S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/07/2016 - 18:07

దిల్లీ: ప్రతిష్ఠాత్మక మారిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ)లో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రాకు జీవితకాల సభ్యత్వం లభించింది. భారత్‌ నుంచి ఈ గౌరవం దక్కిన తొలి మహిళా క్రికెటర్‌గా అంజుమ్‌ చరిత్రలో నిలిచింది. భారత్‌ నుంచి జహీర్‌ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు అంజుమ్‌కు సభ్యత్వం కల్పిస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది.

09/07/2016 - 14:39

ఢిల్లీ: బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఈనెల 7 నుంచి 18 వరకు జరిగే పారాలింపిక్స్‌ పోటీల్లో స్వర్ణం సాధించే అథ్లెట్‌కు రూ.75 లక్షలు ఇవ్వనున్నట్టు భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ట్వీట్టర్ పేజీలో పేర్కొంది. భారత్ నుంచి 17 మందితో కూడిన బృందం పారాలింపిక్స్‌కు వెళ్లింది.

09/07/2016 - 03:30

న్యూయార్క్, సెప్టెంబర్ 6: మహిళా టెన్నిస్ రంగంలో ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన సెరెనా విలియమ్స్ సోమవారం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

,
09/07/2016 - 00:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డుకు ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన సుశీల్ కుమార్ (33) పేరును భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) సిఫారసు చేసింది.

,
09/07/2016 - 00:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని యావత్ దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్ (24) తన కంటే రెండేళ్ల చిన్నవాడైన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆమె హృదయాన్ని దోచుకున్న వ్యక్తి ఎవరో కాదు. అంతర్జాతీయ పోటీల్లో విజయవంతమైన సహచర రెజ్లర్ సత్యవ్రత్ కదియన్. వీరిద్దరూ హర్యానాలోని రోహ్తక్‌కు చెందిన వారే.

09/07/2016 - 00:43

ముంబయి, సెప్టెంబర్ 6: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న ‘తెలుగు తేజం’ పివి.సింధుతో పాటు ఆమె విజయం వెనుక కీలకపాత్ర పోషించిన జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను మహారాష్ట్ర బాడ్మింటన్ అసోసియేషన్ మంగళవారం ముంబయిలో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వినోద్ తావ్డే హాజరై సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు.

09/07/2016 - 00:41

బాలిక్ పాపన్ (ఇండోనేసియా), సెప్టెంబర్ 6: వరస గాయాల కారణంగా రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ బుధవారంనుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ఇండోనేసియా గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించనున్నాడు.

09/07/2016 - 00:38

పల్లికల్, సెప్టెంబర్ 6: అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. మంగళవారం పల్లికల్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (145 నాటౌట్) దుమ్ము రేపడంతో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

09/07/2016 - 00:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత్‌తో త్వరలో జరగబోయే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీ కోసం స్పెయిన్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.

09/07/2016 - 00:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ఒలింపిక్ పతక విజేతలతో సరిసమానంగా నగదు పురస్కారాలను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది.

Pages