S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/08/2016 - 04:57

రియో డి జెనీరో: భారత్, జపాన్ జట్ల మధ్య మహిళల గ్రూప్ ‘బి’లో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ సాధించాయి. ఆరంభంలో వెనుకబడినప్పటికీ, ఆతర్వాత కోలుకున్న భారత్ ఓటమిని తప్పించుకోవడం విశేషం. మ్యాచ్ 15వ నిమిషంలో ఎమీ నిషికోరి, 28వ నిమిషంలో మీ నాకషిమా ద్వారా జపాన్‌కు రెండు గోల్స్ లభించాయి. ఈ దశలో తీవ్రమైన ఒత్తిడికి గురైన భారత్ ఎదురుదాడికి ఉపక్రమించింది.

08/08/2016 - 04:57

రియో డి జెనీరో: నిరసన ప్రదర్శనలు, భద్రతా సిబ్బంది లాఠీచార్చి, టియర్‌గ్యాస్ ప్రయోగాలతో అట్టుడుకుతున్న రియోలో మీడియా ప్రతినిధు ఉన్న టెంట్‌కు బులెట్ తగలడం తీవ్ర గందరగోళానికి కారణమైంది. మీడియా ప్రతినిధులు, అధికారులు కూర్చొని ఉండగా, ఒక్కసారిగా బులెట్ టెంట్ పైభాగం నుంచి దూసుకొచ్చినంది న్యూజిలాండ్ టీవీ పేర్కొంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని, కివీస్ అధికారి ఒకరికి తృటిలో ప్రమాదం తప్పిందని తెలిపింది.

08/08/2016 - 04:56

రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌లో షూటర్లు నిరాశ పరుస్తున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పతకం సాధించే సత్తా ఉన్న జీతూ రాయ్ క్వాలిఫయింగ్ రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేసినా, ఫైనల్స్‌లో విఫలమయ్యాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టైటిల్ రేసులో ముందుంటుందని అనుకున్న హీనా సిద్ధు ఎవరూ ఊహించని విధంగా క్వాలిఫయింగ్ రౌండ్స్ నుంచే నిష్క్రమించింది.

08/08/2016 - 04:55

రియో డి జెనీరో: టేబుల్ టెన్నిస్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. టైటిల్ సాధించే అవకాశాలు ఉన్నాయనుకున్న ఆచంట శరత్ కమల్ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించడంతో టీటీలో నలుగురితో బరిలోకి దిగిన భారత్ పోరు ముగిసింది. రుమేనియాకు చెందిన వెటరన్ ఆటగాడు క్రిసాన్ ఆడ్రియన్‌తో తలపడిన శరత్ కమల్ 12-14, 11-9, 6-11, 8-11 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. ఈ మ్యాచ్ కేవలం 35 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం.

08/08/2016 - 04:54

రియో డి జెనీరో: భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సైకోమ్ మీరాబాయ్ చాను 48 కిలోల విభాగంలో దారుణంగా విఫలమైంది. ప్రారంభపు వెయిట్‌ను కూడా ఎత్తలేకపోయింది. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో మూడుసార్లు కనీస బరువును కూడా ఎత్తలేకపోయింది. మొదట క్లీన్ అండ్ జెర్క్‌లో 104 కిలోల బరవును ఎత్తడానికి విఫలయత్నం చేసింది. రెండు, మూడు ప్రయత్నాల్లో మరో రెండు కిలోలను పెంచి, 106 కిలోల బరువును ఎత్తేందుకు సిద్ధపడినా, చేతులెత్తేసింది.

08/07/2016 - 02:46

రియో డి జెనీరోలో 31వ ఒలింపిక్స్ ఆరంభం అదిరిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మొదలైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రెజిల్ సంప్రదాయ సంగీత, నృత్య రూపకాలు అలరించాయి. భారత బృందానికి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఏస్ షూటర్ అభినవ్ బింద్రా నాయకత్వం వహించాడు. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న బ్రెజిల్ ఒలింపిక్స్‌కు సమర్థంగా ఆతిథ్యమిస్తుందా? అన్న అనుమానాలకు ప్రారంభోత్సవ వేడుక తెరదించింది.

08/07/2016 - 00:48

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియో ఒలింపిక్స్‌లో అమెరికా మొదటి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో త్రషేర్ వర్జీనియా స్వర్ణ పతకాన్ని సాధించింది. చైనాకు ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కాయి. డూ లీ రజత పతకాన్ని అందుకోగా, ఇ సిల్లింగ్ కాంస్య పతకాన్ని స్వీకరించింది.

08/07/2016 - 00:46

రియో డి జెనీరో, ఆగస్టు 6: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 3-2 తేడాతో ఓడించింది. రూపీందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత జట్టు చివరిసారి విజయాన్ని నమోదు చేసింది. 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో తొలి విజయాన్ని సాధించింది.

08/07/2016 - 00:44

రియో డి జెనీరో, ఆగస్టు 6: బ్రెజిల్ ఆర్థికంగా, రాజకీయంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 31వ ఒలింపిక్స్‌కు రియో ఆతిథ్యంపై వ్యక్తమైన అనుమానాలు పటాపంచలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బీజింగ్, ఇంగ్లాండ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలను తలదనే్న విధంగా రియోలో ఆరంభ వేడుకలు కనువిందు చేశాయి.

08/07/2016 - 00:42

రియో డి జెనీరో, ఆగస్టు 6: బ్రెజిల్ మాజీ అథ్లెట్ వాండెర్లీ డి లిమాను అదృష్టం వరించింది. ఒలింపిక్ క్రీడాజ్యోతిని వెలిగించే అవకాశం లభించింది. మూడు పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న గుస్టావో కుయెర్టన్ ఒలింపిక్ టార్చిని స్టేడియంలోకి తీసుకొచ్చాడు.

Pages