S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/02/2016 - 03:48

కోల్‌కతా, అక్టోబర్ 1: టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా ఫ్లూ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతను కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండవ రోజైన శుక్రవారం మైదానంలోకి దిగలేదు. అయితే పుజారా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఏమీ లేదని, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో అతను యథావిధిగా మూడో స్థానంలోనే బరిలోకి దిగుతాడని జట్టు వర్గాలు తెలిపాయి.

10/02/2016 - 03:48

న్యూఢిల్లీ/లుధియానా/లాహోర్, అక్టోబర్ 1: జమ్మూ-కాశ్మీరులోని ఉరీలో ఉగ్రవాద దాడులను ప్రోత్సహించి 19 మంది భారత జవాన్ల ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్‌పై భారత క్రీడా సంఘాలు ముప్పేట దాడిని ప్రారంభించాయి.

10/01/2016 - 07:29

కోల్‌కతా, సెప్టెంబర్ 30: న్యూజిలాండ్‌తో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శుక్రవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియాను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు అత్యంత కీలకమైన 141 పరుగులు జోడించారు. వీరిద్దరు అర్ధ శతకాలను నమోదు చేయగా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 86 ఓవర్లలో ఏడు వికెట్లకు 239 పరుగులు చేసింది.

10/01/2016 - 07:28

సియోల్, సెప్టెంబర్ 30: కొరియా ఓపెన్ బాడ్మింటన్‌లో భారత్ పోరు ముగిసింది. మిగతా వారంతా మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించగా, క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరిన అజయ్ జయరామ్ కూడా ఓటమిపాలు కావడంతో ఈ టోర్నీలో భారత్ ప్రస్థానానికి తెరపడింది. క్వార్టర్స్‌లో కొరియాకు చెందిన లీ హ్యున్ చేతిలో 23-25, 13-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. హ్యున్ చేతిలో అతను ఓడడం ఇది రెండోసారి.
‘టాప్-10’లో శ్రీకాంత్

10/01/2016 - 07:26

ముంబయి, సెప్టెంబర్ 30: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) వాయిదా పడింది. లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న బిసిసిఐపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించడంతో బిసిసిఐ ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది.

10/01/2016 - 07:26

కోల్‌కతా, సెప్టెంబర్ 30: ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్‌కు కొత్తకొత్త దుస్తులు కొనడం చాలా ఇష్టం. బాగా ఆడిన ప్రతిసారీ అతను బట్టల దుకాణాలకు వెళ్లి షాపింగ్‌లో నిమగ్నమయ్యేవాడు. ‘పరుగులు సాధించి.. కొత్తకొత్త దుస్తులు కొను..’ అన్న సూత్రాన్ని అతను అనుసరించాడు. ఈ వివరాలను భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

10/01/2016 - 07:25

కోల్‌కతా, సెప్టెంబర్ 30: తన కెరీర్‌లో చిరస్మణీయంగా గుర్తుంచుకునే మ్యాచ్‌లు చాలానే ఉన్నాయని, అయితే, 2002లో ఇంగ్లాండ్‌తో హెడింగ్లేలో జరిగిన టెస్టును అన్నిటి కంటే ముందుగా ప్రస్తావించాల్సి ఉంటుందని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు.

10/01/2016 - 07:24

కోల్‌కతా, సెప్టెంబర్ 30: ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్‌లను గంట కొట్టి ఆరంభిస్తారు. స్వదేశంలో భారత్ 250వ టెస్టు ఆడుతున్నందున, కోల్‌కతా మ్యాచ్‌లో అదే విధానాన్ని అనుసరించారు. భారత్‌కు మొట్టమొదటిసారి వనే్డ ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించిపెట్టిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు ఈ అవకాశం దక్కింది.

10/01/2016 - 07:24

కోల్‌కతా, సెప్టెంబర్ 30: తనతో కలిసి క్రికెట్ ఆడిన వారిలో క్రమశిక్షణ ఏమాత్రం లేని ఆటగాళ్ల పేర్లను చెప్పమంటే, ముందుగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు, అజయ్ జడేజా పేర్లే ఉంటాయని మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. చివరి క్షణాల్లో బట్టలు సర్దుకొని వచ్చేవారని, అందుకే ఒక్కో జతను చాలాసార్లు వేసుకునేవారని చెప్పాడు.

09/30/2016 - 05:42

ముంబయి, సెప్టెంబర్ 29: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించడంతో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసి) దారికొచ్చినట్టు కనిపిస్తున్నది. శుక్రవారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)ను నిర్వహించనుంది. ఈ సమావేశంలో లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయాలని తీర్మానించే అవకాశం ఉంది.

Pages