S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/28/2016 - 00:03

దుబాయ్, సెప్టెంబర్ 27: న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌ని భారత్ గెల్చుకుంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్కించుకోవడంతోపాటు పాకిస్తాన్‌ను చిత్తుచేస్తుంది. టెస్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది.

09/28/2016 - 00:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ జాతీయ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా కొనసాగి, పదవి నుంచి తప్పుకొన్న తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనైతికమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తాడు. సచిన్ తెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులపై పాటిల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అతను మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ విమర్శించాడు.

09/28/2016 - 00:00

పనాజీ, సెప్టెంబర్ 27: ప్రపంచ సాకర్‌ను శాసిస్తున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)కు ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా ఖాయం చేసిన అజెండాకు వ్యతిరేకంగా ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (ఎఎఫ్‌సి) తీర్మానాన్ని ఆమోదించడంతో, గతంలో ఎన్నడూ లేని రీతిలో ఫిఫా ఆత్మరక్షణలో పడింది. ఫిఫాలో ఆసియా నుంచి ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉండింది.

09/27/2016 - 23:59

కోల్‌కతా, సెప్టెంబర్ 27: జాతీయ జట్టులో స్థానంపై దాదాపుగా ఆశలు కోల్పోయిన గౌతం గంభీర్‌ను అదృష్టం వరించే అవకాశం కనిపిస్తున్నది. ఓపెనర్ లోకేష్ రాహుల్ కండరాల నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో, అతని స్థానంలో గంభీర్‌ను తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి భారత జట్టు మేనేజ్‌మెంట్ సూచించినట్టు సమాచారం. జట్టు మేనేజ్‌మెంట్ సూచనపై అతను ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యాడు.

09/27/2016 - 23:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) మహిళల టోర్నీలో భారత బ్యాట్స్‌విమన్ స్మృతి మంధాన పాల్గొననుంది. బిబిఎల్‌లో పోటీపడే బ్రిస్బేన్ హీట్స్‌తో ఆమె ఏడాది పాటు అమల్లో ఉండే ఒప్పందం కుదుర్చుకుంది.

09/27/2016 - 23:56

దుబాయ్, సెప్టెంబర్ 27: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడే విండీస్ జట్టుకు స్పిన్నర్ జోమెల్ వారికాన్ ఎంపికయ్యాడు. గత నెల భారత్‌తో జరిగిన మూడు, నాలుగు టెస్టుల్లో ఆడిన 14 మంది సభ్యులతో కూడిన జట్టులో వారికాన్‌కు స్థానం లభించింది. తన ప్రతిభతో సెలక్టర్లను ఆకట్టుకున్న వారికాన్‌కు మరోసారి అవకాశం దక్కింది.

09/27/2016 - 23:56

లాసనే్న, సెప్టెంబర్ 27: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి ఈ ఏడాదిలోగానే గుర్తింపునిస్తామని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) అధ్యక్షుడు డాక్టర్ చింగ్ కువో వూ స్పష్టం చేశాడు. ఇక్కడ అతను విలేఖరులతో మాట్లాడుతూ బిఎఫ్‌ఐ ఎన్నికలు నిబంధలను అనుసరించి జరిగాయని, ఎక్కడా అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోలేదని తమ తరఫున పరిశీలకుడిగా వెళ్లిన ఎడ్గర్ టన్నర్ తన నివేదికలో పేర్కొన్నట్టు చెప్పాడు.

09/27/2016 - 23:56

మాస్కో, సెప్టెంబర్ 27: తాల్ స్మారక చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న ఆనంద్ ఈ టోర్నీని అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన పోరుతో మొదలుపెట్టాడు. నల్లపావులతో ఆడిన అతను గిరి ఎత్తులకు ప్రతి అడుగులోనూ దీటైన సమాధానమిచ్చాడు.

09/27/2016 - 23:55

చండీగఢ్, సెప్టెంబర్ 27: దేశంలోని ప్రతి నగరానికీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (డబ్ల్యుడబ్ల్యుఇ) తరహా ఫైట్స్‌ను పరిచయం చేయడమే తన లక్ష్యమని ‘ది గ్రేట్’ ఖలీ అన్నాడు.

09/27/2016 - 01:51

కాన్పూర్, సెప్టెంబర్ 26: గ్రీన్ పార్క్ స్టేడియంలో తన 500వ టెస్టు మ్యాచ్‌ని ఆడిన భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌ను మొదటి టెస్టులో 197 పరుగుల భారీ తేడాతో చిత్తుచేయడం ద్వారా చారిత్రిక మ్యాచ్‌ని చిరస్మరణీయంగా మలచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

Pages