S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/02/2016 - 01:57

* నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని కెరీర్ శ్లామ్‌ను సాధించిన తొలి ఆటగాడు ఫ్రెడ్ పెర్రీ. టేబుల్ టెన్నిస్‌లోనూ అతను ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తింపు సంపాదించాడు. అటు టెన్నిస్, ఇటు టేబుల్ టెన్నిస్‌లో మేజర్ టోర్నీలను గెల్చుకున్న ఏకైక క్రీడాకారుడు అతను.

09/02/2016 - 01:57

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ చరిత్రలోనే తొలిసారి ఆర్థర్ అషే స్టేడియం పైకప్పును మూశారు. రాఫెల్ నాదల్, ఆండ్రియాస్ సెప్పీ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. దీనితో స్టేడియం రూఫ్‌ను మూసేసి, ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆటను కొనసాగించారు. పైకప్పును మూసేయడానికి సుమారు ఏడున్నర నిమిషాల సమయం పట్టింది.

09/02/2016 - 01:55

దంబుల్లా, సెప్టెంబర్ 1: శ్రీలంకలో పిచ్‌లు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడేందుకు ఏమాత్రం అనుకూలంగా లేవని ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ విమర్శించాడు. శ్రీలంకతో బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్‌ని గెల్చుకున్న ఆస్ట్రేలియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీనితో చివరిదైన ఐదో వనే్డ ఫలితానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది.

09/02/2016 - 01:54

లాడెర్‌హిల్, సెప్టెంబర్ 1: అమెరికా లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈనెల నిర్వహించాలని తలపెట్టిన ‘మినీ ఐపిఎల్’కు బ్రేక్ పడింది. అమెరికా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ టోర్నీని నిర్వహించాలని బిసిసిఐ తొలుత భావించింది. అదే విధంగా యుఎఇని కేంద్రంగా చేసుకునే అంశాన్ని కూడా పరిశీలించింది. సెప్టెంబర్‌లో ఈ టోర్నీ ఉంటుందని ఇది వరకే ప్రకటించింది.

09/02/2016 - 01:52

గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 1: ఇండియా రెడ్ జట్టు దులీప్ ట్రోఫీ ఫైనల్ చేరింది. ఇండియా బ్లూతో తలపడిన ఇండియా రెడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 285 పరుగులు చేసింది. మాయాంక్ అగర్వాల్ 92, గౌతం గంభీర్ 77 పరుగులతో రాణించగా, కుల్దీప్ యాదవ్ 78 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాత వర్షం కారణంగా ఆట కొనసాగలేదు. చివరి రోజైన గురువారం కూడా ఆట జరగకపోవడంతో, మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు.

09/02/2016 - 01:52

ఢాకా, సెప్టెంబర్ 1: బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ పేసర్ కొట్నీ వాల్ష్‌ను నియమించినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు (బిసిబి) ఒక ప్రకటనలో తెలిపింది. వాల్ష్ పర్యవేక్షణలో తమ దేశ యువ బౌలర్లు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఈ బాధ్యతను స్వీకరించడం తనకు ఎంతో ఆనందాన్నిస్తున్నదని వాల్ష్ ఫోన్ ద్వారా ఒక చానెల్‌తో మాట్లాడుతూ చెప్పాడు.

,
09/02/2016 - 01:50

ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ), సెప్టెంబర్ 1: అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన జర్మనీ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ బాస్టియన్ ష్వెన్‌స్టిగర్‌కు సహచరులు విజయాన్ని అందించి, ఘనంగా వీడ్కోలు పలికారు. జర్మనీ జాతీయ జట్టుకు అతను చివరిసారి, ఇక్కడ ఫిన్లాండ్‌తో జరిగిన ఓ స్నేహపూర్వక మ్యాచ్‌లో నాయకత్వం వహించాడు. 2-0 తేడాతో విజయాన్ని సాధించిపెట్టాడు.

09/02/2016 - 01:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఒకసారి గాయపడితే, మళ్లీ పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించుకోవడం కష్టమని భారత బాడ్మింటన్ క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్ అన్నాడు. ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న అతను గురువారం పిటిఐతో మాట్లాడుతూ తొలుత మోకాలి నొప్పి తీవ్రంగా వేధించిందని చెప్పాడు. అది కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత వెన్నునొప్పి వెంటాడిందని అన్నాడు.

09/01/2016 - 08:07

న్యూఢిల్లీ, ఆగస్టు 31: తాను గొప్ప రెజ్లర్‌నేగాక, మానవతా వాదినని కూడా నిరూపించుకున్నాడు యోగేశ్వర్ దత్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అతనిని అదృష్టం వరించి, రజత పతకం దక్కనున్న విషయం తెలిసిందే. లండన్‌లో రజత పతకాన్ని సాధించిన జార్జియా రెజ్లర్ బెసిక్ కుడఖోవ్ డోపింగ్ పరీక్షలో విఫలమైనట్టు అధికారులు ప్రకటించారు.

09/01/2016 - 08:06

నాటింహామ్, ఆగస్టు 31: పాకిస్తాన్‌తో జరిగిన మూడో వనే్డలో తన ఇన్నింగ్స్ చిరస్మరణీయమైనదని 171 పరుగులతో చెలరేగిన ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హాలెస్ అన్నాడు. అతని విజృంభణకు జో రూట్, జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్ అర్ధ శతకాలు కూడా జత కలవడంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 444 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. వనే్డ చరిత్రలోనే అత్యధిక పరుగులను కొల్లగొట్టి, రికార్డు సృష్టించింది.

Pages