండో రోజు ఆటలోనూ కొనసాగింది.

10/15/2016 - 07:14

కరాచీ, అక్టోబర్ 14: పాకిస్తాన్ మహిళా సాకర్ జట్టు స్ట్రయికర్ షహిలా అహ్మద్‌జయ్ బలూచ్ ఇక్కడ జరిగిన ఒక కారు ప్రమాదంలో మృతి చెందింది. 2014 శాఫ్ చాంపియన్‌షిప్స్‌లో పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఆడిన ఆమె తన దేశం తరఫున విదేశాల్లో హ్యాట్రిక్ సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 21 సంవత్సరాల వయసులో ఉత్తమ స్ట్రయికర్‌గా పేరు సంపాదించింది. ఇటీవలే ఆమెకు ఫదీయన్ బలూచ్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది.

10/15/2016 - 07:13

ముంబయి, అక్టోబర్ 14: మహారాష్ట్ర కెప్టెన్ స్వాప్నిల్ గుగాలే, సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్ అంకిత్ బవానే సుమారు 70 ఏళ్లనాటి రంజీ ట్రోఫీ రికార్డును తిరగరాశారు. అజేయంగా 594 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రంజీ ట్రోఫీ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం. 1947-48 సీజన్‌లో బరోడా తరఫున ఆడిన విజయ్ హజారే, గులామ్ మహమ్మద్ 577 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

10/14/2016 - 00:45

కేప్ టౌన్, అక్టోబర్ 13: దక్షిణాఫ్రికాలో ప్రపంచ వనే్డ చాంపియన్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. చివరిదైన ఐదో వనే్డను 31 పరుగుల తేడాతో కోల్పోయిన ఈ జట్టుపై దక్షిణాఫ్రికా 5-0 తేడాతో క్లీన్‌స్వీప్ సాధించింది. డేవిడ్ వార్నర్ అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ, అతని శ్రమ వృథా అయింది. ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ తప్పలేదు.

10/14/2016 - 00:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: వైరల్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా న్యూజిలాండ్‌తో ఈనెల 16న ధర్మశాలలో జరిగే తొలి వనే్డ ఇంటర్నేషనల్‌లో ఆడే అవకాశాన్ని భారత బ్యాట్స్‌మన్ సురేష్ రైనా కోల్పోయాడు. అతను పూర్తిగా కోలుకోలేదని, కాబట్టి మొదటి మ్యాచ్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చామని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోడం లేదని తెలిపింది.

10/14/2016 - 00:47

ధర్మశాల, అక్టోబర్ 13: ఐదు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా ఈనెల 16న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు గురువారం ఇక్కడికి చేరుకున్నాయి. ఇరు జట్ల క్రికెట్లను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఫొటోలు తీసుకొని సంబరపడ్డారు. భారీ భద్రత కారణంగా క్రికెటర్లతో ఫొటోలు తీయించుకునే అవకాశం ఎవరికీ దక్కలేదు.

Pages