S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/27/2016 - 03:16

న్యూఢిల్లీ, మే 26: ఈసారి ఐపిఎల్‌లో తొలిసారి అడుగుపెట్టిన జట్టు గుజరాత్ లయన్స్. ప్లే ఆఫ్ దశకు చేరుతుందని ఎవరూ ఊహించని జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ చేరాయి. పాయింట్ల పట్టికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానాన్ని ఆక్రమిస్తే, గుజరాత్ రెండో స్థానంలో ఉంది.

05/27/2016 - 03:14

సిడ్నీ, మే 26: ఆస్ట్రేలియా జాతీయ జట్టు కోచ్ పదవి కోసం తాను తొందరపడడం లేదని, ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా తనకు లేదని జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు కూడా తలపడే ముక్కోణపు వనే్డ సిరీస్‌కు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. రెగ్యులర్ కోచ్ డారెన్ లీమన్ విశ్రాంతి తీసుకోవడంతో, అతని స్థానంలో జట్టుకు లాంగర్ కోచ్‌గా వ్యవహరిస్తాడు.

05/27/2016 - 03:13

మాస్కో, మే 26: నిషిద్ధ మాదక ద్రవ్యమైన మెల్డోనియంను వినియోగించి డోపింగ్ పరీక్షలో పట్టుబడిన టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాకు ఒలింపిక్స్‌లో పాల్గొనే రష్యా బృందంలో చోటు లభించింది. ఉత్ప్రేరకాన్ని వాడినట్టు స్వయంగా అంగీకరించిన షరపోవాపై అంతర్జాతీయ మహిళా టెన్నిస్ సమాఖ్య (డబ్ల్యుటిఎ) నాలుగేళ్ల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.

05/27/2016 - 03:12

పారిస్, మే 26: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరాడు. గ్రాండ్ శ్లామ్స్‌లో మిగతా మూడు టోర్నీలు, ఆస్ట్రేలియా, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లను కైవసం చేసుకున్న జొకోవిచ్‌ను ఫ్రెంచ్ ఓపెన్ చాలాకాలంగా ఊరిస్తునే ఉంది. 11 పర్యాయాలు విఫలమైన అతను 12వ సారి టైటిల్‌ను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

05/26/2016 - 07:09

న్యూఢిల్లీ, మే 25: ఎలాంటి అంచనాలు లేకుండా ఈసారి ఐపిఎల్‌లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి, రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ లయన్స్‌తో పోరును ఖరారు చేసుకుంది.

05/26/2016 - 07:07

పారిస్, మే 25: ఆరో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆమె జరినా దియాస్‌ను 7-6, 6-2 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌లో గట్టిపోటీనిచ్చిన దియాస్ రెండో రౌండ్‌లో దారుణంగా విఫలమై, ఓటమిపాలైంది.

05/26/2016 - 07:06

మెక్సికో సిటీ, మే 25: తనపై వేసిన సస్పెన్షన్ వేటును రద్దు చేయాలని కోరుతూ యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం (యుఫా) అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీ వేసిన కేసును కొట్టివేస్తూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) తీసుకున్న నిర్ణయం తమకు నిర్ణయం శిరోధార్యమని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో స్పష్టం చేశాడు.

05/26/2016 - 07:05

కరాచీ, మే 25: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో పాకిస్తాన్ క్రికెటర్లకు కూడా అవకాశం కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జహీర్ అబ్బాస్ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సూచించాడు. ఈ విధంగా చేస్తే టోర్నీ ప్రాధాన్యం, ప్రమాణాలు మరింతగా పెరుగుతాయని వ్యాఖ్యానించాడు.

05/26/2016 - 07:05

లండన్, మే 25: భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జరిపిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈనెల 15న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు నెహ్రా మోకాలికి తీవ్ర గాయమైంది. మందులతో తగ్గే అవకాశం లేకపోవడంతో అతనికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తేల్చిచెప్పారు.

05/25/2016 - 06:36

బెంగళూరు, మే 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించాలన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో అడుగు దూరంలో నిలిచింది. బెంగళూరులోని సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Pages