S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/27/2016 - 01:34

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: గులాబీ బంతులతో టెస్టు మ్యాచ్ ఈ హోం సిరీస్ సీజన్‌లో ఉండదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. ఈ వరుస హోం సిరీస్‌లలో భాగంగా భారత్ మొత్తం 13 టెస్టులు ఆడాల్సి ఉండగా, మొదటి టెస్టు న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో ముగిసింది.

09/27/2016 - 01:32

కాన్పూర్, సెప్టెంబర్ 26: న్యూజిలాండ్ స్పిన్నర్ మార్క్ క్రెగ్ భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. వీపు కండరాలు బెణకడంతో అతను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని కివీస్ జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను కంరాల నొప్పితో బాధపడ్డాడు.

09/27/2016 - 01:31

వాషింగ్టన్, సెప్టెంబర్ 26: బాక్సింగ్ అంటే మహమ్మద్ అలీ, సాకర్ అంటే పీలే మాదిరిగానే గోల్ఫ్ అంటే వెంటనే స్ఫురించే పేరు అర్నాల్డ్ పామెర్. ‘గోల్ఫ్ కింగ్’గా అందరికీ సుపరిచితుడైన ఈ లెజెండరీ ఆటగాడు మృతి చెందిన వార్త గోల్ఫ్ రంగాన్ని శోక సంద్రంలో ముంచేసింది. 87 ఏళ్ల పామెర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడని అతని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

09/27/2016 - 01:28

సియోల్, సెప్టెంబర్ 26: కొరియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆశలన్నీ కిడాంబి శ్రీకాంత్‌పైనే పెట్టుకుంది. మంగళవారం నాటి క్వాలిఫయర్స్‌తో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో శ్రీకాంత్ మరోసారి సత్తా చాటుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. రియో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత అతను గతవారం జపాన్ సూపర్ సిరీస్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్స్ చేరాడు.

09/26/2016 - 04:27

కాన్పూర్, సెప్టెంబర్ 25: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 200వ వికెట్ల మైలురాయిని చేరాడు. టీమిండియా ఆడుతున్న 500వ టెస్టులో అతను ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటలో అశ్విన్ విజృంభణకు భారత్‌కు లాభించింది. మ్యాచ్‌పై పట్టు సంపాదించేందుకు ఉపయోగపడింది.

09/26/2016 - 03:53

టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి. ఫైనల్‌లో ఆమె 7-5, 6-3 స్కోరుతో జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకాను ఓడించింది. 2015 ఫిబ్రవరి తర్వాత వొజ్నియాకి ఒక టైటిల్‌ను అందుకోవడం ఇదే మొదటిసారి

09/26/2016 - 03:50

కాన్పూర్, సెప్టెంబర్ 25: లోధా కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న కొన్ని సిఫార్సులు చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని అమలు చేయడం వల్ల ఇబ్బందులే తప్ప మేలు జరగదని భారత లెజెండరీ క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు.

09/26/2016 - 03:47

డా నాంగ్ (వియత్నాం), సెప్టెంబర్ 25: భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) అధ్యక్షుడు రామచందన్‌కు ఆసియా ఒలింపిక్ మండలి (ఒసిఎ) మెరిట్ అవార్డు లభించింది. ఆసియా ఖండంలో క్రీడాభివృద్ధికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇచ్చినట్టు ఒసిఎ అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ అహ్మద్ అల్ సబా అన్నాడు.

09/26/2016 - 03:45

ముంబయి, సెప్టెంబర్ 25: భారత బాక్సింగ్ రంగంలో సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. కొత్తగా ఏర్పాటు చేసిన భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి ఎన్నికలు జరగ్గా, అధ్యక్షుడిగా ప్రముఖ వ్యాపారవేత్త అభయ్ సింగ్ ఎన్నికయ్యాడు. అతనికి 49 ఓట్లురాగా, మరో అభ్యర్థి రోహిత్ జైనేంద్ర జైన్‌కు 15 ఓట్లు దక్కాయి.

09/26/2016 - 03:43

లండన్, సెప్టెంబర్ 25: మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు ఇంగ్లాండ్ సాకర్ జట్టు కెప్టెన్ వేన్ రూనీ తెల్ల ఏనుగులా మారాడు. అతనిని తుది జట్టులో కొనసాగించాలో, వద్దో తెలియక జట్టు కోచ్ జోస్ మోరిన్హో తల పట్టుకుంటున్నాడు. ప్రీమియర్ లీగ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా లీసెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌లో ధైర్యం చేసి రోనీని తప్పించాడు. ఆ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 4-1 తేడాతో గెలిచింది కాబట్టి సరిపోయింది.

Pages