S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/13/2016 - 05:31

దుబాయ్, అక్టోబర్ 12: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన చివరి, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టిన అతను మొత్తం 900 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. 2015 సంవత్సరాన్ని అతను ఇదే ర్యాంక్‌తో ముగించాడు.

10/13/2016 - 05:29

దుబాయ్, అక్టోబర్ 12: స్పిన్ బౌలింగ్‌ను ప్రధాన అస్త్రంగా మార్చుకున్న పాకిస్తాన్ గురువారం నుంచి వెస్టిండీస్‌తో ఇక్కడ ఆరంభం కానున్న మొదటి డే/నైట్ టెస్టుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా హోం సిరీస్‌లు ఆడుతున్న పాకిస్తాన్ ఇప్పటికే వెస్టిండీస్‌ను టి-20, వనే్డ సిరీస్‌ల్లో చిత్తచేసింది.

10/13/2016 - 05:28

పారిస్, అక్టోబర్ 12: ప్రపంచ కప్ సాకర్ క్వాలిఫయర్స్‌లో కష్టాలకు ఎదురీదుతున్న ఇంగ్లాండ్ కీలక విజయాన్ని సాధించడంలో మరోసారి విఫలమైంది. స్లొవేకియాతో జరిగిన మ్యాచ్‌ని గెల్చుకునే పరిస్థితి ఉన్నప్పటికీ, అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. స్లొవేకియా రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, ఎదురుదాడికి దిగాల్సిన ఇంగ్లాండ్ తన స్థాయికి తగినట్టు రాణించలేకపోయింది.

10/13/2016 - 05:27

అహ్మదాబాద్, అక్టోబర్ 12: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని జపాన్ 11 పాయింట్ల తేడాతో గెల్చుకు న్న జపాన్ సెమీస్‌కు అర్హత సంపాదించింది ఈ జట్టు 33 పాయింట్లు సాధించగా, పోలాండ్ 22 పాయింట్లు చేసింది. జపాన్ కెప్టెన్ మసయుకీ షిమోకవా ఏడు, కజుహిరో తకానో ఎనిమిది చొప్పున పాయింట్లు చేసి, తమ జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు.

10/13/2016 - 05:26

హైదరాబాద్, అక్టోబర్ 12: రియో ఒలింపిక్స్ మహిళల జిమ్నాస్టిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన దీపా కర్మాకర్‌కు భారీగానే బహుమతులు లభించాయి. వాటిలో హైదరాబాద్ జిల్లా బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బహూకరించిన అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యు కారు కూడా ఉంది.

10/11/2016 - 00:27

ఢాకా, అక్టోబర్ 10: ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న వనే్డ సిరీస్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఒక భారతీయుడిని ఢాకా పోలీసు అధికారులు అరెస్టు చేశారు. అతనిని భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.

10/11/2016 - 00:25

టెస్టు క్రికెట్ కెరీర్‌లో తక్కువ మ్యాచ్‌ల్లోనే 20 పర్యాయాలు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. తన 39వ టెస్టు ఆడుతున్న అతను న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు వికెట్లు సాధించడం అశ్విన్‌కు ఇది 20వ సారి.

10/11/2016 - 00:23

అహ్మదాబాద్, అక్టోబర్ 10: ప్రపంచ కప్ కబడ్డీ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో ఢీకొన్న ఈ జట్టు 69-25 తేడాతో గెలిచింది. తొపే అదెవలూర్ అత్యధి కంగా 22 పాయంట్లు సాధించాడు. కేశవ్ గుప్తే 14 పాయంట్లు చేశాడు. ఆస్ట్రేలియా తరపున థామస్ షార్ప్ అత్యధికంగా 8 పాయంట్లు చేశాడు.

10/11/2016 - 00:23

ఇండోర్: సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకున్న ఓపెనర్ గౌతం గంభీర్‌ను దురదృష్టం వెంటాడుతున్నది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను 53 బంతులు ఎదుర్కొని, 23 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అదే బౌలర్ వేసిన ఓవర్‌లో గాయం తిరగబెట్టడంతో మైదానం విడిచి వెళ్లాడు.

10/11/2016 - 00:22

పారిస్, అక్టోబర్ 10: వరల్డ్ కప్ సాకర్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మెసడోనియాపై ఇటలీ 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సిరో ఇమోబైల్ కీలక గోల్ చేసి, ఆ జట్టును గెలిపించాడు. మ్యాచ్ 24వ నిమిషంలో ఆండ్రియా బెలోటీ చేసిన గోల్‌తో ఇటలీ గోల్స్ ఖాతాను తెరవగా, 57వ నిమిషంలోలిజా నెస్టొరొవ్‌స్కీ మెసడోనియాకు ఈక్వెలైజర్‌ను అందించాడు. మరో రెండు నిమిషాల్లోనే ఫెరాన్ హసానీ గోల్ చేయడంతో మెసడోనియా ఆధిక్యం 2-1కు చేరింది.

Pages