S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/07/2016 - 00:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: లండన్ ఒలింపిక్స్‌లో నాలుగేళ్ల క్రితం భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ సాధించిన కాంస్య పతకాన్ని పసిడి పతకానికి అప్‌గ్రేడ్ చేయడం లేదని యుడబ్ల్యుడబ్ల్యు (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) మంగళవారం స్పష్టం చేసింది.

09/07/2016 - 00:34

న్యూయార్క్, సెప్టెంబర్ 6: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో ఏడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన సానియా, స్ట్రికోవా సోమవారం ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ మూడో రౌండ్ పోరులో నికోల్ గిబ్స్ (అమెరికా), నావో హిబినో (జపాన్) జోడీపై వరుస సెట్ల తేడాతో విజయం సాధించారు.

09/05/2016 - 07:08

రియో డి జెనీరో, సెప్టెంబర్ 4: రియో నగరాన్ని ఒలింపిక్స్ భయపెడుతున్నాయి. సమ్మర్ ఒలింపిక్స్ ముగిసి సుమారు రెండు వారాలు కావస్తున్నా, అప్పటి సమస్యలు ఇంకా బ్రెజిల్‌ను వెంటాడుతునే ఉన్నాయి. ప్రత్యేకించి రియోలో పరిస్థితులు ఇంకా గాడిలో పడలేదు. అనేకానేక అడ్డంకులను అధిగమించి, సమ్మర్ ఒలింపిక్స్‌ను విజయవంతంగా ముగించిన అధికారులు ఊపిరి పీల్చుకునే లోపే పారాలింపిక్స్ వచ్చిపడుతున్నాయి.

09/05/2016 - 07:03

పల్లేకల్, సెప్టెంబర్ 4: శ్రీలంకతో ఆదివారం జరిగిన ఐదవ, చివరి వనే్డ ఇంటర్నేషనల్‌ను ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో ఏడో వనే్డ శతకాన్ని నమోదు చేసి, ఆసీస్ విజయానికి తోడ్పడ్డాడు. అతని విజృంభణతో, 196 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించింది. సిరీస్‌ను 4-1 తేడాతో కైవసుం చేసుకుంది.

09/05/2016 - 07:02

పల్లేకల్, సెప్టెంబర్ 4: క్రీడాకారుల్లో ఈఏటి ఉత్తమ తండ్రిగా డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో చివరిదైన ఐదో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఫిలిప్స్ స్పోర్ట్స్ డాడ్ అవార్డును వార్నర్‌కు అందచేశారు. ఇదే ఏడాది ప్రారంభంలో అతనికి ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక అలాన్ బోర్డర్ అవార్డు లభించింది.

09/05/2016 - 07:01

న్యూయార్క్, సెప్టెంబర్ 4: బ్రిటిష్ ఆటగాడు, ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో చెమటోడ్చి గెలిచాడు. పౌలో లోరెంజీతో తలపడిన అతను 7-6, 5-7, 6-2, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకొని మంచి ఫామ్‌లో ఉన్న ముర్రేకు లోరెంజీ నుంచి అనూహ్య స్థాయిలో పోటీ ఎదురైంది.

09/05/2016 - 07:01

న్యూయార్క్: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న నిక్ కిర్గియోస్ యుఎస్ ఓపెన్ నుంచి కన్నీరు పెట్టుకుంటూ నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో అతను ఇల్యా మార్చెన్కోతో తలపడ్డాడు. మొదటి సెట్‌ను 4-6 తేడాతో చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత రెండు సెట్లను 6-4, 6-1 తేడాతో సొంతం చేసుకున్నాడు.

09/05/2016 - 07:01

ముంబయ, సెప్టెంబర్ 4: భారత క్రికెటర్ యు వరాజ్ సింగ్ పెళ్లి డిసెంబర్ మాసంలో జరుగు తుంది. ‘యూవియ్‌కెన్’ (వైడబ్ల్యుసి) పేరుతో యువీ ఫ్యాషన్ సంస్థను ప్రారంభించాడు. క్రికె టర్లు ఇశాంత్ శర్మ, క్రిస్ గేల్, బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి పలు వురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

09/05/2016 - 07:00

న్యూయార్క్, సెప్టెంబర్ 4: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరినప్పటికీ, మూడో రౌండ్ విజయం తనకు సంతృప్తినివ్వలేదని ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ వ్యాఖ్యానించింది. మూడో రౌండ్‌లో ఆమె లారా సీగ్మండ్‌ను 6-1, 6-2 తేడాతో చిత్తుచేసింది.

09/04/2016 - 03:38

న్యూయార్క్, సెప్టెంబర్ 3: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఏమాత్రం కష్టపడకుండానే ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో 34 ఏళ్ల మిఖయిల్ యూజ్నీతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 4-2 ఆధిక్యాన్ని సంపాదించాడు. అప్పటికి 32 నిమిషాల ఆట జరిగింది. ఈ దశలో యూజ్నీ కండరాల నొప్పితో బాధపడుతూ మ్యాచ్‌ని కొనసాగించలేకపోయాడు.

Pages