S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/10/2016 - 08:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రియో ఒలింపిక్స్‌లో భారత బృందం దారుణ వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఎన్నో కారణాలున్నాయని కేంద్రానికి సమర్పించనున్న నివేదికలో క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పేర్కొంది. రియోలో 117 మంది పోటీపడినప్పటికీ, కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కిన విషయం తెలిసిందే.

09/10/2016 - 08:32

కొలంబో, సెప్టెంబర్ 9: శ్రీలంకతో శుక్రవారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సు నాయాసంగా గెలిచింది. 129 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయ ఛేదించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన లంక తొలుత బ్యాటింగ్ కు దిగింది. అయతే, అది పొరపాటు నిర్ణయమని వికెట్ల పతనం స్పష్టం చేసింది.

09/10/2016 - 08:31

చెన్నై, సెప్టెంబర్ 9: భారత జాతీయ జట్టు సీనియర్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ మైదానంలో సంయమనం కోల్పోయి ఒక యువ క్రికెటర్‌తో యుద్ధానికి దిగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చేపాక్ సూపర్ గిల్లీస్, దిండిగల్ డ్రాగాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దిండిగల్ కెప్టెన్ అశ్విన్‌తోపాటు జగదీశ్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

09/10/2016 - 08:31

బ్రిస్బేన్, సెప్టెంబర్ 9: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ హోరాహోరీగా పోరాడుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే ఆలౌటైన భారత్ ఆతర్వాత ఆస్ట్రేలియాను 228 పరుగులకే కట్టడి చేసి, రెండు పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆసీస్ జట్టులో జో బర్న్స్ 78, పీటర్ హ్యాండ్‌కోమ్ 87 పరుగులు సాధించారు.

09/09/2016 - 01:27

రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండు పతకాలు సాధించినందుకే భుజాలు చరచుకొని, ఏదో అద్భుతాన్ని సాధించామని విర్రవీగాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు తెలిసొచ్చింది. వచ్చే ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకొని క్రీడా రంగ అభివృద్ధికి, ప్రక్షాళనకు టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత క్రీడా మంత్రి విజయ్ గోయల్ రియో వైఫల్యాలపై దృష్టి సారించారు.

09/09/2016 - 01:24

లండన్, సెప్టెంబర్ 8: ఫార్ములా వన్ రేసింగ్ అమెరికాకు చెందిన లిబర్టీ మీడియా చేతికి వెళ్లింది. 75 ఏళ్ల వ్యాపార దిగ్గజం జాన్ మలోన్‌కు చెందిన ఈ సంస్థ ఫార్ములా వన్‌ను 4.4 బిలియన్ డాలర్లు (సుమారు 29,000 కోట్ల రూపాయలు) మొత్తానికి కొనుగోలు చేసింది. దీనితో దశాబ్దాలుగా ఫార్ములా వన్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న బెర్నీ అకెల్‌స్టల్ ఇకపై కొత్త చైర్మన్ చేస్ కారీ ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుంది.

,
09/09/2016 - 01:23

రియో డి జెనీరో, సెప్టెంబర్ 8: బ్రెజిల్ పారా అథ్లెట్ మార్సియా మాల్సర్ ఆత్మవిశ్వాసానికి వేలాది మంది ప్రేక్షకులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. ఏదో ఒక రకమైన అంగ వైకల్యంతో బాధపడుతున్న క్రీడాకారులకు ఉద్దేశించిన పారాలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక రియో డి జెనీరోలో ఘనంగా జరిగింది. ఒలింపిక్ క్రీడా జ్యోతిని పట్టుకొని రిలేను కొనసాగించే బాధ్యత మార్సియా తీసుకుంది. అయితే, ఊహించని విధంగా పట్టుతప్పి కిందపడింది.

09/09/2016 - 01:19

న్యూయార్క్, సెప్టెంబర్ 8: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ వీరుడు, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే దూకుడుకు జపాన్ హీరో కెయ్ నిషికోరి బ్రేక్ వేశాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అతను 1-6, 6-4, 4-6, 6-1, 7-5 తేడాతో విజయభేరి మోగించి సంచలనం సృష్టించాడు.

09/09/2016 - 01:17

న్యూయార్క్: స్టానిస్లాస్ వావ్రిన్కా యుఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ చేరాడు. రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను జువాన్ డెల్ పొట్రోను 7-6, 4-6, 6-3, 6-2 తేడాతో ఓడించాడు. 2009లో యుఎస్ ఓపెన్‌ను గెల్చుకున్న పొట్రో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న వావ్రిన్కాకు ఆశించిన స్థాయిలో పోటీని ఇవ్వలేకపోయాడు. కాగా, ఫైనల్‌లో స్థానం కోసం నిషికోరితో వావ్రిన్కా తలపడతాడు.

09/09/2016 - 01:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డుకు ప్రముఖ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ పేరును భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (బిఎస్‌ఎఫ్‌ఐ) ప్రతిపాదించింది. భారత పౌర పురస్కారాల్లో మూడో అత్యున్నత అవార్డు పద్మభూషణ్ కోసం నిరుడు కూడా అద్వానీ పేరును సమాఖ్య ప్రతిపాదించింది. కానీ, అవార్డుల కమిటీ అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు.

Pages