S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/09/2016 - 07:19

ప్రోవిడెన్స్ (గుయానా), జూన్ 8: ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాను ఢీకొన్న దక్షిణాఫ్రికా సమష్టి కృషి ఫలితంగా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తరఫున ఆరోన్ ఫించ్ (72) ఒక్కడే ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు.

06/09/2016 - 07:19

మాంట్రెయుల్ (ఫ్రాన్స్), జూన్ 8: ఫ్రెంచ్ స్ప్రింటర్ జిమీ వికాల్ట్ 100 మీటర్ల పరుగును రికార్డు సమయంలో పూర్తి చేశాడు. ఇక్కడ జరిగిన మాంట్రెయిల్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొన్న అతను లక్ష్యాన్ని 9.86 సెకన్లలో పూర్తి చేసి, ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన టైమింగ్స్‌ను నమోదు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ స్ప్రింట్‌లో ఇదే రికార్డు కావడం విశేషం.

06/09/2016 - 07:18

లండన్, జూన్ 8: చారిత్రక లార్డ్స్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టులో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకపై వైట్‌వాష్ సాధించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది. నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, ఆ సిరీస్ చివరి మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

06/09/2016 - 07:18

సిడ్నీ, జనవరి 8: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్ చేరింది. అయితే, మరో హైదరాబాదీ పివి సింధు మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ శుభారంభం చేయగా, గురుసాయిదత్ పోరు మొదటి రౌండ్‌కే పరిమితమైంది.

06/09/2016 - 07:17

ముంబయి, జూన్ 8: భారత క్రికెట్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో బుధవారం జింబాబ్వే టూర్‌కు బయలుదేరి వెళ్లింది. 2017లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌పై దృష్టి కేంద్రీకరించిన ధోనీ అప్పటి వరకూ వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో భారత్‌కు కెప్టెన్‌గా కొనసాగాలని ఆశిస్తున్నాడు.

06/08/2016 - 17:06

ముంబయి : మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు బుధవారం బయల్దేరి వెళ్లింది. ఈ నెల 11న ప్రారంభం కానున్న సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరుగుతాయి. జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ధోనీ సేన ఆడనుంది.

06/08/2016 - 07:33

న్యూఢిల్లీ, జూన్ 7: మన దేశం తరఫున రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టింటు లూకా (27) చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో జరిగిన జోసెఫ్ ఓడ్లోజిల్ మెమోరియల్ అథ్లెటిక్ మీట్‌లో మహిళల 800 మీటర్ల రేసును 2:00.61 నిమిషాల్లో పూర్తిచేసి ఈ సీజన్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేయడంతో పాటు రజత పతకాన్ని దక్కించుకుంది.

06/08/2016 - 07:29

ముంబయి, జూన్ 7: జింబాబ్వేలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో పలువురు యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు నాయకత్వం వహించనున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆ సవాలును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు.

06/08/2016 - 07:28

ముంబయి, జూన్ 7: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు సారథిగా తన భవితవ్యంపై వస్తున్న ఊహాగానాలను ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ తోసిపుచ్చాడు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డేనని అతను మరోసారి స్పష్టం చేశాడు. ‘నేను ఆటను ఆస్వాదించడం లేదనడం సరికాదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు నేను నాయకత్వం వహించాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించాల్సింది నేను కాదు.

06/08/2016 - 07:28

న్యూఢిల్లీ, జూన్ 7: వియత్నాంలోని హోచిమిన్ సిటీలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ మొత్తం 17 పతకాలతో తన పోరాటాన్ని ముగించింది. వీటిలో ఏడు పసిడి పతకాలతో పాటు నాలుగు రజత పతకాలు, మరో ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. జపాన్ 14 స్వర్ణ పతకాలతో ఈ పోటీల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, 11 పసిడి పతకాలతో చైనా రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో భారత్‌కు మూడో స్థానం లభించింది.

Pages