S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/19/2016 - 07:29

రియో డి జెనీరో, సెప్టెంబర్ 18: రియో పారాలింపిక్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇరాన్ సైక్లిస్టు బహ్మాన్ గొల్బార్నెజాద్ రేసు జరుగుతున్నప్పుడు ప్రమాద వశాత్తు కింద పడి తీవ్ర గాయాలకు లోనయ్యాడు. అతనిని బర్రాలోని యూనిమ్డ్ రియో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంగ వైకల్యం ఉన్నప్పటికీ, సైకిల్ తొక్కగల వారికి ప్రత్యేకించిన సి 4-5 విభాగంలో 48 ఏళ్ల బహ్మాన్ పోటీపడ్డాడు.

09/19/2016 - 07:25

ముంబయి, సెప్టెంబర్ 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను ఇవ్వడానికి టెండర్లు పిలవాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. ప్రస్తుతం ఈ హక్కులను సోనీ టీవీ నెట్‌వర్క్ (ఎస్‌పిఎన్‌ఐ) వద్ద ఉన్నాయి. 2017 ఐపిఎల్‌తో బోర్డుతో ఎస్‌పిఎన్‌ఐ కాంట్రాక్టు పూర్తవుతుంది.

09/19/2016 - 07:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: డేవిస్ కప్ టెన్నిస్‌లో భారత్‌కు స్పెయిన్ చేతిలో వైట్‌వాష్ తప్పలేదు. శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లోనూ ఓడిన భారత్ శనివారం డబుల్స్‌లోనూ పరాజయాన్ని చవిచూసింది. దీనితో 3-0 ఆధిక్యాన్ని సంపాదించిన స్పెయిన్‌కు చివరి రెండు రివర్స్ సింగిల్స్ ఫలితాల ప్రభావం లేకపోయినప్పటికీ, రెంటినీ గెల్చుకొని సత్తా చాటింది.

09/19/2016 - 07:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌ను ‘స్పెయిన్ బుల్’, టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ పొగడ్తల్లో ముంచెత్తాడు. అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాళ్లలో పేస్ ఒకడని ప్రశంసించాడు. డబుల్స్‌లో అతనిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు.

09/19/2016 - 07:21

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: రియో ఒలింపిక్స్‌కు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) అధికారులు మంచి జట్టును పంపలేదంటూ మిక్స్‌డ్ డబుల్స్ విభాగం గురించి వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేవిస్ కప్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేనీతో కలిసి శనివారం రాఫెల్ నాదల్, మార్క్ లొపెజ్ జోడీని ఢీకొన్న పేస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే, తాము చివరి వరకూ గట్టిపోటీనిచ్చామని పేస్ అన్నాడు.

09/19/2016 - 07:20

మాడ్రిడ్, సెప్టెంబర్ 17: స్పెయిన్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా లెగానెస్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా ఆటగాడు లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ సాధించాడు. మరో రెండు గోల్స్ రావడంతో కీలక పాత్ర పోషించాడు. అతని ప్రతిభతో బార్సిలోనా 5-1 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ 15వ నిమిషంలోనే బార్సిలోనాకు మెస్సీ తొలి గోల్‌ను అందించాడు. 31వ నిమిషంలో మరో స్టార్ ఆటగాడు లూయిస్ సౌరెజ్ గోల్ చేశాడు.

09/19/2016 - 07:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ముంబయి, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వామప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముంబయి ఆటగాడు సిద్దేష్ లాడ్ సెంచరీ పూర్తి చేయడం మినహా చివరి రోజు ఆట సాదాసీదాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఏడు వికెట్లకు 324 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది.

09/19/2016 - 07:17

బ్రిస్బేన్, సెప్టెంబర్ 18: భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య నాలుగు రోజుల అనధికార టెస్టు డ్రాగా ముగిసింది. భారీ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయంగా మారడంతో ఆటను మొదలుపెట్టే అవకాశం లేకపోయింది. పలుమార్లు పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-0 తేడాతో గెల్చుకుంది.

09/19/2016 - 07:16

గబాలా (అజర్‌బైజాన్), సెప్టెంబర్ 18: భారత షూటర్ శుభాంకర్ ప్రామాణిక్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్‌లో స్వర్ణ పతకం సాధించాడు. అతను మొత్తం 205.5 పాయింట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించగా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఫెలిప్ నెడెచల్ 205.2 పాయింట్లతో రజత పతకాన్ని గెల్చుకున్నాడు. రుమేనియాకు చెందిన డ్రోగొమిర్ లొర్డాచె 185.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

09/19/2016 - 07:15

లావెన్, సెప్టెంబర్ 18: భారత బాడ్మింటన్ ఆటగాడు సౌరభ్ వర్మ ఇక్కడ జరిగిన బెల్జియం ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)తో తలపడి 19-21, 19-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ఆరంభంలో 11-4 ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ఆతర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయాడు. పదేపదే పొరపాట్లు చేస్తూ తొలి సెట్‌ను కోల్పోయాడు.

Pages