S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/25/2016 - 01:35

కాన్పూర్, సెప్టెంబర్ 24: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు వెలవెలబోయిన భారత స్పిన్నర్లు మూడో రోజు ఆటలో చెలరేగిపోయారు. ఒక వికెట్‌కు 152 పరుగులు చేసి, పటిష్టమైన స్థితిలో ఉన్న కివీస్‌ను దెబ్బతీశారు. భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా 56 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

09/25/2016 - 01:31

కాన్పూర్, సెప్టెంబర్ 24: తమ జట్టులోనూ సమర్థులున్నారని, ప్రత్యేకించి స్పిన్ ట్రాక్‌పై రాణించ సత్తాగల వారితో జట్టు పటిష్టంగా ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్నాడు. కాన్పూర్ మైదానం స్పిన్‌కు అనుకూలంచే అవకాశాలు ఉన్నాయని అంటూ, తమ జట్టులో మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీలను సమర్థులైన స్పిన్నర్లుగా అభివర్ణించాడు. మిగతా రెండు రోజుల్లో వారు చక్కటి ప్రదర్శనతో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

09/25/2016 - 01:30

టోక్యో, సెప్టెంబర్ 24: పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బొరా స్ట్రికోవాతో కలిసి మహిళల డబుల్స్ ఆడుతున్న సానియా మీర్జా టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ జోడీ కేవలం 52 నిమిషాల్లోనే, 6-1, 6-1 తేడాతో చెన్ లియాంగ్, జావోజున్ యాంగ్ జోడీని చిత్తుచేసింది. ఇటీవలే సిన్సినాటి ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ జోడీ వరుసగా రెండో డబ్ల్యుటిఎ టైటిల్‌ను సాధించడం విశేషం.

09/25/2016 - 01:29

మాడ్రిడ్, సెప్టెంబర్ 24: బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్‌ను మరోసారి కష్టాలు చుట్టుముట్టాయి. పన్ను ఎగవేత కేసును స్పెయిన్ కోర్టు తిరగతోడడంతో నేమార్‌తోపాటు అతని తండ్రి కూడా విచారణను ఎదుర్కోనున్నాడు. సాంటోస్ నుంచి నేమార్‌ను బార్సిలోనా తీసుకుంది.

09/25/2016 - 01:27

కోల్‌కతా, సెప్టెంబర్ 24: భారత దేశంలో జరిగే 250వ చారిత్రక టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ముస్తాబవుతున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ భారత్‌కు 250వ హోం టెస్టు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరస్మరణీయంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తామని బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) ఒక ప్రకటనలో తెలిపింది.

09/25/2016 - 01:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: న్యూజిలాండ్‌తో జరగుతున్న మొదటి టెస్టు మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కీలకమవుతుందని, దాని ద్వారానే మిగతా టెస్టులో ఏ విధంగా ఆడబోతున్నామనే విషయం స్పష్టమవుతుందని భారత యువ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే అన్నాడు. తనకు దీర్ఘకాల లక్ష్యాలేవీ లేవని, సందర్భాన్ని అనుసరించి, ఎప్పటికప్పుడు ఉత్తమ సేవలు అందించడానికే ప్రాధాన్యతనిస్తానని పిటిఐతో మాట్లాడుతూ రహానే అన్నాడు.

09/24/2016 - 05:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రియోలో ఇటీవల ముగిసిన పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు పద్మ అవార్డులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. పురుషుల హై జంప్ విభాగంలో తంగవేలు మరియప్పన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, వరుణ్ సింగ్ భాటీ కాంస్య పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో దేవేంద్ర ఝజారియాకు స్వర్ణ పతకం లభించింది. మహిళల షాట్‌పుట్‌లో దీపా పాలిక్ రజత పతకాన్ని అందుకుంది.

09/24/2016 - 05:08

కాన్పూర్, సెప్టెంబర్ 23: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలింగ్ వెలవెలబోతున్నది. వర్షం కారణంగా చివరి సెషన్ రద్దయిన రెండో రోజు ఆటలో కివీస్ బ్యాటింగ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయిన ఆ జట్టు 152 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఆ జట్టు ఇంకా 166 పరుగులు వెనుకంజలో నిలిచింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి.

09/24/2016 - 05:05

టోక్యో, సెప్టెంబర్ 23: భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న జపాన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌లో ఓటమిపాలై నిష్క్రమించాడు. దీనితో ఈ టోర్నీలో భారత్ పోరాటానికి తెరపడింది. జర్మనీకి చెందిన మార్క్ వీబ్లర్‌తో శ్రీకాంత్ చివరి వరకూ హోరాహోరీగా పోరాడాడు. ఈ మ్యాచ్‌కి ముందు అతనితో మూడు పర్యాయాలు తలపడిన శ్రీకాంత్ రెండు విజయాలను నమోదు చేశాడు.

09/24/2016 - 05:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎస్‌ఎఫ్) ఎన్నికలు ఈనెల 25న జరగనుండగా, పరిశీలకుడిగా ఎడ్గర్ టన్నర్‌ను పంపాలని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐఎబిఎ) నిర్ణయించింది. ఆస్ట్రేలియాకు చెందిన టన్నర్ ఐఎబిఎకు విదేశాల్లో ఎన్నికల పరిశీలక కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. బిఎస్‌ఎఫ్ ఎన్నికలను పర్యవేక్షించడానికి అతను శనివారం భారత్ చేరుకుంటాడు.

Pages