S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/27/2016 - 05:43

కింగ్‌స్టన్, ఆగస్టు 26: వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడేసి స్వర్ణాలను సాధించి, ‘ట్రిపుల్ హ్యాట్రిక్’ను నమోదు చేసిన ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, అతనికి కూడా కొంత మంది అభిమాన క్రీడాకారులు లేకపోలేదు. వారిలో పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ఒకడు.

08/27/2016 - 05:43

లండన్, ఆగస్టు 26: బంగ్లాదేశ్ పర్యటనకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు బంగ్లాదేశ్‌లో ఇంగ్లాండ్ జట్టు రెండు టెస్టులు, మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాల్సి ఉంది. అయితే, ఇటీవల ఢాకాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి, 20 మందిని బందీలు పట్టుకొని హతమార్చిన సంఘటనతో ఇసిబి ఆందోళనకు గురైంది. బంగ్లాదేశ్‌కు జట్టును పంపరాదని అనుకుంది.

08/27/2016 - 05:43

బెంగళూరు, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్‌లో తాను పాల్గొన్నప్పుడు భారత అధికారులు ఎవరూ స్టాల్స్‌లో లేరని, కనీసం మంచినీరు ఇచ్చే వారు కూడా కరవయ్యారని రన్నర్ ఒపి జైష చేసిన ఆరోపణలపై ఏర్పాటైన కమిటీ విచారణ జాప్యం కానుంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న జైషకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు.

08/27/2016 - 05:42

బెంగళూరు, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్వైన్ ఫ్లూతో మరో అథ్లెట్ ఆసుప్రతి పాలైంది. మారథాన్ రన్నర్ ఒపి జైష రియోలోనే అనారోగ్యానికి గురికాగా, స్వదేశానికి వచ్చిన తర్వాత ఆమెను ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. బ్రెజిల్‌ను కుదిపేస్తున్న జికా వైరస్ ఆమెకు సోకిందేమోనన్న అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, చివరికి ఆమెకు స్వైన్ ఫ్లూ వచ్చినట్టు వైద్య పరీక్షల్లో స్పష్ట

08/26/2016 - 11:31

వార్సా (పొలాండ్‌) : పొలాండ్‌ డిస్కస్‌ త్రో ఆటగాడు పియోటర్‌ మలచోస్కీ రియో ఒలింపిక్స్‌ పోటీల్లో ఎంతో కష్టపడి సాధించిన రజత పతకాన్ని అమ్మేశాడు. కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి చికిత్స కోసం తన పతకాన్ని వేలానికి పెట్టాడు. మూడేళ్ల తన కుమారుడు కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని ఓ మహిళ నుంచి పియోటర్‌కు లేఖ వచ్చింది.

08/26/2016 - 02:20

కొలంబో, ఆగస్టు 25: శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మన్ దిల్షాన్ తిలకరత్నే వనే్డ, టి-20 ఫార్మెట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లే తనకు ఈ ఫార్మెట్స్‌లో చివరివని తెలిపాడు. ఆసీస్‌తో శ్రీలంక ఆదివారం చివరి వనే్డ, సెప్టెంబర్ 9న చివరి టి-20 మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లతోనే తన కెరీర్ కూడా ముగుస్తుందని దిల్షాన్ స్పష్టం చేశాడు.

08/26/2016 - 02:18

ఫ్లోరిడా, ఆగస్టు 25: మియామీ హీట్స్ బాస్కెట్‌బాల్ సెంటర్‌లో భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ సందడి చేశాడు. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఇక్కడికి చేరుకుంది. ఆటగాళ్లకు ఆటవిడుపు లభించడంతో కొంత మంది పరిసర ప్రాంతాలను తిలకించడానికి, మరికొంతమంది షాపింగ్ చేయడానికి వెళ్లారు. కొందరు తాము బస చేసిన హోటల్ గదులకే పరిమితయ్యారు.

,
08/26/2016 - 02:16

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రపంచ మాజీ నంబర్ వన్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా నాలుగు స్థానాలను కోల్పోయి, తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం సైనా ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉండగా, రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు అమ్మాయి పివి సింధు పదో స్థానంలో కొనసాగుతున్నది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ పదో స్థానంలో ఉన్నాడు.

08/26/2016 - 02:16

పయాంగ్యాంగ్, ఆగస్టు 25: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాంగ్ ఉన్ అసలే నియంత. దానికితోడు అంతులేని మూర్ఖత్వం. తన మాటే చెల్లుబాటు కావాలన్న పట్టుదల. ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్రంగా స్పందిస్తాడు. అతని ఈ అలవాట్లే ఉత్తర కొరియా అథ్లెట్లకు సమస్యలను కొనితెచ్చింది. రియో ఒలింపిక్స్‌కు వెళుతున్నప్పుడే కనీసం ఐదు స్వర్ణాలుసహా 17 పతకాలు సాధించి తిరిగి రావాలని అథ్లెట్లను కిమ్ ఆదేశించాడు.

08/26/2016 - 02:11

సౌతాంప్టన్, ఆగస్టు 25: పాకిస్తాన్‌తో జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌ను 44 పరుగుల తేడాతో గెల్చుకున్న ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 260 పరుగులు చేసింది. అజర్ అలీ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సర్ఫ్‌రాజ్ అహ్మద్ (55) అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. బాబర్ ఆజమ్ 40 పరుగులతో రాణించాడు.

Pages