S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/07/2016 - 04:32

ఢాకా, అక్టోబర్ 6: బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం జరిగే మొదటి వనే్డకు ఆతిథ్యమిచ్చే షేన్ ఏ బంగ్లా స్టేడియంలో హఠాత్తుగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. హెలికాప్టర్ నుంచి తాళ్ల సాయంతో సుమారు డజను మంది కమాండోలు నేరుగా మైదానంలోకి దిగారు. తుపాకులు పట్టుకొని స్టాండ్స్ వైపు దూసుకెళ్లారు. అవసరమైతే కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు పొజిషన్స్ తీసుకున్నారు.

10/06/2016 - 05:09

లండన్, అక్టోబర్ 5: బ్రిటన్‌కు చెందిన బాక్సర్ టైసన్ ఫ్యూరీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో తెరపైకి వచ్చాడు. ఎప్పుడూ ఏదో ఒక రకమైన వివాదంలో చిక్కుకునే అతను ఈసారి మాదక ద్రవ్యాలను వాడినట్టు అంగీకరించడం విశేషం. తాను కొకైన్‌ను వాడానని స్పష్టం చేసిన అతను అందులో తప్పేమీ లేదని తనను తాను సమర్ధించుకున్నాడు. ‘చాలా పెద్ద మొత్తంలో కొకైన్‌ను వాడాను. ఇది నిజం. అయితే, అందులో తప్పేముంది? ఇది నా జీవితం.. నా ఇష్టం..

10/06/2016 - 05:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) దారిలోకి వస్తుందా? లేక ముందుగానే హెచ్చరించిన విధంగానే సుప్రీం కోర్టు కఠిన నిర్ణయాలను తీసుకొని దారికి తీసుకురావాల్సి ఉంటుందా? ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్నలివి. లోధా కమిటీ నివేదికలోని మొదటి విడత సిఫార్సుల అమలుకు సుప్రీం కోర్టు విధించిన గడువు గురువారంతో పూర్తవుతుంది.

10/06/2016 - 05:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత పర్వతారోహకుడు అర్జున్ వాజ్‌పాయ్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరాల్లో ఆరోదైన చో యూను అధిరోహించిన ఘనతను తన ఖాతాలో వేకున్నాడు. ప్రపంచంలో 8,000 మీటర్ల కంటే ఎత్తయిన 14 శిఖరాల్లో ఐదింటిని 23 ఏళ్ల అర్జున్ ఇప్పటి వరకూ అధిరోహించాడు.

10/06/2016 - 05:06

మాస్కో, అక్టోబర్ 5: తాల్ స్మారక చెస్ టోర్న మెంట్ ఏడో రౌండ్‌లో పీటర్ స్విట్లర్‌తో తలపడిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఇప్పటి వరకూ క్లాసిక్ చెస్‌లో ఎన్నడూ ఆనంద్‌పై గెలవలేకపోయన స్విడ్లర్ ఈ గేమ్‌లో డిఫెన్స్ ఎత్తుగడను అనుసరించాడు. పావు లను వేగంగా కదిలించడంగానీ, ముందుకు దూ కించడంగానీ చేయకుండా, మొదటి నుంచి డ్రానే లక్ష్యంగా గేమ్‌ను కొనసాగించాడు.

10/06/2016 - 05:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రియో ఒలింపిక్స్‌లో భారత షూటర్ల వైఫల్యాలపై నివేదిక పూర్తయింది. ఏస్ షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వంలోని కమిటీ అఖిల భారత షూటింగ్ సంఘం (ఎన్‌ఆర్‌ఎఐ)కి నివేదిక సమర్పించింది. అందులో సంఘం తీరును కమిటీ దుయ్యబట్టడం విశేషం. గత కొంతకాలంగా షూటింగ్‌లో ప్రమాణాలను పెంచడానికి ఎన్‌ఆర్‌ఎఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది.

10/06/2016 - 05:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారీ మార్పులుగానీ, ప్రయోజాలుగానీ లేకుండానే న్యూజిలాండ్‌తో జరిగే వనే్డ సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్‌గా తొలిసారి సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నాడు. గతంలో అతను సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు చీఫ్‌గా కొత్త బాధ్యతలను స్వీకరించాడు.

10/06/2016 - 05:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశవాళీ లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకునేది లేదని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) అధికారులకు ముకుల్ ముద్గల్ స్పష్టం చేశాడు. అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిడిసిఎ పాలనా వ్యవహారాలు సక్రమంగా సాగేలా చూడడానికి పరిశీలకుడిగా ముద్గల్‌ను ఢిల్లీ హైకోర్టు నియమించింది.

10/05/2016 - 07:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: డబ్బులు లేకపోతే ఆటను నిర్వహించలేమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మంగళవారం నిర్ద్వంద్వంగా స్పష్టం చేశాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న టెస్టు సిరీస్ భవితవ్యం ఏమిటన్నదీ చెప్పేందుకు ఆయన నిరాకరించాడు.

10/05/2016 - 07:24

లాసానే్న, అక్టోబర్ 4: నిషేధిత ఉత్ప్రేరకాలను వాడిందన్న ఆరోపణలపై రెండేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ తార మరియా షరపోవాకు ఆర్బిట్రేషన్ కోర్టులో ఊరట లభించింది. ఈ నిషేధాన్ని లాసానే్నలోని క్రీడలకు సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయస్థానం 15 నెలలకు తగ్గించింది. దీంతో షరపోవా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరిగి గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్‌లోకి రావడానికి వీలు కలుగుతుంది.

Pages