S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/04/2016 - 03:38

న్యూయార్క్, సెప్టెంబర్ 3: యుఎస్ ఓపెన్‌ను గ్రాస్, క్లే, హార్డ్ కోర్టులపై గెల్చుకున్న ఘనత ఇద్దరు స్టార్లకే దక్కుతుంది. జిమీ కానర్స్, క్రిస్ ఎవర్ట్ లాయిడ్ ఈ ఫీట్‌ను సాధించారు. 1881 నుంచి గణాంకాలను పరిశీలిస్తే పురుషులు లేదా మహిళల విభాగంలో అమెరికన్లు లేకుండా ఫైనల్ మ్యాచ్‌లు జరిగిన సందర్భాలు ఏడు మాత్రమే.

09/04/2016 - 03:33

న్యూయార్క్, సెప్టెంబర్ 3: జర్మనీకి చెందిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ మహిళల సింగిల్స్‌లో సులభంగా ప్రీ క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. మూడో రౌండ్‌లో ఆమె క్వాలిఫయర్ సిసి బెలిస్‌ను 6-1, 6-1 తేడాతో చిత్తుచేసింది. కెర్బర్ విజృంభణకు బెలిస్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోయింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి 6-3, 6-1 స్కోరుతో మోనికా నికలెస్క్యూపై విజయం సాధించింది.

09/04/2016 - 03:32

న్యూయార్క్: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు జో విల్‌ఫ్రైడ్ సొంగా బాక్సర్ అవతారం ఎత్తి ప్రేక్షకులను కొద్దిసేపు అలరించాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో అతను కెవిన్ ఆండర్సన్‌ను 6-3, 6-4, 7-6 స్కోరుతో ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే సొంగా కాసేపు షాడో బాక్సింగ్ చేశాడు.

09/04/2016 - 03:30

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయాల బోణీ చేసింది. మొదటి రౌండ్‌లో సానియా, డోపింగ్ జోడీ 6-4, 6-4 స్కోరుతో డొనాల్డ్ యంగ్, టేలర్ టౌన్‌సెండ్ జోడీని గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

09/04/2016 - 03:29

లీడ్స్, సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లాలా? లేదా? అన్నది తేల్చుకోలేకపోతున్న ఇంగ్లాండ్ వనే్డ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మల్లగుల్లాలు పడుతున్నాడు. అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో బంగ్లాదేశ్ పర్యటకు వెళ్లాల్సిన ఇంగ్లాండ్ అక్కడ మూడు వనే్డ ఇంటర్నేషనల్స్, రెండు టెస్టులు ఆడాలి.

09/04/2016 - 03:27

బ్యూనస్ ఎయిర్స్, సెప్టెంబర్ 3: అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ గాయపడ్డాడు. ఫలితంగా, 2018 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా వెనుజులాతో జరిగే మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండడు. అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహింబోవడం లేదని ఇటీవల ప్రకటించిన మెస్సీ ఆతర్వాత మనసు మార్చుకున్న విషయం తెలిసిందే.

09/04/2016 - 03:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో పాల్గొన్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే దులీప్ ట్రోఫీ డేనైట్ మ్యాచ్ నుంచి విశ్రాంతి లభించే అవకాశాలున్నాయ. న్యూజిలాండ్‌తో సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో అ తనికి తగినంత విశ్రాంతి అవసరమని బిసిసిఐ ఆలోచి స్తున్నట్టు సమాచారం.

09/04/2016 - 03:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: చాంపియన్స్ ట్రోఫీ నిర్వాహణకుగాను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి ఏకంగా 135 మిలియన్ డాలర్లను చెల్లించాలన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈఏడాది మార్చి 8 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు భారత్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను నిర్వహించారు.

09/04/2016 - 03:23

ఇండోర్, సెప్టెంబర్ 3: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) లైఫ్ ప్రెసిడెంట్‌గా అనిల్ ఖన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే క్రీడా విధివిధానాలు ఇంకా ఖరారు కానందున అతను బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించాడు. శనివారం ఇక్కడ జరిగిన ఎఐటిఎ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఖన్నాను లైఫ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. 23 సభ్య సంఘాల ప్రతినిధులంతా ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు.

09/03/2016 - 07:59

న్యూయార్క్, సెప్టెంబర్ 2: కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ జోరును కొనసాగిస్తున్నది. స్వదేశంలో జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచి, ఏడోసారి ఈ టైటిల్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో వానియా కింగ్‌ను 6-3, 6-3 తేడాతో చిత్తుచేసింది. సెరెనా విజృంభణకు వానియా ఏ దశలోనూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది.

Pages