S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/21/2016 - 08:17

లాసానే, జూలై 20: డోపింగ్ కుంభకోణంలో పీకల్లోతున కూరుకుపోయిన రష్యా క్రీడాకారులను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలా? లేక వారిపై నిషేధం విధించాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కనీసం ఇంకో వారం రోజుల సమయం పడుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) బుధవారం స్పష్టం చేసింది.

07/21/2016 - 08:16

న్యూఢిల్లీ, జూలై 20: వెస్టిండీస్‌లో స్పిన్నర్లు ప్రముఖ పాత్ర పోషించే అవకాశముందని టెస్టు క్రికెట్‌కు దూరమైన టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటున్నాడు. వెస్టిండీస్‌లో వికెట్లు స్లోగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అలా అయిన పక్షంలో స్పిన్నర్లు గొప్ప పాత్ర పోషించాల్సి ఉంటుంది’ అని బుధవారం ఇక్కడొక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ధోనీ మీడియాతో అన్నాడు.

07/21/2016 - 08:15

ఆంటిగ్వా, జూలై 20: వెస్టిండీస్‌తో గురువారంనుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ఆలోచనా ధోరణి (మైండ్‌సెట్) మారాల్సిన అవసరం ఉందని జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయ పడ్డాడు. టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి ముందు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌నుంచి టెస్ట్ఫార్మాట్‌కు ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను మార్చడంపై దృష్టిపెట్టినట్లు కుంబ్లే చెప్పాడు.

07/21/2016 - 08:15

లండన్, జూలై 20: పాకిస్తాన్‌తో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ కోసం 14 మంది సభ్యులతో ఎంపిక చేసిన ఇంగ్లాండ్ జట్టులో ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో పాటు లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు చోటు కల్పించారు.

07/20/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 19: వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఆంటిగ్వాలో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడమే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పెద్ద సవాలు కానుంది.

07/20/2016 - 07:38

మనె్హయిమ్ (అమెరికా), జూలై 19: అమెరికాలో పర్యటిస్తున్న భారత మహిళా హాకీ జట్టుకు ఆదిలోనే నిరాశ ఎదురైంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు 2-3 గోల్స్ తేడాతో ఆతిథ్య అమెరికా చేతిలో ఓటమిపాలవడమే ఈ నిరాశకు కారణం. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అమెరికా జట్టు ఈ మ్యాచ్‌లో చాలా చక్కగా రాణించింది.

07/20/2016 - 07:36

కోల్‌కతా, జూలై 19: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు దబాంగ్ ఢిల్లీ జట్టుపై 36-28 పాయింట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. మరోసారి తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌధరి అద్భుత ప్రతిభ కనబరచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

07/20/2016 - 07:36

శ్రీనగర్, జూలై 19: జమ్మూ-కాశ్మీరు క్రికెట్ సంఘం (జెకెసిఎ) మంగళవారం తమ అధ్యక్షునిగా ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఇమ్రాన్ అన్సారీని ఎన్నుకుంది.

07/20/2016 - 07:35

కాన్పూర్, జూలై 19: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన ప్రధాన సిఫారసులన్నింటినీ సుప్రీం కోర్టు ఆమోదించడంతో ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యుపిసిఎ) తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుంది. యుపిసిఎ కోశాధికారితో పాటు మొత్తం ఐదుగురు డైరెక్టర్లు 70 ఏళ్ల వయసు పైబడినవారే కావడంతో వీరంతా పదవీ గండంలో చిక్కుకున్నారు.

07/19/2016 - 01:17

కాల్విన్ బే (బ్రిటన్), జూలై 18: ఇంగ్లాండ్‌లోని గ్లామోర్గాన్ కౌంటీ జట్టుకు చెందిన యువ ఆటగాడు అనెయురిన్ డొనాల్డ్ (19) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సత్తా చాటుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం డెర్బీషైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుత ఇన్నింగ్స్ ఆడి 123 బంతుల్లో 15 ఫోర్ల సహాయంతో వేగవంతంగా డబుల్ సెంచరీ సాధించాడు.

Pages