S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/03/2016 - 06:18

పారిస్, జూన్ 2: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అతను థామస్ బెర్డిచ్‌ని 6-3, 7-5, 6-3 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరాడు. 11 పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలంకాగా, అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఈ ట్రోఫీని అందుకోవడానికి జొకోవిచ్ మరోసారి రంగంలోకి దిగాడు.

06/03/2016 - 06:16

పారిస్: ఇవాన్ డోడింగ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత స్టార్ సానియా మీర్జా ముందంజ వేసింది. వీరు క్వార్టర్ ఫైనల్‌లో చాన్ యుంగ్ జన్, మాక్స్ మిర్నియ్ జోడీని 6-1, 3-6, 10-6 తేడాతో ఓడించారు. కాగా, వేరువేరు భాగస్వాములతో కలిసి ఆడుతున్న లియాండర్ పేస్, రోహన్ బొపన్న పరాజయాలను చవిచూశారు.

06/03/2016 - 06:14

జకార్తా, జూన్ 2: ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. స్థానిక క్రీడాకారిణి ఫిత్రియానిని ఆమె 21-11, 21-10 తేడాతో చిత్తుచేసి, నాలుగోసారి ఈ టైటిల్‌ను అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. 2009, 2010, 2012 సంవత్సరాల్లో ఆమెకు ఇండోనేషియా ఓపెన్ టైటిల్ లభించింది.

06/03/2016 - 06:13

హైదరాబాద్, జూన్ 2: క్యూ స్పోర్ట్స్ పట్ల ఆదరణ పెరుగుతున్నదని, ఇది శుభ పరిణామమని ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ అన్నాడు. వివిధ అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం కోసం మాదాపూర్‌లోని బాల్క్‌లైన్ క్యూ స్పోర్ట్స్ అకాడెమీలో గురువారం ప్రారంభమైన ట్రయల్స్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని అన్నాడు.

06/03/2016 - 06:12

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 2: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) సెంట్రల్ జోన్ కార్యదర్శి కె. రమేష్ జింబాబ్వే పర్యటనకు వెళ్లే టీమిండియాకు మేనేజర్‌గా నియమితులయ్యారు. భారత జట్టు జింబాబ్వేలో ఈ నెల 11 నుండి మూడు వనే్డలు, మూడు టి 20 మ్యాచ్‌లు ఆడనుంది.

06/03/2016 - 06:10

లండన్, జూన్ 2: టెస్టు క్రికెట్‌ను బతికించుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ అభిప్రాయపడ్డాడు. ఇందుకుగాను పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని, వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

06/03/2016 - 06:08

ముంబయి, జూన్ 2: ప్రొ కబడ్డీ ఎథిక్స్, గవర్నెస్ కమిటీ ఖరారైంది. నాలుగో సీజన్‌కు గాను ఈ కమిటీలో ఢిల్లీ, మద్రాసు హైకోర్టులకు న్యాయమూర్తిగా సేవలు అందించి రిటైరైన ఎపి షా, మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎఎన్ రాయ్ సభ్యులుగా ఉంటారు. కమిటీలో దీపక్ జాకబ్, చారు శర్మ, ప్రొ కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామిలకు కూడా ఈ కమిటీలో స్థానం లభించింది.

06/02/2016 - 08:39

న్యూఢిల్లీ, జూన్ 1: ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న 33 ఏళ్ల భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇటీవల ఖజకస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 51 కిలోల విభాగంలో కోమ్ పోటీపడింది. అంతకు ముందు క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌లో విఫలమైన ఆమె చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

06/02/2016 - 08:38

లాసనే్న, జూన్ 1: రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో ప్రొఫెషనల్ బాక్సర్లు అడుగుపెట్టనున్నారు. ఇప్పటి వరకూ అమెచ్యూర్స్ లేదా ఔత్సాహికులకు మాత్రమే అవకాశం ఉన్న ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ప్రొఫెషన్లు పోటీపడడానికి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

06/02/2016 - 08:37

పారిస్, జూన్ 1: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. వర్షం కారణంగా పలుమార్లు వాయిదా పడిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఆమె 18వ సీడ్ ఎలినా స్విటోలినాను 6-1, 6-1 తేడాతో చిత్తుచేసి, కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించే దిశగా మరో అడుగు ముందుకేసింది.

Pages