S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/18/2016 - 06:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవడానికి స్పెయిన్‌తో శనివారం డబుల్స్ విభాగంలో పోటీపడిన భారత్‌కు చుక్కెదురైంది. రాఫెల్ నాదల్, మార్క్ లొపెజ్ జోడీ 4-6, 7-6, 6-4, 6-4 ఆధిక్యంతో లియాండర్ పేస్, సాకేత్ మైనేజీ జోడీపై విజయభేరి మోగించింది. సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.

09/18/2016 - 05:59

కాన్పూర్, సెప్టెంబర్ 17: ఆశించిన స్థాయిలో రాణించలేక విఫలమవుతున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు భారత సెలక్టర్లు ఇంతకెంత కాలం సహాయసహకారాలను అందిస్తారన్న విమర్శలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో, న్యూజిలాండ్‌తో ఆరంభం కానున్న మొదటి టెస్టు మ్యాచ్ వీరికి పరీక్ష పెట్టనుంది.

09/18/2016 - 05:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కౌస్త్భు పవార్, సూర్యకుమార్ యాదవ్ శతకాలు సాధించడంతో, న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో ముంబయి 107 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 431 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఒక వికెట్ నష్టపోయి 29 పరుగులు చేసింది.

09/18/2016 - 05:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ గాయపడ్డాడు. ఫలితంగా భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ఎడమ కాలి మడమకు గాయమైంది. రెండు కండరాలు చిట్లాయని, దీనితో అతనికి వైద్య సేవలు అవసరమని కివీస్ జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది.

09/18/2016 - 05:57

బ్రిస్బేన్, సెప్టెంబర్ 17: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న ‘ఎ’ సిరీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 169 పరుగులకే ఆలౌట్‌కాగా, అందుకు సమాధానంగా ఆస్ట్రేలియా ‘ఎ’ 435 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు వెనుకంజలో పడిన భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి, ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో పడింది.

09/18/2016 - 05:56

బెంగళూరు, సెప్టెంబర్ 17: ఎవరైనా సరే వర్తమానికి తగ్గట్టుగా ఆలోచించాలే తప్ప గతంతో పోలుస్తూ నిర్ణయాలకు రాకూడదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. కృష్ణపట్నం గోల్ఫ్ టోర్నమెంట్‌ను ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన అతను విలేఖరులతో మాట్లాడుతూ కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన ఆల్‌రౌండర్ల మధ్యే పోలిక సాధ్యమవుతుందని అన్నాడు.

09/17/2016 - 16:59

కాన్పూర్: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పడు మరో రికార్డుపై గురి పెట్టాడు. విండీస్తో సిరీస్లో 235 పరుగులు(రెండు సెంచరీలు), 17 వికెట్లతో మెరిసిన అశ్విన్ న్యూజిలాండ్తో జరిగే తొలి టెస్టులో బంతితో రాణిస్తే మరో అరుదైన ఘనత అతని ఖాతాలో చేరుతుంది. శనివారం బర్త్ డే జరుపుకుంటున్న అశ్విన్. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్ల్లో193 వికెట్లు సాధించాడు.

09/17/2016 - 06:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యే క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వామప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనిచ్చింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా తొలత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 7 వికెట్లకు 324 పరుగుల స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

09/17/2016 - 06:06

తీవ్రవాదుల్లా చూస్తారు

09/17/2016 - 06:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ అనారోగ్యం కారణంగా డేవిస్ కప్ మొదటి రోజు మ్యాచ్ నుంచి వైదొలిగాడు. అతను ఉదర సంబంధమైన సమస్యతో బాధపడుతున్నాడని, అందుకే, రాంకుమార్ రామనాథన్‌తో జరగాల్సిన మొదటి మ్యాచ్‌లో పాల్గొనడం లేదని స్పెయిన్ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతను ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

Pages