S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/17/2016 - 06:03

ఢాకా, సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్, అతని భార్య అమ్మే అహ్మద్ శిషిర్‌కు కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. వీరిని కాక్సెస్ బజార్‌లో దించిన హెలికాప్టర్ తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. ఆ సంఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

09/17/2016 - 06:03

బ్రిస్బేన్, సెప్టెంబర్ 16: భారత్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల ‘ఎ’ సిరీస్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ ఐదు వికెట్లకు 319 పరుగులు సాధించింది. హిల్టన్ కార్ట్‌రైట్ 99 పరుగులు చేసి, కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. బెయూ వెబ్‌స్టర్ 79, నిక్ మాడిసన్ 81 పరుగులతో రాణించారు. శార్దూల్ ఠాకూర్ 71 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

09/16/2016 - 08:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: డేవిస్ కప్ ఎలైట్ వరల్డ్ గ్రూప్ టెన్నిస్ పోరు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా, స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. డేవిస్ కప్ ర్యాంకింగ్స్‌ను పరిగణలోకి తీసుకుంటే భారత్ కంటే స్పెయిన్ మెరుగైన స్థితిలో ఉంది. ఈ జాబితాలో స్పెయిన్‌ది 14వ స్థానంకాగా, భారత్ 20వ స్థానంలో నిలిచింది.

09/16/2016 - 08:27

బ్రిస్బేన్, సెప్టెంబర్ 15: నాలుగు దేశాల ‘ఎ’ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా ‘ఎ’తో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 169 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ‘ఎ’ కెప్టెన్ జో బర్న్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ ‘ఎ’ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది.

09/16/2016 - 08:27

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: న్యూజిలాండ్‌తో ఈనెల 25 నుంచి కాన్పూర్‌లో మొదలయ్యే టెస్టును చూసేందుకు రావాల్సిందిగా మాజీ కెప్టెన్లను ఆహ్వానించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయంచింది. భారత్‌కు 500వ టెస్టు కావడంతో ఆ మ్యా చ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

09/16/2016 - 08:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ శుక్రవారం నుంచి జరిగే డేవిస్ కప్ పోరులో స్టార్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. స్పెయిన్ ఐదు పర్యాయాలు డేవిస్ కప్‌ను కైవసం చేసుకోగా, వాటిలో నాలుగు సార్లు (2004, 2008, 2009, 2011) నాదల్ సభ్యుడుకావడం గమనార్హం. అతని ఆటను చూసేందుకు అభిమానులు స్టేడియానికి క్యూ కట్టడి ఖాయం.

09/16/2016 - 08:26

లండన్, సెప్టెంబర్ 15: బెట్టింగ్‌కు సహకరించారన్న ఆరోపణల్లో దోషులుగా తేలడంతో ఉబ్జెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు అంపైర్లు, షెర్జోద్ హసనొవ్, అర్కిప్ మొలోత్యగిన్‌లపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) జీవితకాల సస్పెన్షన్ వేటు విధించింది. నిరుడు ఇజ్రాయిల్‌లోని టిబెరియాస్‌లో జరిగిన ఐటిఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీలో వీరిద్దరూ బుకీలకు సహకరించారని విచారణలో తేలింది.

09/16/2016 - 08:25

సిడ్నీ, సెప్టెంబర్ 15: ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ గ్రేమ్ హిక్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్పెషలిస్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించారు. ఇంగ్లాండ్ తరఫున 65 టెస్టులు, 120 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన హిక్ ఇటీవల వెస్టిండీస్‌లో వనే్డ సిరీస్ ఆడిన ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించాడు.

09/16/2016 - 08:25

మాడ్రిడ్, సెప్టెంబర్ 15: యూరోపియన్ చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు పోరాడుతున్న మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 2-1 తేడాతో స్పోర్టింగ్ లిస్బన్‌పై విజయం సాధించింది. ఒక దశలో రియల్ మాడ్రిడ్ 0-1 తేడాతో వెనుకంజలో నిలిచింది. అయితే, చివరి క్షణాల్లో ఎదురుదాడికి దిగి, ఐదు నిమిషాల తేడాతో రెండు గోల్స్ సాధించి గెలవడం విశేషం.

09/16/2016 - 08:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పురుషులు, మహిళలు, జూనియర్ విభాగాల్లో జాతీయ క్రికెట్ సెలక్టర్లుగా ఉండేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇచ్చిన ప్రకటనకు స్పందన మొదలైంది. దరఖాస్తులు కూడా చేరుతున్నాయ. భారత మాజీ వికెట్‌కీపర్ విజయ్ దహియా, ఫాస్ట్ బౌలర్ అమిత్ భండారీ దరఖాస్తులను బిసిసిఐకి పంపారు. వీరిద్దరూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

Pages